News
News
X

Breaking News Telugu Live Updates: చిత్తూరు జిల్లాలో జల్లికట్టులో అపశ్రుతి, ఇద్దరు మృతి  

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

FOLLOW US: 
చిత్తూరు జిల్లాలో జల్లికట్టులో అపశ్రుతి, ఇద్దరు మృతి  

Jallikattu : చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని సి.బండపల్లిలో నిర్వహించిన జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. జల్లికట్టులో ఇద్దరు యువకులు మృతి చెందారు. ముట్టుకురుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ మందడి,  తమిళనాడు కృష్ణగిరికి చెందిన మరో వ్యక్తి మృతి చెందారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు  చేయకపోవడంతో ఘటన జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సంప్రదాయ క్రీడగా జల్లికట్టు నిర్వహిస్తున్నారు. జల్లికట్టు నిర్వహించకూడదని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. 

డ్రైవర్‌కు ఫిట్స్ - డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన పెళ్లి కారు

కృష్ణాః బాపులపాడు మండలం అంపాపురం జాతీయ రహదారిపై రుచి పామాయిల్ కంపెనీ సమీపంలో డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన పెళ్లి కారు
అత్తిలి లో వివాహం చేసుకొని వరుడు నివాసానికి హైదరాబాదు వెళుతుండగా రోడ్డు ప్రమాదం
కార్ డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో కల్వర్టును ఢీకొట్టాడు
పెళ్లి కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు...
సంఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ లో చిన్న అవుటపల్లి పిన్నమనేని ఆసుపత్రికి ఐదుగురిని తరలించారు
గాయపడ్డవారిని గాయత్రి (26)రేణుక(23) శివశంకర్ (25) సీతారావమ్మ(47) శరత్(27) లుగా గుర్తింపు
అత్తిలిలో వధువు ఇంటి వద్ద వివాహం చేసుకొని హైదరాబాదు వెళుతుండగా ఘటన
రాత్రి పెళ్లి చేసుకొని వస్తున్న పెళ్లికూతురు పెళ్ళికొడుకు కూడా ఉన్నారు

నేడు 11వ రోజు బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర" 

నేడు 11వ రోజు బండి సంజయ్ "ప్రజా సంగ్రామ యాత్ర" 
"హర్ ఘర్ తిరంగా జెండా " కార్యక్రమంలో భాగంగా ఆమ్మన బోలులోని పాదయాత్ర  శిబిరం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పాదయాత్ర ప్రారంభించారు.
ఇవాళ పోడుచేడు, బుజ్జిలపురం మీదుగా మోత్కూర్ వరకు కొనసాగనున్న పాదయాత్ర
నేటి రాత్రి మోత్కూర్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస 
నేడు మొత్తం 15KM మేర కొనసాగనున్న బండి సంజయ్ పాదయాత్ర

Nagarjuna Sagar Water level: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద, 24 గేట్లు ఎత్తిన అధికారులు

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు ఎత్తివేసి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్ట్‌లో ఇన్ ఫ్లో 4,39,987 క్యూసెక్కులు మేర వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఔట్ ఫ్లో 4,11,376 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 586.50 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు... ప్రస్తుత నీటి నిల్వ 302.91 టీఎంసీలకు చేరింది

Background

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తగ్గిపోతుండగా.. మరో అల్పపీడనం నేడు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరో 12 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఏపీ, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. 
తెలంగాణలో భారీ వర్షాలు
ఓ అల్పపీడనం ముప్పు తొలగిపోగా, నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది మరో 12 గంటల్లో బలపడి ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో శనివారం, ఆదివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో 24 గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు అక్కడక్కడ మాత్రమే కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ లో నైరుతి దిశ నుంచి గాలులు గంటకు 8 నుంచి 12 కి.మీ వేగంతో వీచనున్నాయి.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లులు..
తాజాగా ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంలపై ఉంది. నేటి నుంచి రెండు రోజులపాటు శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో ఈ 5 జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఆగస్టు 16 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తీరంలో గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు. 

దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మరో నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. అయితే ఒకట్రెండు చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.  
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపో యే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు. 

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముడు అప్యాయంగా జరుపుకునే రాఖీ పండుగ రోజే బంగారం ధరలు షాకిచ్చాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. రూ.440 పెరగడంతో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,090కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 అయింది. హైదరాబాద్‌లో రూ.200 పెరగడంతో వెండి 1 కేజీ ధర నేడు రూ.64,400గా ఉంది. కరీంనగర్, వరంగల్‌లో 24 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.52,090 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 గా ఉంది. వెండి కేజీ ధర రూ.64,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఏపీలో బంగారం ధరలు.. 
ఏపీలో బులియన్ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరిగాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,090 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 గా ఉంది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.64,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750, నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో 1 కేజీ వెండి ధర రూ.64,400 అయింది.