అన్వేషించండి

Pawan Kalyan: “ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్

ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిపై చేసిన విమర్శలపై.. వైసీపీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది.

YSRCP On Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎప్పుడైతే అధికారం చేతులు మారిందో (AP New Government) అప్పటి నుంచి ఎన్డీయే కూటమి (NDA) వర్సెస్ వైసీపీ (YSR Congress) అన్నట్టుగా విమర్శలు, ప్రతి విమర్శలు జోరందుకుంటున్నాయి. ఈ మాటల దాడిలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) కాస్త ముందు నిలుస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ.. జోరు చూపిస్తున్నారు. తాజాగా.. తన నియోజకవర్గం పిఠాపురం (Pithapuram MLA Pawan Kalyan) పర్యటనకు వెళ్లిన పవన్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి (Former Minister Peddireddy) ని లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. ఇదే అదనుగా.. వైసీపీ సీనియర్ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం.. పవన్ టార్గెట్ గా కౌంటర్ అటాక్ ఇస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగింది.. పవన్ ఏమన్నారు.. ప్రతిగా వైసీపీ నేతలు ఏమంటున్నారు?

పిఠాపురంలో జన సైనికులతో సమావేశం అయిన పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వ హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ (Red Sandal Smuggling) జరిగిందని ఆరోపించారు. నేపాల్ లో మన ఎర్ర చందనం పట్టుబడిందని అన్నారు. మన ఆంధ్రాలోని చెక్ పోస్టు (Andhra Pradesh Check posts)  ల దగ్గర ఎంత నిర్లక్ష్యంగా సిబ్బంది పని చేశారన్నది ఈ విషయంతో అర్థమవుతోందని దుయ్యబట్టారు. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి పేర్లను కూడా మధ్యలోకి లాగారు. నేపాల్ పోలీసులకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఎవరో తెలియదు కదా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలారు. నేపాల్ లో పట్టుబడిన ఆంధ్రా ఎర్ర చందనం వెనక.. ఆ ఇద్దరే ఉన్నారన్నట్టుగా కామెంట్లు చేశారు. ఆ ఫైల్ ఇప్పుడు తన దగ్గరికే వచ్చిందన్నారు.

ఇలా పవన్ మాట్లాడ్డంతో.. వైసీపీ నేతలు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ పార్టీ నేత మిథున్ రెడ్డి.. ఎక్స్ లో ఈ విషయంపై స్పందించారు. పవన్ మాట్లాడిన బైట్ కు స్పందనగా సవాల్ విసిరారు. చేసిన ఆరోపణలను నిరూపించకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పేందకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. గత పాతికేళ్లలో జరిగిన ఎర్ర చందనం అక్రమాలపై ఎలాంటి విచారణ జరిగినా తాను సిద్ధమే అని తేల్చి చెప్పారు. సత్యశోధన పరీక్షకైనా సరే.. తాను సిద్ధమన్నారు. దీక్షలో ఉండి కూడా పవన్ కల్యాణ్ ఇలా అలవోకగా అబద్ధాలు ఆడుతున్నారని.. ఇలా ఎంతకాలం తమ పార్టీ నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడతారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

ఇదే విషయంపై.. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా తీవ్రంగా స్పందించింది. ఆరోపణలు చేయడం.. ఆధారాలు అడిగితే మౌనంగా ఉండడం పవన్ కు అలవాటుగా మారిపోయిందని కామెంట్లు చేసింది. వాలంటీర్లు వుమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నట్టు గతంలో ఆరోపణలు చేసిన పవన్.. వాటిని నిరూపించలేకపోయారంది. ఇప్పుడు పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని.. కనీసం వాటినైనా నిజాయితీగా సాక్ష్యాలు బయటపెట్టి నిరూపించగలరా.. అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వైసీపీ సోషల్ మీడియా విభాగం సవాల్ విసిరింది. ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ చదివారన్నదీ 30 ఏళ్లుగా చెప్పలేకపోతున్నారంటూ పవన్ ను ఎద్దేవా చేస్తూ.. చదువు గురించి ఆయన ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించింది.. వైసీపీ సోషల్ మీడియా విభాగం. చూస్తుంటే.. రానురాను పవన్ కేంద్రంగా కూటమి వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Tata Altroz ​​Racer: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
తెలంగాణ బీజేపీ ఎవర్ని కాపాడుతోంది ? రేవంత్‌నా ? కేటీఆర్‌నా ?
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Tata Altroz ​​Racer: టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
టాటా అల్ట్రోజ్ రేసర్‌పై భారీ డిస్కౌంట్ - ఎంత తగ్గుతుందో తెలుసా?
BRS And Congress On Lagacherla Issue: లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
లగచర్లలో పొలిటికల్ రేస్‌- బాధితులకు న్యాయం చేసేది ఎవరు?
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
TECNO POP 9: 6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
6 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - ఐఫోన్ తరహా డిజైన్‌తో టెక్నో పాప్ 9!
Revanth Reddy: తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
తెలంగాణ సచివాలయానికి వాస్తు మార్పులు - సీఎం రేవంత్ కష్టాలు తీరుతాయా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Embed widget