Nara Lokesh: సంక్షోభం దిశగా ఆక్వా రంగం, జగన్ పాలనలో పూర్తిగా ధ్వంసమైన పరిశ్రమ: నారా లోకేశ్
Nara Lokesh: ఉంగుటూరు మండలంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులను కలుసుకున్నారు.
Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర.. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో సాగుతోంది. ఉంగుటూరు నియోజకవర్గం చిననిండ్రకొలను క్యాంప్ సైట్ నుంచి 203వ రోజు విజయవంతంగా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆక్వా రైతులను నారా లోకేశ్ కలుసుకున్నారు. ఈ క్రమంలో ఆక్వా రైతులు టీడీపీ నేత వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. 15 సంవత్సరాలుగా చేపల సాగు చేస్తున్నామని.. గత మూడు సంవత్సరాలుగా సరైన ధర లేక సుమారు రూ. 3 లక్షల నష్టం వస్తోందని అప్పారావు అనే ఆక్వా రైతు నారా లోకేశ్ దృష్టికి తీసుకు వచ్చారు. రాష్ట్ర సర్కారు నుంచి ఆక్వా రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని, ఆర్థికంగా ఆదుకోవడం లేదని చెప్పుకొచ్చారు. గిట్టుబాటు ధర కల్పించి.. అవసరమైన మేరకు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరుగుతుందని తెలిపారు.
వైసీపీ సర్కారు హయాంలో, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో విద్యుత్, ఆక్వా సాగులో వాడే పరికరాలు, ట్రాన్స్ ఫార్మర్లు, ప్రాసెసింగ్ యూనిట్లకు పెద్ద ఎత్తున సబ్సిడీలు అందించినట్లు లోకేశ్ వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహించామన్నారు. ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలిపామని చెప్పారు. ఆక్వా రంగానికి రూ.1.50 కే యూనిట్ విద్యుత్ అందిస్తామని చెప్పి రైతులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గతంలో ఉన్న అన్ని సబ్సిడీలను రద్దు చేశారని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రంగాన్ని ఆదుకుంటామని.. తక్కువ ధరకే విద్యుత్, ఆక్వా పరికరాలను అందిస్తామని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
ఉంగుటూరు నియోజకవర్గం వద్ద పాదయాత్రలో పిల్లల్ని కలిసి ముద్దుగా ఉండే వాళ్ల మాటలు వింటూ వాళ్ల ఆలనా పాలనా అడుగుతూ వాళ్లతో కబుర్లు చెబుతూ ముందుకు సాగుతున్న లోకేష్ పాదయాత్ర..#YuvaGalam #YuvaGalamPadayatra #NaraLokesh #NaralokeshForPeople pic.twitter.com/iWelokgkN0
— YuvaGalam (@yuvagalam) September 3, 2023
ఉంగుటూరు నారా లోకేశ్ పాదయాత్ర షెడ్యూల్
- ఉదయం 8 గంటలకు - నిడమర్రు మండలం చిననిండ్రకొలను క్యాంపు సైట్ నుంచి ప్రారంభం
- 8.20 - ఆవపాడులో స్థానికులతో మాటామంతీ.
- 9.50 - సింగరాజుపాలెంలో ఎస్సీ సామాజిక వర్గీయులతో సమావేశం.
- 10.30 - పాదయాత్ర ఉంగుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశం.
- 10.50 - నీలాద్రిపురంలో స్థానికులతో మాటామంతీ.
- 11.05 - నీలాద్రిపురంలో యాదవ సామాజిక వర్గీయులతో భేటీ.
- 12.35 - ఉంగుటూరులో బీసీ సామాజిక వర్గీయులతో భేటీ.
- 1.35 - ఉంగుటూరులో భోజన విరామం
- 4.00 - ఉంగుటూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు
- 4.30 - ఉంగుటూరు సెంటర్ లో బీసీ సామాజిక వర్గీయులతో భేటీ.
- 5.30 - నారాయణపురం శివాలయం వద్ద స్థానికులతో మాటామంతీ.
- 5.50 - నారాయణపురం ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఎస్సీలతో సమావేశం.
- 7.50 - చిననిండ్రకొలను శివార్లలో స్థానికులతో మాటామంతీ
- 8.20 - చిననిండ్రకొలను సెంటర్ లో ఆక్వా రైతులతో సమావేశం
- 8.30 - చిననిండ్రకొలను విడిది కేంద్రంలో బస
రేపటి ముందడుగుకు నేను మీ తోడుగా..#YuvaGalam #YuvaGalamPadayatra #NaraLokesh #NaralokeshForPeople pic.twitter.com/4acfo5bPxo
— YuvaGalam (@yuvagalam) September 3, 2023