అన్వేషించండి

Game Changer Event Rajahmundry: రామ్ చరణ్ గేమ్‌ ఛేంజర్‌ ప్రి రిలీజ్ ఈవెంట్‌ రాజమండ్రికి ఎందుకు షిప్ట్‌ అయిందో తెలుసా!

ఈనెల 4న జ‌ర‌గ‌నున్న గేమ్ చేంజ‌ర్ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ త‌ర‌లిరానుంది.. చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, నాగ‌బాబుతోపాటు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్‌ రాజమండ్రికి ఎందుకు షిప్ట్‌ అయ్యిందో తెలుసా..
రాజమండ్రి: కోలీవుడ్ డైరెక్టర్ శంకర్‌, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో గేమ్‌ఛేంజర్‌ మూవీ అప్డేట్‌ గురించి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. గేమ్‌ చేంజర్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందని అంతా ఊహించారు. అందరూ ఊహించినట్లుగానే గేమ్‌ఛేంజర్‌ ఈవెంట్‌ మూవీ టీమ్‌ అయితే ముందుగా కాకినాడ జిల్లాలోనే ఏర్పాటు చేయాలనుకుంది. దీనికోసం గత నెల రోజులుగా కూడా కాకినాడ - పిఠాపురం మధ్యలో మెయిన్‌ రోడ్డుకు ఆనుకుని భారీ ప్రాంగణంలో ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు. కానీ ఆఖరి నిముషంలో మాత్రం అనూహ్యంగా గేమ్‌ చేంజర్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ రాజమండ్రికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటికే వేమగిరి ప్రాంతంలో నేషనల్‌ హైవేకు ఆనుకుని ఉన్న సుమారు 40 ఎకరాల ఖాళీ స్థలంలో ఈవెంట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
 
కాకినాడలో జరగాల్సిన ఈవెంట్‌ మార్పునకు కారణం ఏంటి..
 
రామ్‌ చరణ్‌ బాబాయ్‌ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో  ఉన్నప్పుడు రామ్‌ చరణ్‌ గేమ్‌ చేంజర్‌ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఇక్కడే నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మూవీ టీమ్‌ నెల రోజుల క్రితం కాకినాడ ` పిఠాపురం మధ్య ఎక్కడైనా భారీ ప్రాంగణం గురించి పరిశీలించారు. అన్ని అనుకూలతలు ఉండేలా ఆ స్థాయిలో ముఖ్యంగా 216 జాతీయ రహదారికి ఆనుకుని ఉండేలా ప్లాన్‌ చేశారు. అయితే ఈప్రాంతంలో ఆస్థాయి భారీ ప్రాంగణం దొరకకపోవడం రాజమండ్రికి ఈవెంట్‌ మారిందనే టాక్‌ వినిపిస్తోంది. పైగా ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ఓ మహిళ మృతిచెందడం, అది పెద్ద వివాదంగా మారి.. నటుడు అల్లు అర్జున్‌ అరెస్ట్‌కు దారితీసింది. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న చిత్ర బృందం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే గోదావరి జిల్లాల్లో అనువైన ప్రాంతాన్ని వెతగ్గా రాజమండ్రికి సమీపంలోని వేమగిరిలో సుమారు 40 ఎకరాల ఖాళీ స్థలాన్ని ఖరారుచేసి ఈవెంట్‌ అక్కడే నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
 
గతంలో టీడీపీ మహానాడు
 
నేటి (శనివారం) సాయంత్రం జరగనున్న గేమ్‌ చేంజర్‌ ఈవెంట్‌ తూర్పు గోదావరి జిల్లా కడియం మండల పరిధిలోని వేమగిరిలోని నాలుగు లైన్ల జాతీయ రహదారికి ఆనుకున్న ఉన్న భారీ ప్రాంగణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. డాక్టర్‌ వెలుగంటి వెంకటాచలానికి చెందిన ఈభారీ ఖాళీ స్థలంలో గతంలో టీడీపీ మహానాడు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆతరువాత ప్రధాని మోదీ బీజేపీ భారీ బహిరంగ సభ కూడా ఇక్కడే నిర్వహించారు. సుమారు లక్ష మందికి ఎంట్రీ పాస్‌లు మూవీ టీమ్‌ ఇవ్వనుండగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్‌, ఎస్‌బీ ఏఎస్పీ మురళీకృష్ణలు సభా స్థలాన్ని పరిశీలించి ఈవెంట్‌ నిర్వాహకులతో మాట్లాడారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్లాన్‌ను సిద్ధంచేశారు.
 
ఈవెంట్‌కు హాజరు కానున్న మెగా ఫ్యామిలీ..
 
గేమ్‌చేంజర్‌ మెగా ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీ మొత్తం తరలిరానుంది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, నాగబాబుతోపాటు మెగా ఫ్యామిలీ అంతా తరలిరానుంది. దాంతో భారీగా జనసందోహం తరలివచ్చే అవకాశాలున్నందున అత్యంత భారీ భద్రత నడుమ ప్లాన్ ప్రకారం ఈవెంట్ నిర్వహించేందుకు నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget