అన్వేషించండి

Kommineni Resign : ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా - ఎందుకంటే ?

Andhra News : ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ పదవికి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్లేనని మీడియాకు తెలిపారు.


Kommineni : ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు రాజీనామా చేశారు.  వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా ఇవ్వనున్నట్లు కొమ్మినేని శ్రీనివాస రావు ప్రకటించారు. ఈ నెల 16 వరకు ప్రభుత్వ సెలవులు వున్న దృష్ట్యా 17 వ తేదీనుంచి తమ రాజీనామా  అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తమపై నమ్మకంతో కేబినెట్ మంత్రి హోదా తో మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్య మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ప్రకటన ను  ఆయన మీడియా కు విడుదల చేశారు.                    

2022 నవంబర్ 10వతేది న తాము చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టానని కొమ్మినేని తెలిపారు.   13 నెలల 15 రోజులు  కాలంలో  పూర్తి గా తన  సామర్ధ్యాన్ని వినియోగించి వర్కింగ్ జర్నలిస్టుల కోసం పలు కార్యక్రమాలు  చేయగలగడం తమకు సంతృప్తినిచ్చింద కొమ్మినేని చెప్పుకొచ్చార.  గ్రామీణ, పట్టణ జర్నలిస్టులు, జర్నలిజం పై అభిరుచి కలిగిన వ్యక్తుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో "జర్నలిజం లో డిప్లమో" కోర్సును నాగార్జున యూనివర్సిటీ సహకారంతో పూర్తి చేశానన్నారు.  అదేవిధంగా, డిప్లమో కోర్సు  తో పాటుగా, ప్రతి శనివారం వర్కింగ్ జర్నలిస్టులకోసం సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాల పై ఆన్ లైన్ శిక్షణ తరగతులు నిర్వహించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.                          

రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పత్రికా ముఖంగా ప్రజలకు వివరించగలిగామని ఆయన పేర్కొన్నారు. అనంతపురం నుంచి ఉద్దానం (శ్రీకాకుళం జిల్లా) వరకు జరిపిన పర్యటనల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోజెక్టుల అభివృద్ధిని, ఉద్దానం కిడ్నీ వ్యాధుల పరిశోధనా కేంద్రం వంటి అభివృద్ధిని స్వయంగా పరిశీలించి ప్రజలకు మీడియా ద్వారా వివరించగలిగామని ఆయన తెలిపారు. ప్రింట్,ఎలెక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియాను కూడా సమాచార చేరవేతలో భాగస్వామిని చేయగలిగామన్నారు.                       

తమ పదవీ కాలంలో సహకరించిన మీడియా మిత్రులందరికీ, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆ ప్రకటనలో కొమ్మినేని శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా అకాడెమీ చైర్మన్ గా నియమితులు కాక ముందు కొమ్మినేని శ్రీనివాసరావు  ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన సాక్షి టీవీలో పని చేసేవారు. చర్చా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఎన్నికలు సమీపిస్తున్నందున మరోసారి సాక్షి టీవీలో కీలక బాధ్యతలు నిర్వహించడానికి వెళ్తున్నారో లేకపోతే.. ప్రభుత్వ పెద్దలతో ఎమైనా అభిప్రాయ బేధాలు వచ్చాయా అన్నదానిపై స్పష్టత లేదు.                                          
  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Embed widget