Chandrababu Rajshyamala Yagam : ఎన్నికల సీజన్‌లో యాగాలు - చంద్రబాబు నివాసంలో రాజశ్యామల హోమం
Chandrababu Rajshyamala Yagam : చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న యాగంలో తొలి రోజు చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.
Chandrababu Rajshyamala Yagam : టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. యాభై మంది రుత్విక్కుల ఆధ్వర్యంలో శుక్రవారం యాగం ప్రారంభమయింది. తొలి రోజు చంద్రబాబు దంపతులు యాగక్రతవులో పాల్గొన్నారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సంద ర్భంగా చంద్రబాబు-భువనేశ్వరి హోమాలు నిర్వహించారు. గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో రిత్వికులు యాగం నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు....
— Team Lokesh (@Srinu_LokeshIst) February 16, 2024
నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరగనుంది....
ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు మరియు భువనేశ్వరి పాల్గొన్నారు....
50 మంది రిత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు... pic.twitter.com/o6FJKQENLQ
గత డిసెంబర్ లోనూచంద్రబాబు నివాసంలో యాగం జరిగింది. అప్పుడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు.
ఎన్నికలకు ముందు రాజకీయ నాయకుల హోమాలు
రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు యాగాలు నిర్వహించడం కామన్ గా వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ లోని తన నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇక కేసీఆర్ ఎన్నికలతో పాటు ఏ ముఖ్యమైన పని చేయాలనుకున్నా యాగం నిర్వహిస్తారు. ఎన్నికలకు ముందు పామ్ హౌస్ లో శారదాపీఠాధి స్వరూపానంద సమక్షంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. కానీ ఆయన యాగం ఫలితాన్నివ్వలేదని.. ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతుంది.
రాజధాని ఫైల్స్ కు తొలగిన అడ్డంకులు - రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సీఎం జగన్ కోసం కూడా హోమాలు చేసిన స్వరూపానంద
స్వరూపానంద కేవలం కేసీఆర్ కు మాత్రమే కాదు ఏపీ సీఎం జగన్ కు కూడా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం దాదాపుగా ఏడాది పాటు ఓ ప్రదేశంలో యాగం చేశారు. జగన్ కూడా ఆ యాగానికి వెళ్లారు. తర్వాత కూడా చేశారని చెబుతున్నారు. ఈ సారి జగన్ కోసం రాజశ్యామల యాగాలు స్వరూపానంద చేస్తున్నారో లేదో స్పష్టత లేదు.. కానీ చంద్రబాబు దంపతులు మాత్రం.. రాజశ్యామల యాగం పూర్తి చేస్తున్నారు.