అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీబస్, లారీ ఢీ- తృటిలో తప్పిన ముప్పు- కాలేజీ విద్యార్థులు క్షేమం
పెను ప్రమాదం తప్పింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్టీసీ బస్, లారీ ఢీ కొట్టింది. ప్రమాదం టైంలో బస్సులో 15 మంది విద్యార్థులతోపాటు ప్రయాణికులు ఉన్నారు.
డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 216 జాతీయ రహదారిపై లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సు, లారీ ప్రమాదం జరుగుతున్న టైంలో ప్రయాణికులు, విద్యార్థులు ఉన్నారు. వాళ్లకు గాయాలు అయ్యాయి.
డ్రైవర్ మాత్రం ఇరుక్కుపోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. వారికి మెరుగైనా చికిత్స అందించేందుకు కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ముమ్మిడివరం నుంచి అమలాపురం వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి అమలాపురం నుంచి కాకినాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్‌లో ప్రయాణికులతోపాటు తాళ్లరేవు మండలం కైట్ కాలేజీకి చెందిన సుమారు 15 మంది విద్యార్థులు బస్సుల్లో ప్రయణిస్తున్నారు. వారంతా క్షేమంగా ఉన్నారని అధికారులు ప్రకటించారు.
ఆర్టీసీ బస్‌లో ప్రయాణిస్తున ఓ మహిళ, లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడ్డ విద్యార్థులను ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ముమ్మిడివరం పోలీసులు వెల్లడించారు.
Mummidivaram area lo anta pic.twitter.com/Ta8nQ3S4Qh
— Sudheer Gidugu (@Sudheer_Tweets) September 13, 2022