అన్వేషించండి

Amalapuram News: వాలంటీర్ హత్య కేసులో శ్రీకాంత్‌ను లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్న పోలీసులు- తప్పు చేయలేదంటున్న మాజీ మంత్రి కుమారుడు

Andhra Pradesh:వాలంటీర్ దుర్గా ప్రసాద్ హ‌త్య కేసులో నిందితుడు మాజీ మంత్రి విశ్వ‌రూప్ త‌న‌యుడు శ్రీ‌కాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజ‌రుప‌రిచారు. కోర్టు అత‌నికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Amalapuram: తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు... దుర్గాప్రసాద్‌ చనిపోతే లక్ష రూపాయలుపరిహారం ఇచ్చాను... అతని కుమారుడికి పేరు పెట్టిందే నేను.. అంటూ కేకలు పెడుతూ చెప్పారు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడు పినిపే శ్రీకాంత్‌. ఆయన్ని తమిళనాడులో అరెస్టు చేసిన పోలీసులు రాత్రి కోర్టులో హాజరుపరిచారు. ఈ టైంలో మీడియాను చూసిన శ్రీకాంత్‌ గట్టిగా కేకలు వేస్తూ ప్రభుత్వంపై, పోలీసులపై ఆరోపణలు చేశారు. 

గ్రామ సచివాలయ వాలంటీరు జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో నాటకీయ పరిణామాల మధ్య పినిపే శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని మధురలో పట్టుకున్న పోలీసులు రాత్రి అమలాపురం తీసుకొచ్చారు. అక్కడ కోర్టులో హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. 

దుర్గాప్రసాద్‌ కుమారుడికి పేరు పెట్టా.. లక్ష రూపాయాలు ఇచ్చా...
నిందితుడు పినిపే శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేసి అమలాపురం కోర్టులో హాజరు పరిచేందుకు కొత్తపేట నుంచి తీసుకొస్తున్న సమయంలో మీడియాను చూసిన శ్రీకాంత్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మృతుడు జనుపల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడికి తానే పేరు పెట్టానని, లక్షరూపాయలు ఆర్థిక సాయం చేశానని, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అప్పటి ఎస్పీ సుధీర్‌కుమార్‌ రెడ్డిని నాలుగు సార్లు కలిశానని కేకలు వేస్తూ చెప్పారు. 

దుర్గాప్రసాద్‌ హత్య వ్యవహారంపై కొత్తపేట డీఎస్పీ గోవిందరావు ప్రెస్‌మీట్‌ పెట్టారు. జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో అతని మిత్రుడు వడ్డి ధర్మేష్‌ను టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ద్వారా అరెస్ట్‌ చేశామని తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం, టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ద్వారా మంత్రి కుమారుడు పినిపే శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 

శ్రీకాంత్‌ మొదట హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందిందని, ఆ తరువాత సెల్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి చెన్నైలోని మధురలో ఉన్నట్లు తేలిందన్నారు. పోలీస్ టీంను అక్కడకు పంపించి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. శ్రీకాంత్‌కు దుర్గాప్రసాద్‌కు మధ్య కొన్ని మనస్పర్ధలు, వ్యక్తిగత గొడవలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు ఉన్నారని, ఇంకా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు. 

మంత్రి, మాజీ మంత్రి మధ్య మాటల యుద్ధం..
వాలంటీరు హత్యకేసుతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌, మాజీ మంత్రి వైసీపీ లీడర్‌ పినిపే విశ్వరూప్‌ మధ్య మాటలు యద్ధం నడుస్తోంది. తన కుమారుడ్ని మంత్రి సుభాష్‌ ప్రోద్బలంతోనే అక్రమంగా అరెస్ట్‌ చేశారని విశ్వరూప్‌ ఆరోపించారు. తప్పు చేసిన వాడు ఎవ్వడికైనా శిక్ష పడాల్సిందేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి వాసంశెట్టి సుభాష్‌ వ్యాఖ్యానించారు. బాధితురాలు తనవద్దకు వచ్చి న్యాయం చేయాలని కోరితే డీజీపీకి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు.

ఇదిలా ఉంటే నిందితుడు శ్రీకాంత్‌ తరపు న్యాయవాది ఆజామ్‌ మాట్లాడుతూ పోలీసులు అదుపులో తీసుకున్న మరో నిందితుడు వడ్డి ధర్మేష్‌ ఇచ్చిన వాంగ్మూలం ద్వారా శ్రీకాంత్‌ను పోలీసుల అరెస్ట్‌ చేశారని, అయితే ఇందులో ఎటువంటి ఆధారాలు లేవన్నారు. శ్రీకాంత్‌ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీకాంత్‌ను తమ కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో కోర్టులో పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget