Mahanadu in Rajamahendravaram: జగన్ రెడ్డి మారడు! రాష్ట్రాన్ని ఆ హింసావాది నుంచి కాపాడుకోవాలి: మహానాడులో టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ హింసకి సింబల్ గా మారిపోయిందని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో హింసకి ఒక సెంటర్ గా ఏపీ మారిపోయే పరిస్థితి ఉందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో జరుగుతోన్న మహానాడు ప్రబంజనం సృష్టించబోతుందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ హింసకి సింబల్ గా మారిపోయిందని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో హింసకి ఒక సెంటర్ గా ఏపీ మారిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ చాలా ఉద్రేకంగా ఉన్నారుని, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక హింసవాది చేతిలో నుంచి కాపాడుకోవాలనే పరిస్థితి కనిపిస్తుందన్నారు సోమిరెడ్డి.
ఈరోజు మహానుభావుడు యుగపురుషుడు ఎన్టీఆర్ గారి శతజయంతి ఉత్సవాలు రాజమండ్రిలో జరుపుకుంటుంటే ఇక్కడ మూడు కిలోమీటర్ల నుంచి ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేశారని ఆరోపించారు. సభకు రానికుండా టీడీపీ శ్రేణులను అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేయడం ఎంత వరకు సరైందని అధికార వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. మహానాడులో ఈ రోజు పదిహేను అంశాల మీద చర్చ జరుగుతుందన్నారు సోమిరెడ్డి. రేపు (ఆదివారం) ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా తమ నాయకుడు చంద్రబాబు నాయుడు లక్షలాదిమంది హాజరు కాబోయే బహిరంగ సభలో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఎన్నికలకు సంబంధించి కీలక సందేశాన్ని ఇస్తారని చెప్పారు.
అసలు సంస్కారం ఉందా..
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించడంతో పాటు రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో చంద్రబాబు తన ప్రసంగంలో పేర్కొంటారు. శకపురుషుడు ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని టీడీపీ నేతలు మహానాడు నిర్వహిస్తుంటే ఎన్టీఆర్ విగ్రహం చుట్టు వైసిపి జెండాలు కట్టడం ఎంత వరకు కరెక్ట్... అసలు సంస్కారం ఉందా.. అంటూ మండిపడ్డారు.
క్రిమినల్ యాక్టులో సీఎంకు, అతడి సోదరుడికి మినహాయింపులుండవు!
కడప ఎంపీ అవినాష్ రెడ్డి రాత్రి రెండు గంటలకు ఆయన వాట్సప్ కాల్స్ చేశారని సిబిఐ నిన్న, ఈరోజు చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఇప్పుడు సీఎం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చేసేసింది. దీన్ని ఎవరు తప్పించలేరు. క్రిమినల్ కేసులలో సీఎంకు ఒక విధంగా, ఆయన సోదరుడికి మరో తీరుగా మినహాయింపులు ఉండవన్నారు. ఆఖరికి సెంట్రల్ బ్యూరో ఇన్విస్టిగేషన్ అతిపెద్ద నేర పరిశోధన సంస్థ ఇప్పుడు నిందితుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకు రక్షణ లేదని చెప్పి సిబిఐ తెలంగాణకు మార్చుకునే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. హత్యా రాజకీయాలకు సెంటర్ గా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ ను అరాచక ప్రదేశ్ గా మారిపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి సోమిరెడ్డి.
డాక్టర్ సుధాకర్ ను చంపేశారు, డ్రైవర్ ను హత్యచేసి డోర్ డెలివరీ చేశారు!
టీడీపీ హాయాంలో దళితుల కోసం అంబేద్కర్ తీసుకొచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేశాం అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. దేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చిన నాయకులు చంద్రబాబు. రూ.46వేల కోట్ల సబ్ ప్లాన్ ఎస్సీ ల కోసం ఖర్చు చేశాం అన్నారు. రాష్ట్రంలో 80 శాతం దళితులు సీఎం జగన్ రెడ్డిని నమ్మి మోసపోయారు. అందుకే జగన్ రెడ్డి దళిత ద్రోహి అంటూ మండిపడ్డారు. ఎస్సీలకు అన్ని రకాలుగా అన్యాయం చేశారు. దళితుల మీద దాడులు చేయడమంటే వైసీపీ పేటెంట్ రైట్ లా భావిస్తున్నారు. మాస్క్ పెట్టుకోలేదని డా. సుధాకర్ ను పిచ్చిగా ముద్ర వేసి చంపేశారు. సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ ను చంపేసి డోర్ డెలివరీ చేయించారు. దళితులను విద్యా వంతులుగా తీర్చిదిద్దిన ఘనత టీడీపేకు దక్కుతుందన్నారు. టీడీపీ హయాంలో దళితులకు అమలు చేసిన పథకాలను రద్దు చేసిన ఘనత జగన్ సొంతమన్నారు.
జగన్ రెడ్డిని గద్దెనెక్కించడమే పెద్ద తప్పు
2019లో జరిగిన పెద్ద తప్పు జగన్ రెడ్డిని గద్దెనెక్కించడమే అని మహాసేన రాజేష్ అన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పేరుతో ప్రజల రక్తాన్ని జగన్ రెడ్డి నేరుగా పీల్చేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు 4 లక్షల మందికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. జగన్ రెడ్డి మాత్రం ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్లు పదవులచ్చారు. చంద్రబాబు నాయుడు దళిత విద్యార్ధులను కార్పొరేషన్ చదువులు చదివిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు పరిమితం చేశారని ఆరోపించారు.