News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: 2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో చంద్రబాబు మేనిఫెస్టోని ప్రకటించారు. అందులో ముఖ్యంగా ఆరు కీలక పథకాలను వెల్లడించారు. 

FOLLOW US: 
Share:

TDP Manifesto For Assembly Elections 2024:  తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. 2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను  క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందులో ముఖ్యంగా మినీ మేనిఫెస్టోలో ఆరు కీలక పథకాలను వెల్లడించారు. ఇందులో భాగంగా నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ పెద్దపీట వేసింది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు. 3 సిలిండర్లు ఫ్రీ, మహిళలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామని చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు.

మినీ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు
1) పేదలను ధనవంతులు చేయడం
1.పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం 
2. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది  తెలుగుదేశం ప్రభుత్వం 
మినీ మ్యానిఫెస్ట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు పూర్ టూ రిచ్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకంతో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 

2) బీసీలకు రక్షణ చట్టం 
బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ.  వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు.  రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని టీడీపీ బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తోంది. వారికి అన్ని విధాలా అండగా నిలిచేలా ఈ చట్టాన్ని తీసుకుని వస్తోంది. 

3) ఇంటింటికీ నీరు 
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే "ఇంటింటికీ మంచి నీరు" పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు చంద్రబాబు.   

4) అన్నదాత 
ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్రంలో అన్నదాత పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించి వారికి చేయూతగా ఉండాలని తెలుగుదేశం నిర్ణయించింది.  

5) మహిళ ‘మహా’ శక్తి
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి  పేరుతో పథకాన్ని తీసుకుని వస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళ ‘మహా’ శక్తి పథకం ద్వారా  ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు "స్త్రీనిధి" కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. 'తల్లికి వందనం' పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. "దీపం" పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. "ఉచిత బస్సు ప్రయాణం" పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు చంద్రబాబు.

6) యువగళం
1. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
 2. ప్రతి నిరుద్యోగికి 'యువగళం నిధి' కింద నెలకు 3000 రూపాయలను ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం

Published at : 28 May 2023 08:11 PM (IST) Tags: TDP Mahanadu Chandrababu 2024 elections TDP News TDP Manifesto

ఇవి కూడా చూడండి

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్‌ 'స్పాట్‌ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్‌ కాగితాల శ్రీధర్ అరెస్ట్

Chandrababu Arrest: ఇలాంటి అరెస్ట్ ఎన్నడూ చూడలేదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం: అచ్చెన్నాయుడు

Chandrababu Arrest: ఇలాంటి అరెస్ట్ ఎన్నడూ చూడలేదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం: అచ్చెన్నాయుడు

Chandrababu Arrest: ఆధారాలు చూపకుండా సీఐడీ అధికారులు విచారించారు- ములాఖత్ లో చెప్పిన చంద్రబాబు

Chandrababu Arrest: ఆధారాలు చూపకుండా సీఐడీ అధికారులు విచారించారు- ములాఖత్ లో చెప్పిన చంద్రబాబు

Nara Bhuvaneswari: ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబు సింహంలా బయటకు వస్తారు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari: ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబు సింహంలా బయటకు వస్తారు: నారా భువనేశ్వరి

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!