కన్నతండ్రి గొంతు కోసి చంపిన తనయుడు - పెళ్లి చేయలేదని ఘాతుకం
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తనకు పెళ్లి చేయలేదని అక్కసుతో ఓ యువకుడు తన తండ్రి గొంతు కోసి హతమార్చాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఏపీలో దారుణం జరిగింది. తనకు పెళ్లి చేయలేదనే అక్కసుతో ఓ యువకుడు కన్నతండ్రినే హతమార్చాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలోని కనకదుర్గమ్మ కాలనీలో బాలభద్రాచారి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అతని కుమారుడు గురునారాయణ తనకు పెళ్లి కాలేదనే అక్కసుతో మనస్తాపం చెందాడు. శనివారం తెల్లవారుజామున తన తండ్రిని బయటకు తీసుకెళ్లాడు.
పథకం ప్రకారం
ఈ క్రమంలో పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో గురునారాయణ, తండ్రి బాలభద్రాచారిపై దాడి చేశాడు. గొంతు కోసి తండ్రిని హతమార్చాడు. అనంతరం తానూ గొంతు కోసుకున్నాడు. అతనికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కేసు నమోదు
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.