అన్వేషించండి

Atchutapuram SEZ : ఇంటికి పెద్ద దిక్కులా నిలబడింది- అందర్నీ వదిలి వెళ్లిపోయింది- కన్నీళ్లు పెట్టించే హారిక స్టోరీ

Harika: అచ్యుతాపురం ఘోర ప్ర‌మాదంలో కాకినాడకు చెందిన ట్రైనీ ఇంజ‌నీర్ హారిక మృతిచెందింది.. ఆమె మృతితో కాకినాడ‌లో విషాద ఛాయ‌లు అల‌ముకున్నాయి.

Kakinada: ఇంట్లో మగ దిక్కు లేకపోయినా కొడుకులా కష్టపడేది. బాగా చదువుకుని ఇంజనీరింగ్‌ పూర్తి చేసింది. తనతోపాటు ఉన్న అమ్మకు, నానమ్మను బాగా చూసుకోవాలనుకుంది. అందుకే ఇంజనీరింగ్‌ పూర్తైన వెంటనే ట్రైనీ ఇంజనీర్‌గా ఉద్యోగాన్ని వెతుక్కుంది. తన కాళ్లపై తాను నిలదొక్కుకునే ప్రయత్నంలోనే ముందుకు సాగుతోంది. ఇంతలోనే విధి వంచించింది.. కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కాకినాడలోని సౌజన్య నగర్‌లోని హారిక బంధువులను ఎవరిని కదిపినా ఆవేదనతో కూడిన ఇవే మాటలు వినిపిస్తున్న పరిస్థితి. 

అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృతి చెందారు అందులో చాలా మంది యువకులే ఉన్నారు. వారిలో కాకినాడకు రెండో డివిజన్‌ సౌజన్యనగర్‌కు చెందిన చర్లపల్లి హారిక దుర్మరణం పాలయ్యింది.. బుధవారం ఆమె మృతితో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం హారిక మృతదేహం స్వస్థలానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో హారిక కుటుంబం, బంధువుల రోదనలు మిన్నంటాయి. 

ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఫార్మాలో చేరి
ఫార్మా కంపెనీలో జరిగిన పెను ప్రమాదంలో దుర్మరణం పాలయిన చర్లపల్లి హారిక చాలా మెరిట్‌ స్టూడెంట్‌. తండ్రి తాపీ మేస్త్రిగా పని చేస్తూ కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. సోదరుడు పదేళ్ల వయస్సులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఇంట్లో తల్లి అన్నపూర్ణ, నానమ్మ ఆదిలక్ష్మితో కలిసి ఉంటుంది హారిక. పదో తరగతి వరకు కాకినాడ రమణయ్యపేట మున్సిపల్‌ హైస్కూల్‌లో చదువుకున్న హారికకు పదోతరగతిలో మంచి మార్కులు రావడంతో ఇడుపులపాయలోని ట్రిబుల్‌ ఐటీకు ఎంపికైంది. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన హారిక కెమికల్‌ ఇంజనీర్‌గా ఫార్మా కంపెనీలో ఎంపికవ్వడంతో గత ఏడాది సెప్టెంబరు నుంచి ట్రైనీ ఇంజనీర్‌గా అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీలో పనిచేస్తోంది. 

పరీక్షల కోసం ఇంటికి వచ్చి వెళ్లి..
రెండు రోజుల క్రితం పరీక్షలు రాసేందుకు కాకినాడకు వచ్చింది హారిక.. డ్యూటీలో జాయిన్‌ అయ్యేందుకు బుధవారం ఉదయం అచ్యుతాపురం వెళ్లింది. బుధవారం డ్యూటీలో జాయిన్‌ అయిన హారిక విధుల్లో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తమ కుమార్తె మృతి చెందిందన్న సమాచారం తెలుసుకున్న తల్లి అన్నపూర్ణ, నానమ్మ ఆదిలక్ష్మి షాక్‌కి గురయ్యారు. రెండు రోజులపాటు సెలవు పెట్టి ఇంటికి వచ్చి తల్లి, నానమ్మలతో గడిపిన హారిక ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయిందన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో రోజు ఇంటి వద్దే ఉంటే తమ బిడ్డ బతికేదని రోదిస్తున్నారు. 

హారిక అంత్యక్రియలు..
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైన హారిక అంత్యక్రియలు గురువారం కాకినాడలో నిర్వహించారు బంధువులు. కాలిపోయిన దేహంతో నిర్జీవంగా ఉన్న కుమార్తె హారిక మృతదేహాన్ని చూసి తల్లి అన్నపూర్ణ, నానమ్మ ఆదిలక్ష్మి, బంధువర్గం కన్నీరుమున్నీరయ్యారు. ఆ ప్రాంతం అంతా రోదనలతో మిన్నంటింది. వారిని ఓదార్చడం ఎవరివంతు కాని పరిస్థితి కనిపించింది.. 

Also Read: అచ్యుతాపురం రియాక్టర్ బ్లాస్ట్: కంపెనీ ఓనర్స్‌ మధ్య గొడవలు - పవన్ కీలక వ్యాఖ్యలు

Also Read: ఆ కంపెనీలను వదిలిపెట్టబోం - ఫ్యాక్టరీల్లో సేఫ్టీ కోసం చంద్రబాబు కీలక నిర్ణయం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget