![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan: వాళ్లందర్నీ పరామర్శిస్తా- ఫ్యామిలికో లక్ష ఆర్థిక సాయం అందజేస్తా: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై పవన్ ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. తరచూ ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రైతుల ఆత్మహత్యలను మొదట టేకప్ చేశారని సమాచారం.
![Pawan Kalyan: వాళ్లందర్నీ పరామర్శిస్తా- ఫ్యామిలికో లక్ష ఆర్థిక సాయం అందజేస్తా: పవన్ కల్యాణ్ jansena chief Pawan Kalyan react on Farmers suicide in Andhra Pradesh Pawan Kalyan: వాళ్లందర్నీ పరామర్శిస్తా- ఫ్యామిలికో లక్ష ఆర్థిక సాయం అందజేస్తా: పవన్ కల్యాణ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/13/3da294a9dfd48cd434a255bc694f39fe_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రైతుల ఆత్మహత్యలపై జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క గోదావరి(Godavari) జిల్లాల్లోనే 73 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆందోళన చెందారు. సాగును నమ్ముకుంటే చావే గతి అన్నట్టు పరిస్థితి ఉందని విమర్శించారు పవన్ కల్యాణ్
ఉభయగోదావరి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులు, కౌలు రైతులను పరామర్శిస్తానంటున్నారు పవన్ కల్యాణ్. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. స్వయంగా పవన్ కల్యాణ్ ఆయా ఫ్యామిలీలను పరామర్శించి ధైర్యం చెప్పబోతున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ప్రకటన బ్రేకింగ్ పాయింట్స్ (రైతు ఆత్మహత్యలు–ఆర్థిక సహాయం)
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2022
· రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాల..అప్పుల భారంతో ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాల్లోనే 80 కి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు
చనిపోయిన కౌలు రైతుల కుటుంబానికీ లక్ష రూపాయలు జనసేన ఆర్ధిక సహాయం అందచేస్తుంది. - JanaSena Chief Shri @PawanKalyan
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2022
Video Link:https://t.co/fYiRYn47R8
కుటుంబ పెద్ద కోల్పోయిన తీవ్ర ఆవేదనలో ఉన్న ఆ ఫ్యామిలీలకు అండగా ఉంటామంటున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. కొంతైనా ఊరట కల్పించేందుకు ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
· ఆ రైతు కుటుంబాలలోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండ ఇవ్వాలనే రూ.లక్ష సాయం చేస్తున్నాం.
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2022
· త్వరలోనే ప్రతి కుటుంబాన్నీ పరామర్శిస్తాను. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుంది.
· మనం ఈ రోజు తినే తిండి గింజల్లో 80శాతం కౌలు రైతుల కాయకష్టం వల్ల పండినవే.
ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించిన పవన్ కల్యాణ్... త్వరలోనే గోదావరి జిల్లాల్లో పర్యటిస్తానంటున్నారు. ప్రతి రైతు కుటుంబాన్నీ పరామర్శించి ధైర్యం చెప్పి లక్ష రూపాయల చెక్ అందజేయనున్నారు. ప్రభుత్వం నుంచి కౌలు రైతుకు ఎలాంటి సాయం అందట్లేదని ఆరోపించిన పవన్ కల్యాణ్ వారికు జనసేన అండగా ఉంటుందన్నారు.
అలాంటి కౌలు రైతుల బాధల గురించి తెలుసుకొంటుంటే హృదయం ద్రవిస్తుంది. కౌలు రైతుకు నిబంధనల పేరుతో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటంలేదు.సాగు చేసుకొంటే రుణం ఇవ్వరు.పంట నష్టపోతే పరిహారం ఇవ్వరు
— JanaSena Party (@JanaSenaParty) April 2, 2022
ఆత్మహత్య చేసుకున్నవారికీ ఆర్థిక సాయం అందించడంలేదు.కనీసం అధికారులు కూడా పరామర్శించి విచారించరు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)