’అందాల ఆడబొమ్మ’ అంటూ శాంతి, మదన్మోహన్ డాన్స్- సోషల్ మీడియాలో వీడియో వైరల్
Shanti - subhash issue: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి డాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆరోపణలు చేసిన మదన్మోహన్‌తో డాన్స్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది.
Shanthi Dance Video Virul : దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసిన శాంతి వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. శాంతి మాజీ భర్త మదన్మోహన్ ఇటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలంటూ బాంబ్ పేల్చారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మదన్మోహన్ వైసీపీకి చెందిన ఒక రాజ్యసభ ఎంపీపై అనుమానాలను వ్యక్తం చేసేలా మాట్లాడడం, దానిపై ఆ ఎంపీ కూడా మీడియా సమావేశాన్ని పెట్టి మరీ ఖండించడం తెలిసిందే.
ఈ క్రమంలో శాంతి కూడా మీడియా ముందుకు వచ్చి మదన్మోహన్‌తో తాను విడాకులు తీసుకున్నానని, మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు చెప్పింది. తన బిడ్డకు తండ్రి సుభాష్ అంటూ శాంతి మీడియా ముఖంగా వెల్లడించింది. దీన్ని సుభాష్ కూడా తాజా ఖండించడంతో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. శాంతికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. శాంతి, మదన్మోహన్ బీచ్ వద్ద డాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ’అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ.. అట్టాగ చూడకమ్మ.. కందిపోతుంది కన్నె జన్మ’ అంటూ సాగిన ఈ వీడియోలో ఇద్దరూ డాన్స్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలు మేజర్ చానెల్స్‌లో కూడా పబ్లిష్ చేయగా, వేలాది మంది ఈ వీడియోను చూసి కామెంట్లు చేస్తున్నారు.
ట్విస్టులు మీద ట్విస్టులు
శాంతి, ఆమెకు పుట్టిన బిడ్డ వ్యవహారంపై భర్త మదన్మోహన్ ఆరోపణలు చేయగా, ఈ వ్యవహారం రాజకీయంగాను కలకలం సృష్టించింది. విశాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేసిన సమయంలో ఆమెకు వైసీపీకి చెందిన ఎంపీతో ఏర్పడిన సంబంధాలపై మదన్మోహన్ ఆరోపణలు చేయగా, ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. దీనిపై విజయసాయిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ ఘాటుగా స్పందించారు. తనపై కథనాలు ప్రచురించిన వారిపై చర్యలు తీసుకుంటానని, పార్లమెంట్‌కు ఈడుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా, ఉంటే తన బిడ్డకు తండ్రిగా శాంతి చెబుతూ వచ్చిన సుభాష్ కూడా తనకు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. శాంతి బిడ్డకు తాను తండ్రిని కాదంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను ఆస్పత్రిలో సహాయం చేశానని, సంతకం చేసినంత మాత్రాన ఇరికించే ప్రయత్నం చేయడం దేనికంటూ ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ విషయంపై శాంతి ఎలా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడక తప్పదు.