అన్వేషించండి

Youth Buys Bike With 10 Rupee Coins: రూ.10 నాణేలతో డ్రీమ్ బైక్ కొనుగోలు చేసిన తణుకు యువకుడు, షోరూమ్ రియాక్షన్ ఇదే!

కొంచెం కష్టమైనప్పటికీ తన డ్రీమ్ బైక్ ను కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. కేవలం రూ.10 నాణేలతో మోటార్ సైకిల్ కొనుగోలు చేసి ఔరా అనిపించాడు ఆ యువకుడు.

West Godavari Youth buys a Bike with 10 Rupee coins: తన కలల బైక్ కొనుగోలు చేయాలనున్నాడు ఆ యువకుడు. కానీ అందరిలా చేస్తే విశేషం ఏముందని, కాస్త డిఫరెంట్ గా ఆలోచించాడు. కొంచెం కష్టమైనప్పటికీ తన డ్రీమ్ బైక్ ను కొనుగోలు చేసేందుకు చేసిన ప్రయత్నం ఫలించింది. కేవలం రూ.10 నాణేలతో మోటార్ సైకిల్ కొనుగోలు చేసి ఔరా అనిపించాడు ఆ యువకుడు. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన యువకుడు బొబ్బిలి రాఘవేంద్ర కేవలం 10 రూపాయల నాణేలను సేకరించి వాటితోనే బైక్ కొనుగోలు చేయడం స్థానికంగా హాట్ టాపిక్ అవుతోంది. 

తణుకు పట్టణానికి చెందిన యువకుడు రూ. 10 నాణేలతో మోటార్ సైకిల్ కొనుగోలు చేశాడు. బొబ్బిలి రాఘవేంద్ర అనే యువకుడు ఏకంగా రూ. 1.65 లక్షల విలువ చేసే 10 రూపాయల నాణేలు సేకరిచాడు. ఆ నాణేలతో వంటెద్దు సోమసుందరావు హీరో షోరూముకు వెళ్లి బైక్ కొన్నాడు రాఘవేంద్ర. నాణేలతో బైక్ కొంటానని తమకు చెప్పగానే నాణేలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు షోరూమ్ అధినేత వెంకట్ వెల్లడించారు. రూ. 10 నాణేలు మార్కెట్‌లో చెల్లుబాటు కావడం లేదనే తరచూ వదంతులు వ్యాప్తి చెందుతున్నాయని, ఈ అపోహలు తొలగించేందుకు పది రూపాయల నాణేలతోనే బైక్ కొనుగోలు చేయాలనుకున్నానని రాఘవేంద్ర తెలిపారు. అనుకున్నట్లుగానే షోరూమ్ కు వెళ్లి నాణేలతో ధర చెల్లించి hero xpulse 200 4v బైక్ సొంతం చేసుకున్నాడు. స్నేహితులు, షోరూమ్ సిబ్బంది యువకుడు రాఘవేంద్రను అభినందించారు. తాను హైదరాబాద్‌లో డేటా సైంటిస్ట్ గా పనిచేస్తున్నానని, ఇది తన తొలి బైక్ అని తెలిపాడు. 

Youth Buys Bike With 10 Rupee Coins: రూ.10 నాణేలతో డ్రీమ్ బైక్ కొనుగోలు చేసిన తణుకు యువకుడు, షోరూమ్ రియాక్షన్ ఇదే!

షో రూమ్ ఓనర్ రియాక్షన్ ఏంటంటే..
బైక్ కొనడానికి వచ్చారని తెలుసుకున్నాం. బైక్ ధర తెలుసుకున్నాక కస్టమర్ చివర్లో మోడ్ ఆఫ్ పేమెంట్ నాణేలు అని తెలిసి షాకయ్యామని షోరూమ్ ఓనర్ వెంకట్ తెలిపారు. అయితే మార్కెట్ లో రూ.10 కాయిన్లు చెల్లుబాటు అవుతున్నాయో లేదోనని తాము అనుకున్నట్లు చెప్పారు. కాయిన్లు లెక్కించడానికి టైమ్ బాగా పడుతుందని భావించాం. కానీ కస్టమర్ పెద్ద పేమెంట్ ను కేవలం కాయిన్ల ద్వారా చెల్లించి బైక్ కొనుగోలు చేస్తే మార్కెట్లోనూ అవగాహనా పెరుగుతుందని కస్టమర్ వివరించడంతో ఓకే చెప్పినట్లు తెలిపారు. కస్టమర్ కు తన డ్రీమ్ బైక్ డెలివరీ చేస్తున్నామని చెప్పారు. అయితే తమ షో రూమ్ చరిత్రలో ఇలా మొత్తం కాయిన్లు చెల్లించి బైక్ కొనుగోలు చేయడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.

Youth Buys Bike With 10 Rupee Coins: రూ.10 నాణేలతో డ్రీమ్ బైక్ కొనుగోలు చేసిన తణుకు యువకుడు, షోరూమ్ రియాక్షన్ ఇదే!

గత ఏడాది తమిళనాడులో సేమ్ సీన్.. 
తన డ్రీమ్ బైక్ కోసం మూడేళ్ల పాటు రూపాయి కాయిన్స్ పొదుపు చేశాడు. సేలం జిల్లాకు చెందిన భూపతి అనే యువకుడు రూ.2.6 లక్షల రూపాయి నాణేలు చెల్లించి బజాజ్ డోమినర్ బైక్ ను కొనుగోలు చేశాడు. భూపతి మూడేళ్ల పాటు పొదుపు చేసిన రూపాయి కాయిన్స్ ను బైక్ షోరూమ్ కు తీసుకురాగానే అక్కడి సిబ్బంది షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత తెరుకుని వాటిని కౌంట్ చేయడం మొదలు పెట్టారు. పది గంటల పాటు లెక్కపెడితే గానీ మొత్తం నగదు ఎంతో తెలియలేదు. తమ సిబ్బంది పది గంటల పాటు శ్రమించి ఆ నాణేలు లెక్కించినట్లు బైక్ షోరూమ్ మేనేజర్ మహవి క్రాంత్ తెలిపారు. ఉత్తరాఖండ్ కు చెందిన ఓ వ్యక్తి సైతం గత ఏడాది కేవలం 10 రూపాయల నాణేలతో నచ్చిన బైక్ కొనుగోలు చేశాడు. కాయిన్లు చెల్లుబాటు అవుతాయని అవగాహనా కల్పించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget