East Godavari politics: తూర్పు గోదావరిలో రాజకీయ మార్పులు.. ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం?
ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు మార్పులకు దారి తీస్తున్నాయి. కాపు నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి చేరుతున్నారు.
East Godavari Politics: ఏపీ(Andhra Pradesh)లో అసెంబ్లీ(Assembly), పార్లమెంటు(Parliament) ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ(TDP) ప్రయత్నిస్తుండగా.. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ(YSRCP) మరోసారి ప్రయ త్నం చేస్తోంది. అయితే.. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. తూర్పు గోదావరి(East Godavari) వంటి కీలకమైన జిల్లా మద్దతు అవసరం. ఈ జిల్లాలోని రాజకీయాలు, నేతలు, అసెంబ్లీ స్థానాలు అధికారంలోకి వచ్చే పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంటు ఉంది.
ఇదే.. గత కొన్నాళ్లుగా సాగుతున్న సెంటిమెంటు కూడా. గత 2019 ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైఎస్సార్(TDP Vs YSRCP) కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన పోరులో రాజమండ్రి రూరల్, సిటీ, పెద్దాపురం, మండపేట నియోజకవర్గా ల్లో తెలుగు దేశంపార్టీ విజయం దక్కించుకుంది. ఇక, ఎస్సీ నియోజకవర్గం రాజోలు నుంచి జనసేన విజ యం సాధించింది. అయితే, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజోలు ఎమ్మెల్యే వైసీపీకి అనుకూలంగా మారారు. సరే.. ఇక్కడ మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయంసాధించింది. అంటే.. మొత్తం 19 స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 14 చోట్ల గెలుపు గుర్రం ఎక్కింది.
వచ్చే 2024 ఎన్నికల్లోనూ వైసీపీ విజయంసాధించాలని గట్టి ప్రయత్నంతోనే ఉంది. కానీ, జనసేన(Janasena) రూపం లో ఇక్కడ కాపు(Kapu), బలిజ(Balija) సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన కాపు సామాజికవర్గాన్ని తనవైపు తిప్పుకొనే ప్రయత్నంలో జనసేన ఉంది. అయితే.. ఈ వ్యూహం నిన్న మొన్నటి వరకు వర్కవుట్ అయింది. కానీ, అనూహ్యంగా జనసేన వెళ్లి తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం.. పొత్తు కారణంగా వచ్చే ఎన్నికల్లో కేవలం 24 స్థానాలకే పరిమితం కావడం వంటివి ఒకింత సెగ పెట్టించాయి. దీనికి తోడు,, తనను ప్రశ్నించడానికి వీల్లేదని, అలా ఎవరైనా చేస్తే వారంతా తనకు కోవర్టులేనని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు.
ఈ పరిణామాలతో జనసేన పార్టీలో ఉన్న కాపు నాయకులు సహా.. ఈ పార్టీలో చేరాలని అనుకున్న నాయ కులు కూడా పార్టీకి దూరమవుతున్నారు. మరోవైపు, తెలుగు దేశం పార్టీతో పొత్తులో కారణంగా సీట్లు కోల్పోయిన జనసేన పార్టీ నాయకులు ఉసూరు మంటున్నారు. వారికి నచ్చ జెప్పి.. ఏదో విధంగా బుజ్జగించి వారిని లైన్‌లో పెట్టుకోవల్సిన జనసేనాని పవన్ కళ్యాణ్.. మాత్రం వారిని మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కేటాయించిన టికెట్లలో ఆ పార్టీకి టికెట్ రాని వారిని జనసేనలోకి తీసుకుని.. టికెట్ ఇస్తున్నారు. ఉదాహరణకు భీమవరం ప్రత్యక్ష ఎగ్జాంపుల్. దీంతో తూర్పుగోదావరి రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఏ పార్టీ ఓటు బ్యాంకు చీల కూడదని భావిస్తున్నారో.. అదే పార్టీకి మేలు చేసేలా ప్రస్తుత పరిణామాలు మారడం గమనార్హం.
కాపు ఉద్యమ నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada padmanabham).. ఈ నెల 14న వైసీపీలో చేరనున్న విషయం తెలిసిందే. ఎలాంటి షరతులు లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు, తన అబిమానులకు లేఖ రాశారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ నెల 14న సీఎం జగన్ పిలుపు మేరకు తాను వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తాను 14వ తేదీన కిర్లంపూడిలోని తన నివాసం నుంచి బయలు దేరి సీఎంజగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. అయితే..తాను ఎలాంటి తప్పుడు పనిచేయలేదని.. చేయబోనని కూడా ఆయన వెల్లడించడం గమనార్హం. తనను ప్రజలు ఆశీర్వదించాలని.. మీ బిడ్డగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు.
మరో కీలక నేత విడివాడ రామచంద్రరావుకు తణుకు టికెట్ ఇస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆయనతో బాగానే ఖర్చు పెట్టించారనే చర్చ సాగుతోంది. అయితే.. ఈ టికెట్ కూడా దక్కలేదు. పోనీ..పవన్ . ఇలాంటి కీలక నేతలను పిలిచి మాట్లాడింది కూడా లేదు. ఫలితంగా విడివాడ కొంత సంయమనం పాటించినా.. కాపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు.. భవిష్యత్ రాజకీయంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో జనసేనలో ఉండలేనని తాజాగా నిర్ణయించుకున్నారు. ఆదివారం అనుచరుల సమావేశంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరేందుకు దాదాపు ఒక క్లారిటీకి వచ్చారని తెలిసింది. మొత్తంగా చూస్తే.. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయాలు మారుతున్న వేళ ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయబోమన్న జనసేనకు మైనస్ అవుతుండగా, అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి ప్లస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.