X

YSRCP MP: వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు... ప్రాణహాని ఉందని ప్రధానికి రఘురామ లేఖ

ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సీఐడీ డీజీఏ సునీల్‌ను దూషించారని చింతలపూడిలో కేసు పెట్టారు.ఇదంతా తనను అంతమొందించే కుట్రలో భాగమంటూ ప్రధానికి లేఖ రాశారు రఘురామ.

FOLLOW US: 

వైఎస్‌ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణపై మరో కేసు నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు రిజిస్టర్ అయింది. సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ను తిట్టారని, కులం పేరుతో కూడా దూషించారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు  చింతలపూడి సీఐ ఎంవీఎస్‌ మల్లేశ్వరరావు తెలిపారు. 
సునీల్‌ను అసభ్య పదజాలంతో తిట్టిన రఘురామకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ చింతలపూడి వాసి గొందిరాజు, ఎయిమ్‌ సభ్యుడు కాకర్ల సత్యనారాయణ, ఎంఎస్‌ రాజేంద్ర, బుచ్చిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టినట్టు చింతలపూడి సీఐ వెల్లడించారు. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని... సీబీసీఐడీ ఏడీజీ పీవీ సునిల్‌కుమార్‌, జగన్‌ కుమ్మక్కై తనను అంతమొందించే కుట్ర పన్నారని ఆరోపించారు ఎంపీ రఘురామకృష్ణరాజు. దీనిపై ప్రధానికి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు.. ఈ కుట్రలపై సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.  

ఈ మధ్య కాలంలో తాను సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు వెళ్లాలనుకున్నానని.. అక్కడే తనను చంపే కుట్రకు ప్లాన్ చేశారని... మతాలు, కులాల మధ్య చిచ్చు రేపి తనను లేపేయాలనుకున్నారని ఆరోపించారు రఘురామకృష్ణరాజు. సునీల్‌ కుమార్‌ అసాంఘిక కార్యకలాపాల్లో మునిగి తేలుతూ రాజకీయ లబ్ధి కోసం తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని లేఖలో చెప్పారు రఘురామ. సునీల్ ఆధ్వర్యంలో నడిచే అంబేద్కర్‌ ఇండియా మిషన్ సభ్యులతో రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో తనపై తప్పుడు కేసులు పెట్టించారని వివరించారు. కేసుల్లో ఇరికించి విచారణకు హాజరైనప్పుడు హత్య చేయాలనే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. 

ఇప్పటికే ఎన్నో సార్లు కేంద్ర సిబ్బంది వ్యవహాలు, హోంశాఖలకు వీడియో సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశానని.. దీనిపై ఆయా శాఖలు సమాచారం కోరినా  రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని గుర్తు చేశారు రఘురామ. గతేడాది మే 14న అరెస్టు టైంలో మర్డర్‌కు ప్లాన్ చేశారని అది విఫలం కావడంతో మరోసారి అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సునీల్, జగన్ ఇద్దరూ తనకు ప్రాణహాని తలపెట్టినట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసిందని.. అందుకే మీకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. 

Also Read: నర్సాపురం టూర్‌ను రద్దు చేసుకున్న రఘురామ.. సీఐడీ నోటీసులపై న్యాయపోరాటానికి రెడీ !

Also Read: పండగ రోజుల్లో విచారణకు నోటీసులా.. సీఐడీ సునీల్‌పై రఘురామ ఘాటు విమర్శ !

Also Read: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: YSRCP Pm Raghu Rama Krishna Raju AP CID

సంబంధిత కథనాలు

Viral Video: ఓటీఎస్ కట్టమన్నందుకు వృద్ధురాలి వీరంగం... ఒకేసారి రూ.10 వేలు కట్టమంటే ఎలా అని ఆగ్రహం... వైరల్ అవుతోన్న వీడియో

Viral Video: ఓటీఎస్ కట్టమన్నందుకు వృద్ధురాలి వీరంగం... ఒకేసారి రూ.10 వేలు కట్టమంటే ఎలా అని ఆగ్రహం... వైరల్ అవుతోన్న వీడియో

East Godavari: అన్నదమ్ముల మధ్య భూతగాదాలు... సర్వే అధికారుల్ని అడ్డుకునేందుకు పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

East Godavari: అన్నదమ్ముల మధ్య భూతగాదాలు... సర్వే అధికారుల్ని అడ్డుకునేందుకు పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్యాయత్నం

BTech Student Suicide: ఈ చదువులు వద్దు.. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!

BTech Student Suicide: ఈ చదువులు వద్దు.. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!

Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు

Weather Updates: తెలంగాణను కమ్మేసిన దట్టమైన మేఘాలు.. ఏపీలో పెరిగిన చలి తీవ్రత, మళ్లీ అకాల వర్షాలు

East Godavari: కోమాలో ఉన్న తల్లిని కదిలించిన బిడ్డ ఏడుపు.... తల్లి ప్రేమకు నిదర్శనం ఈ ఘటన

East Godavari: కోమాలో ఉన్న తల్లిని కదిలించిన బిడ్డ ఏడుపు.... తల్లి ప్రేమకు నిదర్శనం ఈ ఘటన
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Snakes Near Dead Body: ఇంట్లో శవం.. ఆ గది నిండా 124 పాములు.. ఏం జరిగింది?

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

Telangana Corona Update: తెలంగాణలో కొత్తగా 4,393 కరోనా కేసులు నమోదు.. ఇద్దరు మృతి

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

KL Rahul Record: ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు.. జాక్‌పాట్ కొట్టిన కేఎల్ రాహుల్.. ఒప్పందం విలువ ఎంతంటే?

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..

Samantha: నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే వారిద్దరే కారణం.. సమంత పోస్ట్..