అన్వేషించండి

AP Pensions Late: ఏపీ సర్కార్‌పై నమ్మకం పోతోందా.. కేంద్రమే పెన్షన్ ఇవ్వాలని కోరనున్న రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు

కేంద్ర ప్రభుత్వమే తమకు పెన్షన్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలనే ఆలోచనలో ఏపీ రిటైల్డ్ సివిల్ సర్వీస్ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతినెలా ఆలస్యం కావడమే అందుకు కారణంగా చెబుతున్నారు.

" నా పెన్షన్ కూడా ఆలస్యమవుతోంది " అని ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కొద్ది నెలల కిందట ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన ఆయన పోస్టుకు అప్పట్లో పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. రాజకీయ పరమైన పోస్ట్ అనుకున్నారు. కానీ ఆయన రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి కూడా. ఆయన పెన్షన్ ఇప్పటికీ ఆలస్యంగా వస్తోంది. ఇది ఆయన ఒక్కరి సమస్య కాదు. ఏపీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులందరిదీ. ఆ మాటకొస్తే ఏపీలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరిదీ. కానీ మిగతా వారికి వేరే ఆప్షన్ లేదు.. రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులకు ఆ అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా, కేంద్రం నుంచి సైతం పెన్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కలిసి అదే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు తమ పెన్షన్ ప్రతినెలా ఆలస్యం అవుతుండటంతో అసహనానికి గురవుతున్నారు. వారంతా తమ పెన్షన్‌ను కేంద్రమే ఇవ్వాలని పిటిషన్ పెట్టుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏపీ క్యాడర్ రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో చాలా రోజులుగా పెన్షన్ల ఆలస్యంపై చర్చ జరుగుతోంది. ఏదో ఒకటి, రెండు నెలలు కాదని.. పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని... అందుకే తమ పెన్షన్లను కేంద్రమే ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకోవాలన్న అభిప్రాయానికి ఇటీవల వచ్చారని చెబుతున్నారు. దీనిపై వారంతా ఒకటిరెండు రోజుల్లో డీవోపీటీని సంప్రదించే అవకాశం ఉంది.

సివిల్ సర్వీస్ అధికారులకు పెన్షన్లు కేంద్రమే ఇస్తుంది. అయితే ఏ రాష్ట్ర క్యాడర్‌ అధికారులకు ఆ రాష్ట్రం తరఫున చెల్లిస్తారు. కేంద్రం ఆ రాష్ట్రానికి పెన్షన్ నగదు ఇస్తుంది. అయితే రాష్ట్రం నుంచి తీసుకోవడానికి ఇష్టం లేకపోతే.. వారు నేరుగా కేంద్రం నుంచి తమకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరవచ్చు. ఇప్పుడీ అవకాశాన్ని వినియోగించుకోవాలని రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా జీతభత్యాల విషయాన్ని ప్రభుత్వాలు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని చెల్లింపులు చేస్తాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రయారిటీని తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగులు.. పెన్షనర్లకు ఎప్పుడు తమ జీతాలు. పెన్షన్లు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తమకు అవకాశం ఉంది కనుక కేంద్రం నుంచే తమకు పెన్షన్ ఇవ్వాలని కోరేందుకు సివిల్ సర్వీస్ అధికారులు నిర్ణయించుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ నెల కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకూ పెన్షనర్లకు చెల్లింపులు చేయలేదు. కొంత మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లించారు. అయితే ఆ మొత్తాన్ని ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) కింద తీసుకుని చెల్లించారు. ఈ మంగళవారం బాండ్ల వేలం ద్వారా రూ. రెండు వేల కోట్లను అప్పుగా తీసుకున్న ఏపీ.. ఆ మొత్తాన్ని ఓడీ కింద జమ చేసింది. ఇంకా కొంత మొత్తాన్ని కట్టాల్సి ఉంది. ఇప్పుడు... ఇంకా ఎక్కడైనా నిధులు దొరుకుతాయేమోనని ఏపీ ప్రభుత్వం చూస్తోంది.  దొరక్కపోతే... పన్నుల ఆదాయం.. కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తే, వాటితో  పెండింగ్‌లో ఉన్న జీతాలు, పెన్షన్లు చెల్లించాలని యోచిస్తోంది. ఇలాంటి తరుణంలో సివిల్ సర్వీస్ అధికారులు కూడా తమకు ఏపీ ప్రభుత్వం నుంచి వద్దని కేంద్రం నుంచి పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకుంటే అది ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచించే అవకాశం కనిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget