అన్వేషించండి

Pawan Kalyan: వైసీపీ నేతల అవినీతిపై ఈ హ్యాష్‌ ట్యాగ్‌తో యుద్ధం చేయండి- కాకినాడ సభలో పవన్‌ పిలుపు

కాకినాడ డీ గ్యాంగ్‌ దోపిడీ గురించి, వైసీపీ క్రిమినల్స్‌ గురించి దేశం అంతా హ్యాష్‌ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేయాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.

- కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై విరుచుకుపడ్డ జనసేనాని..

కాకినాడ డీ గ్యాంగ్‌ దోపిడీ గురించి, వైసీపీ క్రిమినల్స్‌ గురించి దేశం అంతా హ్యాష్‌ ట్యాగ్‌తో ట్రెండింగ్ చేయాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు.  మగపిల్లలకు ధైర్యం లేకపోతే ఆడపిల్లలు చేయాలని సూచించారు. ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి నీ రోజులు దగ్గర పడ్డాయి. బలిసి కొట్టుకుంటున్నావు.. మీ నాయకునికి క్లిప్పింగ్స్‌ పంపించుకో.. నీ క్రిమినల్‌ ఎంపైర్‌నే నేలమట్టం చేస్తాం అంటూ పవన్‌ విరుచుకుపడ్డారు. కళ్లముందు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎదురుతిరగండి.. ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి గూండాగిరిని అడ్డుకునేందుకు హ్యాష్‌ ట్యాగ్‌ ఏపీ సీఎం బినామీ అంటూ ట్రెండ్‌ చేయాలని పిలుపునిచ్చారు. అక్రమంగా మట్టి తవ్వుతుంటే ఫోటో తీయండి, ఈ హ్యాష్‌ ట్యాగ్‌తో యూనియన్‌హోం మినిస్టర్‌ ఆఫీస్‌కు, డీజీపీకు, జనసేన ఆఫీస్‌కు ట్యాగ్‌ చేయండి అంటూ సూచించారు..

నాయకులు సరిగ్గా లేకుంటే ప్రజాస్వామ్యం అస్తవ్యస్థం.. 
జనవాణిలో ఎన్నో సమస్యలు బయటకు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే గురించి ఎన్నో సమస్యలు వచ్చాయి. నాకు వ్యక్తిగతంగా ఎందుకుంటుంది. ఇటువంటి కోన్‌ కిస్కా గాళ్ల గురించి భయం ఉండదు.. అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడిపై మండిపడ్డారు పవన్‌ కళ్యాణ్‌..  కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడాలంటే ప్రభుత్వం మారినప్పడుల్లా మారదని,  కులాల్లోని యువతను వాడుకుని వారి భావోద్వేగాలను వాడుకుంటే ఆ నాయకుల వెంట ఉండకూడదని సూచించారు. తన డ్రైవర్ను చంపి ఇంటికి డోర్‌ డెలవరీ చేస్తే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం చేస్తున్నారు..? మీకు కోపం రావడంలేదా.. అంటూ దళిత ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. బీసీ కులానికి చెందిన గౌడ బిడ్డను నిర్ధాక్షన్యంగా తోటల్లో చంపేస్తే బీసీ నాయకులు ఏం చేస్తున్నారు..? దానికి విలువ కట్టి లక్ష రూపాయలు ఓ బీసీ మంత్రి ఇస్తే లంగిపోవాలా అన్నారు. తనకు అన్ని కులాలు ఒక్కటేనని, సినిమా ఇండస్ట్రీ అంతా పవన్‌ కళ్యాణ్‌ సొంతం కాదు.. తనకు ఇన్‌ సెక్యూరిటీ లేదని, యువత మట్టుకు సినిమాను, రాజకీయాన్ని వేరు చేసి చూడరు.. సినిమా అభిమానం వేరు, రాజకీయం వేరు అన్నారు.

తనను చంపేస్తానని రకరకాలుగా బెదిరిస్తూ ఉంటారు..
సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి గారినే చంపేశారు.. సొంత కూతురే చంపేసిందన్న హార్డ్‌కోర్‌ క్రిమినల్స్‌ వీరు.. కులాన్ని దాటి చూడకుంటే ఆంధ్రప్రదేశ్‌ సర్వనాశనం అయిపోతుందని పవన్‌ కళ్యాణ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయి..? ఇవన్నీ లేనప్పుడు రెండున్నర లక్షల జాబ్‌ గ్యారంటీ ఇస్తానని ముఖ్యమంత్రి మర్చిపోయారు.. వీరు దోచుకుంటున్న ప్రజాధనంతో ప్రతీనియోజకవర్గానికి రూ.10వేల కోట్లు యువతకు పంచగలమన్నారు. మూడు కంపెనీలకు ఇసుక ఇచ్చారు. ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిల సొంతం అవుతుంది.. ఇదే పెద్ద ఉదాహరణ అన్నారు. ఉపాధి పొందాలంటే పెట్టుబడి కావాలి.. డబ్బు ఉన్నవాడే డబ్బు సంపాదిస్తున్నాడు కానీ.. దోపిడీని ఆపగలిగితే నిజాయితీకలిగిన వ్యక్తులను ఎన్నుకోగలిగితే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. సభలకు రావడం కాదు తాను కోరుకునేది ఎన్నికల్లో నిలబెట్టగలగాలని అని పవన్‌ కళ్యాణ్‌ అభిమానులను ఉద్దేశించి అన్నారు.

అసెంబ్లీకు పంపండి.. ద్వారంపూడి లాంటి వారికి బుద్ధి చెబుతాను.. 
కాకినాడ నడిబడ్డుకు వచ్చి ద్వారంపూడి లాంటి గూంఢాలను ఎదుర్కోవడం చాలా కష్టం.. నిజ జీవితంలో ఇటువంటివి ఎదుర్కోవాలంటే నన్ను, నా ఎమ్మెల్యేలను అసెంబ్లీకు పంపించండి అని కోరారు పవన్‌ కళ్యాణ్‌. అప్పుడు నేను వచ్చి మాట్లాడతానన్నారు. అధికారం లేకుండానే దశాబ్ధకాలంగా నిలబడి ఉన్నానని అన్నారు.  తానే ఇటీవల కాలంగా సోషల్‌ ఇంజనీరింగ్‌ ప్రారంభించానని, అన్ని కులాల్ని కలపాలి.. తెలంగాణాలో కులం కాదు తెలంగాణా ముఖ్యం కావాలి అని కోరుకుంటారని.. దురదృష్టవశాత్తూ ఆంధ్రలో కులాలవారిగా విడిపోయాం అన్నారు. రాష్ట్రం తెచ్చి ఇచ్చింది వైశ్యకులస్తుడైన పొట్టి శ్రీరాములు.. ఆయనకు జోహార్లు సమర్పించారు.  ద్వారాంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అనే గూంఢా దగ్గర 50 మంది క్రిమినల్‌ బ్యాచ్‌ బైక్‌లపై తిరుగుతూ బెదిరిస్తున్నారని, మీ పద్దతి మార్చుకోండి.. అవకాశం, అధికారం వచ్చిన రోజున వీధి వీధిన తన్ని తరిమేస్తా... చంఢాలు వలిపిస్తాను..అంటూ హెచ్చరించారు. ఆడపిల్లల జోలికి వచ్చినా, నీ గూంఢాలు వచ్చి బెదిరించినా మీ తాతకు చేసినట్లు నీకు బేడీలు వేసి మరీ తీసుకెళ్తాను.. ఒళ్లు పొగరెక్కి కొట్టుకుంటున్నావు.. అకారణంగా నన్ను బూతులు తిడుతున్నావు.. డబ్బులు ఎక్కువ అయ్యి వచ్చిన బలుపు ఇది.. నీ పతనం మొదలయ్యింది.. నీ క్రిమినల్‌ సామ్రాజ్యం కూలదోయకపోతే నా పేరు పవన్‌ కళ్యాణ్‌ కాదు.. మాపార్టీ జనసేన కాదు.. అంటూ శపథం చేశారు.
జయలక్ష్మి బ్యాంకు డైరెక్టర్లు డిపాజిటర్ల డబ్బును పక్కదోవపట్టించారు.. డిపాజిటర్లుకు కలెక్టర్‌ న్యాయం చేయాలని కోరారు.  కన్నబాబును రాజకీయాల్లోకి మేమే తీసుకొచ్చామని, మా దురదృష్టం తప్పుచేశామన్నారు.. చంద్రశేఖర్‌ రెడ్డి దోపిడీ ఎలా ఉంటుందంటే ఖాళీ స్థలాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ సర్వే పేరు చెప్పి కబ్జాలు చేయడం జరుగుతోంది.. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేయడం పరిపాటిగా మారింది.. తీరాన్ని కాపాడాల్సిన మడ అడవుల్ని చెట్లను నరికేయడం, ఇళ్ల స్థలాల పేరిట జనాల భూముల్ని లాక్కోవడం జరుగుతోందన్నారు.
ఇటీవల విశాఖలో అమిత్‌ షా వ్యాఖ్యలు ద్వారంపూడి చేసే క్రిమినల్‌ చర్యలతోనే చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో హ్యూమన్‌ ట్రాపికింగ్‌లో రెండో స్థానంలో ఉంది.. ఆడపిల్లలు పెత్త ఎత్తులో మిస్సింగ్‌ అవుతున్నారు..  ఎన్సీబీ రికార్ట్స్‌ తీస్తే ఇది నిజమని తేలింది..అందుకే అమిత్‌షా ఆ వ్యాఖ్యలు చేశారు..
వ్యవస్థలు పనిచేయనప్పుడు ఆయుధాలు పట్టాలని యువత కోరుకుంటారు.. అధి సమస్యకు పరిష్కారం కాకపవచ్చు.. అసెంబ్లీకు పంపిస్తే తనను ఉన్నతమైన స్థలంలో కూర్చోబెడితే వీటిపై విజయం సాధిస్తా అన్నారు.
కాకినాడ నుంచి అక్రమంగా బియ్యం రవాణా అవుతుంది.. 80 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం దిగుతుంటూ అక్రమంగా బియ్యం రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అంటూ ఆరోపించారు.  జనసేన లాంటి ప్రభుత్వం రావాలి దోపిడీను అరికట్టాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సీనియర్‌ నాయకులకు భయం.. పవన్‌ కళ్యాణ్‌కు లేదు.. ప్రజాస్వామ్యంలో ఉంటే ఎదుర్కోంటాను.. మరోసారి ఓట్లు వేయకపోయినా నేను నిలబడి ఉంటాను.. అభిమానులు పాలపొంగులా వచ్చి చల్లబడిపోతే లాభం లేదు.. నిలబడాలి.. ప్రశాంతమైన వైజాగ్‌ను క్రమినల్స్‌ అడ్డాగా మార్చారు.. మద్యతరగతి మేధావుల మౌనమే క్రిమినల్స్‌కు అవకాశం వస్తోంది.. ద్వారంపూడి లెక్కలు తీస్తుంటే అలసట వస్తుందన్నారు. ద్వారంపూడి, అతని తండ్రి, బాబాయ్‌ అంతాకలిని 1500 కోట్లు దోచేశారని ఆరోపించారు.

జగన్మోహన్‌రెడ్డి ఫ్యాక్షన్ సీఎం.. 
జగన్మోహన్‌రెడ్డి ఫ్యాక్షనిస్ట్‌, సీఎంతో నేను గొడవపెట్టుకుంటానని అన్నారు పవన్‌ కళ్యాణ్‌.  కాకినాడను డ్రగ్స్‌ డెన్‌గా మార్చేశారు. డ్రగ్స్‌ మాఫియా సూత్రధారి అయిన ద్వారంపూడి తెలంగాణ, యానాం నుంచి మద్యం తీసుకొచ్చి అమ్ముకుంటున్నారన్నారు. ఎన్నికలు రాబోతున్నాయి.. కాంట్రాక్టుదారులకు డబ్బులు లేవని చెబుతున్నారు..తాను ఎక్కడ నిలబడినా 200 కోట్లు వెచ్చించి ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు.. తాను ధైర్యంగా ఉన్నాను.. మీరు తన పక్షాన నిలబడాలని కోరారు. దళితులకు మేనమామను అనిచెప్పుకునే జగన్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరున ఉన్న విదేశీ విద్య పథకానికి ఆయన పేరు తీసి తన పేరు పెట్టుకున్నాడు. జగన్‌ అంబేడ్కర్‌ కంటే గొప్పవాడా అంటూ ప్రశ్నించారు.

ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి దోపిడీని ఎదుర్కోవాలంటే ఈ హ్యాష్ ట్యాగ్ వాడి ఏపీ డీజీపీ, అమిత్ షా ఆఫీస్ కి , జనసేన ఆఫీస్ ట్యాగ్ చేసి దౌర్జన్యాల, అక్రమాల ఫోటోలు తీసి ట్రెండ్ చేసి దేశమంతా తెలియజేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. .కలుగులో ఎలుకలను బయటకు లాగుదాం అన్నారు...

#APCMBinami
#APCMDGang
#YSJaganBinami
#YSJaganGang

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
Royal Enfield Retro Bike: రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రెట్రో థీమ్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Team India: పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
పాకిస్తాన్‌కు బిగ్ షాక్ - భారత జట్టు అక్కడికి వెళ్లేది లేదని విదేశాంగ శాఖ క్లారిటీ
Samantha Father Death: సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
సమంత ఇంట్లో విషాదం... తండ్రిని కోల్పోయిన స్టార్ హీరోయిన్
iPhone 17 Pro Max: కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
కొత్త ప్రాసెసర్, కొత్త డిజైన్, అన్నీ కొత్తగానే - ఐఫోన్ 17 ప్రో లీక్స్ సంచలనం!
Embed widget