By: ABP Desam | Updated at : 01 May 2023 03:27 PM (IST)
రజనీకాంత్‌కు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో ట్రెండింగ్
Rajini Fans Vs YSRCP : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజనీకాంత్ చంద్రబాబును పొగిడిన అంశంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు చేస్తున్న విమర్శలు వివాదాస్పదం అవుతున్నాయి. వైసీపీ నేతలు గత రెండు రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రజనీకాంత్ తో పాటు ఆయన కుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్, చంద్రబాబుతో తనకున్న అనుబంధాన్ని రజనీ గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో వారిని పొగిడారు. దీంతో రజనీ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.
#YSRCPApologizeRAJINI
— வானவராயன் (@Itsme0911) April 30, 2023
EMPEROR OF SCAM @ysjagan
Petrol & diesel price are soaring high in AP..jagan party is not caring that & behaving like cheap morons..insecurity at peak..#Thalaivar #Rajinikanth is 💯 right.. pic.twitter.com/mg1JGWCZyo
మంత్రి రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు తదితరులు కోలీవుడ్ సూపర్ స్టార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదని, ఆయన తమిళనాడులో హీరో కావొచ్చు గానీ ఇక్కడ కాదని, పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాయలేని విధంగా కొడాలి నాని సహా పలువురు నేతలు దూషించడంతో రజనీకాంత్ అభిమానులు మండి పడుతున్నారు. వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
This is how @YSRCParty works, if something's not in their favour they stoop so low and start character assassination.
— The Protagonist (@KalyanForever_) April 30, 2023
Rajini didn't utter a word about @ysjagan or the party..but their low life social media started targeting him.#YSRCPApologizeRAJINI pic.twitter.com/mtBlRvhC9v
రజనీకాంత్‌ను విమర్శించిన వారిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #YSRCPApologizeRajini అనే హ్యాట్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ‘రజనీ ఎన్టీర్, చంద్రబాబులతో తనకున్న అనుబంధంపై మాత్రమే మాట్లాడారు. ఆయన ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయలేదు కదా’ అంటూ అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో రజనీకాంత్ సినిమా లోని ఫేమస్ డైలాగులతో వైసీపీ నాయకులపై మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
10 days back this shameless bitch Roja selvamani was running behind Rajini sir for shaking hands at meena's 40 years event, Today she is showing her chameleon colors.#YSRCPApologizeRAJINI pic.twitter.com/emDyZkJy1R
— Jagadeesh (@JagadeeshChow3) April 30, 2023
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్షిప్ వివరాలు ఇలా!
AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !
Project K: ‘ప్రాజెక్ట్ కె’లో విలన్ పాత్రకు కమల్ అంత డిమాండ్ చేశారా? అసలు నిజం ఇది!