Sarath Babu Death: నటుడు శరత్ బాబు మృతిపట్ల ఏపీ సీఎం జగన్, చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Celebrities condolences Actor Sarath Babu: నటుడు శరత్ బాబు మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Celebrities condolences Actor Sarath Babu: టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు శరత్ బాబు సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి కిడ్నీస్ ఫెయిల్యూర్, బ్లడ్ ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం కొన్నిరోజుల కిందట హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్‌లో చేర్పించారు. తీవ్ర అస్వస్థతకు గురైన శరత్ బాబు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలియగానే నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. శరత్ బాబు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
వైఎస్ జగన్ సంతాపం..
‘తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/NaTgovOKOW
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2023
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం..
సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూశారన్న విషయం తెలియగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సినిమాల్లో, సీరియల్స్‌లో వివిధ పాత్రలతో మెప్పించిన శరత్‌బాబు లేని లోటు తెలుగుచిత్ర పరిశ్రమకు పూడ్చలేనిది అన్నారు. శరత్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
సీనియర్ నటుడు శ్రీ శరత్ బాబు గారు కన్నుమూశారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. సినిమాల్లో, సీరియల్స్‌లో వివిధ పాత్రలతో మెప్పించిన శరత్‌బాబు లేని లోటు తెలుగుచిత్ర పరిశ్రమకు పూడ్చలేనిది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/p5qiNDSjvo
— G Kishan Reddy (@kishanreddybjp) May 22, 2023
ప్రముఖ సీనియర్ సినీ నటులు శరత్ బాబుగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. వివిధ భాషాచిత్రాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి దక్షిణాది సినీ పేక్షకులను మెప్పించిన శరత్ బాబు గారి మృతి సినీరంగానికి తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తూ, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ప్రముఖ సీనియర్ సినీ నటులు శరత్ బాబుగారి మరణవార్త దిగ్భ్రాంతిని కలిగించింది. వివిధ భాషాచిత్రాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి దక్షిణాది సినీ పేక్షకులను మెప్పించిన శరత్ బాబు గారి మృతి సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తూ, ప్రగాఢ సంతాపాన్ని… pic.twitter.com/nPjdGPgOQd
— N Chandrababu Naidu (@ncbn) May 22, 2023
బండి సంజయ్ సంతాపం..
సీనియర్ నటుడు శరత్ బాబు మరణంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో మరిచిపోలేని పాత్రలు పోషించిన శరత్ బాబు మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.
Saddened by the demise of senior actor Sharath Babu garu. The unfortunate death of the artist who played many roles in Telugu and other languages is a great loss to the film industry and Telugu people.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 22, 2023
Deepest condolences to family members and fans of Sharath Babu.
Om Shanti🙏🏻 pic.twitter.com/xVFhkmqj3W
నారా లోకేష్ సంతాపం..
‘సీనియర్ సినీ నటులు శరత్ బాబు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. దశాబ్దాల సినీజీవితంలో తాను పోషించిన పాత్రలకే వన్నెతెచ్చిన నటులు కన్నుమూయడం టాలీవుడ్‌కి తీరనిలోటు.శరత్ బాబు గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
సీనియర్ సినీ నటులు శరత్ బాబు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను.దశాబ్దాల సినీజీవితంలో తాను పోషించిన పాత్రలకే వన్నెతెచ్చిన నటులు కన్నుమూయడం టాలీవుడ్‌కి తీరనిలోటు.శరత్ బాబు గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/HoFl7EJlN6
— Lokesh Nara (@naralokesh) May 22, 2023
ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందడం పట్ల ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నటుడి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.
ప్రముఖ నటుడు శరత్ బాబు గారు మృతి చెందడం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/8UTFSSi3cA
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 22, 2023