By: ABP Desam | Updated at : 10 Jun 2023 10:44 AM (IST)
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు టీడీపీ టీం- అడ్డుకున్న పోలీసులు- ఉయ్యూరుపాడు వద్ద ఉద్రిక్తత
పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తున్న టీడీపీ లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు పరిశీలనకు వెళ్తుంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయి. ఎంతవరకు జరుగుతన్నాయో పరిశీలించి వస్తామని చెబుతున్నా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టుపై అనేక ఆరోపణలు వస్తున్న వేళ అక్కడ జరిగే పనులు పరిశీలిస్తామని టీడీపీ టీం ఈ ఉదయం బయల్దేరి వెళ్లింది. గన్ని వీరాంజనేయులు, బడేటి బుజ్జి, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేను ఉమామహేశ్వరరావు టీంగా ఏర్పడి పోలవరం పరిశీలనకు బయల్దేరి వెళ్లారు. అయితే తూర్పుగోదావరి జిల్లా ఉయ్యూరుపాడు వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ఎవరికీ పర్మిషన లేదని చెప్పి ఆపే ప్రయత్నం చేశారు.
పోలవరంప్రాజెక్టు పరిశీలనకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు?
— Devineni Uma (@DevineniUma) June 10, 2023
కమిషన్లకక్కుర్తితో పోలవరాన్ని నాశనంచేశారు ప్రాజెక్టులో వైఫల్యాలు బయటపడతాయనే మమ్మల్ని అడ్డుకుంటున్నాడు
@ncbnహయాంలో లక్షలాదిమంది ప్రజలు ప్రాజెక్టును సందర్శించారు
మేము ప్రాజెక్టుకు వెళ్తుంటే వైసీపీసర్కార్ కు ఎందుకు భయం? pic.twitter.com/QNjnnJMabB
తాము వెళ్లాల్సిందేనంటూ టీడీపీ నేతలు తేల్చి చెప్పారు. అయినా పోలీసులు వారిని అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీసులకు, టీడీపీ లీడర్లకు కాసేపు వాగ్వాదం జరిగింది. చివరకు గన్ని వీరాంజనేయులను, నిమ్మల రామానాయుడిని, బడేటి బుజ్జిని అరెస్టు చేశారు. దేవినేని ఉమ మాత్రం పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు.
పోలీసులకు, టీడీపీ లీడర్లకు వాగ్వాదం జరుగుతున్న టైంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. పోలీసుల కళ్లు గప్పి టీడీపీ లీడర్ బైక్‌లో పోలవరం వైపు వెళ్లారు. ఆయన్ని వెంబడిస్తూ పోలీసులు కూడా వెళ్లారు. ఆయన కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
krishi bank director: 22 ఏళ్ల తరువాత కృషి బ్యాంక్ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ అరెస్ట్
Chandrababu Arrest: ఇలాంటి అరెస్ట్ ఎన్నడూ చూడలేదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం: అచ్చెన్నాయుడు
Chandrababu Arrest: ఆధారాలు చూపకుండా సీఐడీ అధికారులు విచారించారు- ములాఖత్ లో చెప్పిన చంద్రబాబు
Nara Bhuvaneswari: ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం లేదు, చంద్రబాబు సింహంలా బయటకు వస్తారు: నారా భువనేశ్వరి
MP Margani Bharat: చంద్రబాబు పాపం పండింది, ఇది చిన్న స్కామే - ఎంపీ మార్గాని భరత్
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్‌కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్
Mangalavaram Movie Release : నవంబర్‌లో 'మంగళవారం' - 'ఆర్ఎక్స్ 100' కాంబో పాయల్, అజయ్ భూపతి సినిమా
/body>