Committee Kurrollu: కోనసీమ చిన్నారులే మన "కమిటీ కుర్రోళ్లు"- యాక్టింగ్‌తో అదరగొట్టేసిన బుడ్డోళ్లు
Konaseema:ఒక్క ఛాన్స్ అంటూ దూసుకుపోతున్నారు కోనసీమ కిడ్స్. ఇటీవల విడుదలై "కమిటీ కుర్రోళ్లు" సినిమాలో 8 మంది చిన్నారులు అదరగొట్టేశారు. వర్షాకాలం కావడంతో కోనమసీమలో షూటింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.
Committee Kurrollu: Movie: అరె డ్యాన్స్ అదరగొడ్తున్నావ్... సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా.. ఎన్టీఆర్ నుంచి మహేష్‌బాబు వరకు డైలాగ్‌లు భలే చెబుతున్నావ్.. మంచి నటుడు అయ్యే ఛాన్స్ ఉంది కదరా. ఊరుకో బాబాయ్... ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం.. అవకాశాలు మన వరకు వస్తాయా అని పెదవి విరిచే వాళ్లే ఎక్కువ ఉంటుంటారు. ఇది ఒకప్పటి మాట బాస్. ఛాన్స్ దొరికింది. చెలరేగిపోతామని చెపుతున్నారు నేటి తరం. అదికూడా గోదావరి జిల్లాల్లో ఓ మూలకు విసిరేసినట్లు ఉండే కోనసీమ ప్రాంతం నుంచి.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యాక్టింగ్‌లో టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన చిన్నారులు. మెగా డాటర్ నిహారిక నిర్మాణ సారథ్యంలో ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న "కమిటీ కుర్రోళ్లు" సినిమాలో అమలాపురానికి చెందిన 8 మంది చిన్నారులు నటించారు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుల కోసం చాలా మందికి ఆడిషన్స్ నిర్వహించారట. హీరో శివ చిన్ననాటి పాత్రను వంకాయల హంసిక్ చేయగా కార్తిక్ చిన్నోడుగా ఈదరపల్లికి చెందిన యర్రంశెట్టి నిశాంత్ నటించాడు. చిన్నప్పటి సుబ్బు పాత్రలోకె.అశ్విన్‌వర్మ, కిషోర్ పాత్రలో బండారులంకకు చెందిన గొర్తి జశ్వంత్ నటించారు. జ్యోతి చిన్ననాటి క్యారెక్టర్‌లో ప్రియాలావణ్య, కేశనకుర్రు పాలెం వాసి సంతోష్ రాంబాబు చిన్ననాటి పాత్రలో డైలాగ్‌లు చెప్పాడు. బ్రిటిష్ పాత్రలో శ్రీమన్నారాయణ, రవి క్యారెక్టర్‌లో కార్తిక్ నటించాడు.
ఎనిమిది మంది చిన్నారులు గోదావరి యాసలో డైలాగ్‌లు చెప్పి అదరగొట్టారు. కేవలం ఈ చిన్నారులే కాదు. కోనసీమ ఫిల్మ్ అసోసియేషన్ స్థాపించి ఎంతో మందికి అవకాశాలు వచ్చేలా ప్రయత్నిస్తున్న గనిశెట్టి రమణలాల్ ఓ పాత్రలో ఆకట్టుకున్నారు. తమ పిల్లల్ని బిగ్ స్క్రీన్‌పై చూసుకున్న తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు చదువుతోపాటు వారిలో ఉన్న టాలెంట్‌ను బయటకు తీసేందుకు ఇటువంటి అవకాశాలు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తాయని వారు చెబుతున్నారు.
అభినందించిన దర్శక నిర్మాతలు...
"కమిటీ కుర్రోళ్లు" సినిమా నేపథ్యం అంతా గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో సాగడంతో ఇందులో ముఖ్య క్యారెక్టర్‌ల్లో నటించిన వారంతా ఇక్కడి వారినే ఎంపిక చేసినట్లు దర్శక నిర్మాతలు వంశీ, నిహారిక తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో అతని స్నేహితుల చిన్ననాటి క్యారెక్టర్లలో అమలాపురం ప్రాంతానికి చెందిన చిన్నారులు బాగా నటించారని నిహారిక కొణిదెల అభినందించారు.
కోనసీమలో జోరుగా షూటింగ్‌లు...
ఇటీవలే విడుదలైన "ఆయ్" సినిమా కూడా కోనసీమ ప్రాంతంలోనే చాలా వరకు షూటింగ్ జరుపుకోగా "కమిటీ కుర్రోళ్లు" చిత్రం దాదాపు కోనసీమ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుపుకుంది. గతంలో శతమానం భవతి, టక్ జగదీష్, ఇటీవల అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్, నాని నటించిన సరిపోదా శనివారం, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, జైహో జనార్థన్, వరాహా, టుక్ టుక్.. నాయుడు గారి అమ్మాయి, ఆర్‌కే పురంలో, శివాజ్ఞ తదితర చిత్రాలు ఇలా అనేక భారీ సినిమాలు కోనసీమ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. సముద్రఖని, జబర్దస్త్ ఫేం ధనరాజ్‌ల కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న రామం.. రాఘవం.. సినిమా కోనసీమ ప్రాంతంలోనే షూటింగ్ జరుపుకుంటోంది.
Also Read: అల్లు అర్జున్ నువ్వేమైనా పుడింగా, మెగా ఫ్యాన్స్ ఇక్కడ - జనసేన ఎమ్మెల్యే ఫైర్