అన్వేషించండి

Pawan Kalyan: పిఠాపురం మ‌హారాజా కుటుంబీకుల ఆస్తిపై క‌న్నేసిన మ‌హిళ, స్పందించిన పవన్ కల్యాణ్ 

Pithapuram News: పిఠాపురం మ‌హారాజా మేన‌కోడ‌లు ఇంటిని ఆక్ర‌మించుకోవాల‌ని స్థానిక TDP నాయ‌కురాలు ప్ర‌య‌త్నించారు. త‌మ‌ను ఆదుకోవాల‌ని బాధితురాలు పెట్టిన వీడియోను చూసి ప‌వ‌న్ క‌ళ్యాన్ స్పందించారు.

Pawan Kalyan on Pithapuram Maharaja Niece Video: పిఠాపురం మ‌హారాజా మేన‌కోడ‌లు కుటుంబ అభ్య‌ర్థ‌నపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. అయిదు ద‌శాబ్దాలుగా నివాసం ఉంటున్న మా ఇంటిని ఆక్ర‌మించుకోవాల‌ని కొంద‌రు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని త‌మకు న్యాయం చేయాల‌ని ఆమె అభ్య‌ర్థించిన ఒక వీడియో సోష‌ల్ మీడియా ప్ర‌చారం కావ‌డంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి విచార‌ణ చేయాల‌ని కాకినాడ క‌లెక్ట‌ర్‌, ఆర్డీవోను ఆదేశించారు. మా ఇంట్లో నుంచి మ‌మ్మ‌ల్ని గెంటేస్తామ‌ని బెదిరించ‌డ‌మే కాకుండా మ‌మ్మ‌ల్ని కొట్టి మెడ‌లోని బంగారు గొలుసు లాక్కెల్లి పోయార‌ని పిఠాపురం మ‌హారాజా మేన‌కోడ‌లు చంద్ర‌లేఖ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ నాయ‌కుల అండ‌గా పోలీసుల్ని వెంటేసుకుని వ‌చ్చి మ‌రీ బెదిరిస్తున్నార‌ని ఆమె వాపోయారు. పోలీసులను ఆశ్ర‌యించినా ప‌ట్టించుకోక‌పోగా తిరిగి త‌మ‌ను బెదిరిస్తున్నార‌ని పవన్ కల్యాణ్ గారూ.. మీరే ఆదుకోవాల‌ని లేదంటే మాకు చావు త‌ప్ప మ‌రో దారి లేద‌ని అభ్య‌ర్థిస్తూ ఆమె వీడియోను పోస్ట్ చేశారు. 

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్సు ఎదురు వీధిలో మహారాజా కోడలు విన్నపాల చంద్రలేఖ(78), తన ఇద్దరు కుమారులు రంగారావు, మాధవరావుతో కలిసి నివాసం ఉంటున్నారు. వీరు 1970 నుంచి అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. కాగా ఈ ఇంటిపై వివాదం ఏర్ప‌డ‌గా 1974లో కోర్టు ద్వారా వీరు డిక్రీ పొందారు. అయితే రెండు నెల‌ల క్రితం జిగ‌టాల ల‌క్ష్మి అనే మ‌హిళ మ‌రికొంద‌రితో క‌లిసి వ‌చ్చి ఈ ఇంటిని తాము కొనుగోలు చేశామ‌ని వెంట‌నే ఖాళీ చేయాల‌ని బెదిరించిన‌ట్లు చెప్పారు. ఆమె టీడీపీలో యాక్టివ్‌గా తిరుగుతుంద‌ని వివ‌రించారు. త‌న కొడుకులు విజ‌య‌న‌గ‌రం, కాకినాడ‌లో ఉద్యోగాలు చేసుకుంటున్నార‌ని, గొడ‌వ‌ల కార‌ణంగా అస్త‌మానం ఇక్క‌డికి రావ‌డానికి వారికి వీలుప‌డ‌ద‌ని చెప్పారు. ఇంత‌కీ ఇంటిని మీకు ఎవ‌రు అమ్మార‌ని అడిగితే చెప్పకుండా దౌర్జ‌న్యం చేసి మెడ‌లో బంగారు గొలుసును లాక్కుని పోయార‌ని ఇంటికి సంబంధించిన ప‌త్రాలు చూపిస్తూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇంట్లోని సామాన్లు చింద‌ర‌వంద‌ర‌గా చేసి బ‌య‌ట‌ప‌డేశార‌ని తెలిపారు. 

అయిదు ద‌శాబ్దాలుగా తాము నివాసం ఉంటున్న ఇంటిని, వార‌స‌త్వంగా త‌మ‌కు సంక్ర‌మించిన ఆస్తిని బెదిరించి లాక్కోవాల‌ని చూస్తున్నార‌ని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తిరిగి త‌మ‌నే బెదిరిస్తున్నార‌ని వాపోయారు. ఇంటిని ఖాళీ చేసి వెళ్ల‌కుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడ‌తామ‌ని వేధిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ విన్న‌పాల‌ చంద్ర‌లేఖ‌, ఆమె కుమారుడు మాధ‌వ‌రావు వీడియోలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను విజ్ఞ‌ప్తి చేశారు. త‌మను ఆదుకోకపోతే చావే శ‌ర‌ణ్య‌మ‌ని వాపోయారు. 

విచార‌ణ చేప‌ట్టిన ఆర్డీవో కిశోర్‌.. 

బాధితురాలు చంద్ర‌లేఖ‌ మాట్లాడిన వీడియోను వైసీపీకి చెందిన జ‌గ‌న‌న్న క‌నెక్ట్స్ (Jagananna Connects) ఎక్స్‌లో పోస్ట్ చేయ‌డంతో రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. దీంతో వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ క‌లెక్ట‌ర్‌, ఆర్డీవోల‌ను ఆదేశించారు. పవన్ కల్యాణ్ ఆదేశాల‌తో ఆర్డీవో కిశోర్ చంద్ర‌లేఖ ఇంటికి వెళ్లి విచార‌ణ చేప‌ట్టారు. పవన్ కల్యాణ్ ఆదేశాల‌తో విచార‌ణ చేసేందుకు వ‌చ్చామ‌ని ఆమెకు వివ‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఈ ఆస్తికి సంబంధించిన వివాదం కోర్టు  ప‌రిధిలో ఉంద‌న్నారు. కోర్టు జ‌డ్జిమెంట్ ప్ర‌కారం ఈ ఆస్తి చంద్ర‌లేఖ కుటుంబానికే చెందుతుంద‌ని చెప్పిన ఆర్డీవో తుది తీర్పు ఎవ‌రికి అనుకూలంగా వ‌స్తే ఆస్తి వారికి చెందుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతానికి శాఖా ప‌రంగా మాత్ర‌మే విచార‌ణ చేస్తున్నామ‌ని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget