అన్వేషించండి

Sajjala: ఎస్సీ, బీసీ డిక్లరేషన్ అంటూ మాయ మాటలు, ఆ అర్హత చంద్రబాబుకు లేదు - సజ్జల

Sajjala Ramakrishna Reddy: వడ్డెర్ల ఆత్మీయ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు.

14 సంవత్సరాలు ముఖమంత్రిగా పని చేసినప్పుడు బీసీలను అడుగడునా మోసం చేసిన చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించమని వెళ్తే తోకలు కత్తిరిస్తానని అవమానాల పాలు చేసిన చంద్రబాబు నేడు బీసీల ఓట్ల కోసం దొంగనాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. బీసీలు అన్ని రంగాలలో అభివృధ్ది చెందాలంటూ వారికోసం నిరంతరం తపిస్తూ వారిలో నాయకత్వలక్షణాలను ప్రోత్సహిస్తున్న శ్రీ వైయస్ జగన్ అండగా రాష్ర్టంలోని బీసీలంతా ఉన్నారని సజ్జల స్పష్టం చేశారు. చంద్రబాబు మాయమాటలను నమ్మేస్దితిలో బీసీలు లేరని అన్నారు. తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన వడ్డెర్ల ఆత్మీయసమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. 

ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలుగుదేశం పార్టీ దుస్సాహసానికి ఒడిగడుతోంది. ఇది కొత్తగా పార్టీ పెట్టిన వాళ్లో,కమ్యూనిస్టు పార్టీ లాంటివాళ్లో బీసీ డిక్లరేషన్ పెట్టారంటే అర్ధముంటుంది. మూడు సార్లు అదికారంలోకి వచ్చినా 14 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చినా ప్రతిసారి చంద్రబాబు  బీసీలను మోసం చేస్తూనే ఉన్నారు. నరేంద్రమోది,పవన్ కల్యాణ్ సహకారంతో 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అదీకూడా  కేవలం 1 శాతం ఓటుతేడాతో అధికారంలోకి వచ్చారు. జన్మభూమి కమిటీలను మాఫియా గ్యాంగ్ ల్లాగా తయారుచేశారు. జన్మభూమి కమిటీలనే వ్యవస్ధను టిడిపి ప్రయోజనాలకోసం రూపొందించారు. పెన్సన్లు,మరే లబ్ది కావాలన్నా కూడా ఆ కమిటీల ద్వారా నడిచేవి.లేని మరుగుదొడ్లు,నీరు చెట్టు పధకం ద్వారా ఆ దోపిడీ విపరీతంగా సాగిందన్నారు.

ఆ అక్రమాలు, దోపిడీల నేపధ్యంలో ప్రజలు చంద్రబాబును 2019లో చెత్తబుట్టలో పడేశారు. జగన్ అనేక ఆటుపోట్లను  ధైర్యంగా ఎదుర్కొని ముఖ్యంగా 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కున్నా కూడా ఆ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజా సంకల్పయాత్ర చేశారు. ప్రజలతో మమేకమైన జగన్ గారిని ప్రజలు అక్కున చేర్చుకుని 151 స్ధానాలతో తిరుగులేని విధంగా ఘనవిజయాన్ని అందించారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధంగా గ్రామసచివాలయాలను వాలంటీర్ల వ్యవస్ధను తీసుకువచ్చారు. 

ఇక్కడ అందరూ గుర్తించాల్సింది ఏమంటే రానున్నఎన్నికలలో  మారీచులకంటే మాయోపాయాలు పన్నే,కుట్రలు చేసేవారితో యుధ్దం చేస్తున్నాం. ఎలాగైనా సరే అధికారం చేపట్టాలనే భావనతో చంద్రబాబు లాంటి వారు ఉన్నారు. బీసీలకు ఎంతగా ప్రయారిటీ  ఇస్తారంటే వడ్డెర్లకు సంబందించి చూస్తే  గుంటూరులో చంద్రగిరి ఏసురత్నం లాంటి వాళ్ళు ఎంఎల్ ఏగా విజయం సాధించలేని పరిస్దితి ఉంటే ఆయనకు శాసనమండలి సభ్యులుగా అవకాశం కల్పించారు. బీసీ డిక్లరేషన్ అని మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఏమాత్రం లేదన్నారు.ఓటుబ్యాంకుగా వాడుకుని అధికారం వచ్చాక వారిని మోసం చేశారన్నారు.పచ్చమీడియాతో కలసి మాఫియాలాగా తయారు చేసి బీసీ డిక్లరేషన్ అంటూ బీసీ లను ఉద్దరిస్తానంటూ బయల్దేరారన్నారు.అయితే బీసీలు ఎంతో చైతన్యవంతులైయ్యారని వారికి జగన్ గారు చేసిన మేలు వారికోసం అమలు చేస్తున్న సంక్షేమపధకాలు వారి మనస్సుల్లో చెరగని ముద్ర వేశాయన్నారు.

పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడితో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరు జగన్ పై  దుష్ప్రచారానికి ఒడిగట్టారు. వాటిని నమ్మే పరిస్దితిలో ప్రజలు లేరు. చంద్రబాబుకు నిజంగా బలం ఉంటే పొత్తులకోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు. 2014-19 మధ్య ప్రజలకు ఏమీ చేశారో చెప్పి ప్రజలను ఓట్లడిగే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు మంచి సేవలందుతున్నాయని గర్వంగా చెప్పగలం. మీ హయాంలో దోపీడీలు చేసిన జన్మభూమి కమిటీ లు మళ్ళీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ పై రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలు చేస్తూ... గొడ్డలి పోటు అంటూ విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

టాప్ హెడ్ లైన్స్

JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget