అన్వేషించండి

Mandapeta News: మండపేటలోని థియేటర్‌ పార్కింగ్‌లో గొడవ- ముగ్గురు యువకులపై దాడి- అట్రాసిటీ కేసు నమోదు

Ambedkar Konaseem District News: అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా మండ‌పేట‌లో ముగ్గురు యువ‌కుల‌పై దాడి ఘటన కలకలం రేపింది. సినిమా థియేటర్‌ పార్కింగ్ ఏరియాలో మొదలైన గొడవ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది.

DR BR Ambedkar Konaseema District News : అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లా మండపేటలో దారుణ జరిగింది. ఓ వర్గానికి చెందిన ముగ్గురు యువకులపై కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటన మండపేటలో తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎనిమిది మంది నిందితులను గుర్తించి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

సినిమాహాలు పార్కింగ్‌లో మొదలైన గొడవ..
మండపేట పట్టణానికి చెందిన మోహన్‌ కిరణ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ థియేటర్‌లో మాట్నీషో సినిమాకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కిరణ్‌ సోదరి పార్కింగ్‌ స్థలంలో స్టాండ్‌ వేసి ఉన్న టూవీలర్‌కు ఆనుకొని కూర్చున్నప్పుడు అది వెనక్కి పడిపోయింది. దీన్ని నిలబెట్టి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

మోటారు సైకిల్‌ కింద పడేసి వెళ్లి దర్జాగా వెళ్లి సినిమా చూస్తారా అంటూ బైక్‌ యజమాని వచ్చి థియేటర్‌లో గొడవ పెట్టుకున్నాడు. బూతులు తిడుతూ హాల్‌లో రచ్చ చేశారు. వివాదం ముదురుతుండడంతో కిరణ్‌ స్నేహితులు చంటి, చంద్రశేఖర్‌ వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆవేశంతో ఉన్న బైక్ యజమాని ఆయన ఫ్రెండ్స్ చేయి చేసుకున్నారు. 

కట్టేసి తమపై 40 మంది దాడికి తెగబడ్డారని కిరణ్ ఆరోపిస్తున్నారు. ప్రాణ భయంతో పారిపోగా స్నేహితులైన చంటి, చంద్రశేఖర్‌ సహాయంతో పట్టుకున్నారని తెలిపారు. చేతుల కట్టేసి దగ్గర్‌లోని ఓ గుడి స్తంభానికి కట్టేశారని పోలీసుల వద్ద వాపోయారు. 

అట్రాసిటీ కేసులు నమోదు..
మండపేటలో ముగ్గురు యువకులపై దాడికి పాల్పడి ఘటనలో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఎమ్మార్పీఎస్‌ నాయకులు, మాల మహానాడు సంఘ నాయకులు రోడ్డుపైకి వచ్చిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నిరసన బాట పట్టారు. తాము ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను విడిపించే వరకు వారు దిక్కులేని దుస్థితిలో ఉన్నారని, నిందితులందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసీటీ కేసులు నమోదు చేసి హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఘటనా స్థలానికి మండపేట డీఎస్పీ హుటాహుటీన చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆందోళనకారులతో మాట్లాడారు. న్యాయం జరిగే వరకు నిరసన బాట వీడేది లేదంటూ రోడ్డుపైనే కూర్చొన్న వారితో మాట్లాడారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా దాడికి పాల్పడిన 8 మందిని గుర్తించామన్నారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు కూడా వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget