SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు పొడిగింపు
Andhrapradesh News: వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. 32 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
SCR Extends 32 Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న 32 ప్రత్యేక రైళ్లు.. ఏప్రిల్, జూన్ వరకూ కొనసాగుతాయని తెలిపింది. ఏపీ, తెలంగాణతో సహా వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లు కొనసాగుతాయని పేర్కొంది. తిరుపతి - అకోల, పూర్ణ - తిరుపతి, హైదరాబాద్ - నర్సాపూర్, కాకినాడ టౌన్ - లింగంపల్లి, తిరుపతి - సికింద్రాబాద్, నర్సాపూర్ - బెంగళూరు రైళ్లు జాబితాలో ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ - అగర్తలా, తిరుపతి - షిరిడీ, హైదరాబాద్ - గోరఖ్ పూర్, సికింద్రాబాద్ - ధన్ పూర్ రైళ్లను సైతం పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని సూచించారు.
Extension of special trains #SCR #Summer #SpecialTrain pic.twitter.com/y7SoNjSpFt
— South Central Railway (@SCRailwayIndia) March 26, 2024
Extension of specail trains#SCR #Summer #specialtrain pic.twitter.com/t4kr6Ebr0I
— South Central Railway (@SCRailwayIndia) March 26, 2024
Also Read: Vizag Airport: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్ - 24 గంటలూ అందుబాటులోకి విశాఖ ఎయిర్ పోర్ట్