అన్వేషించండి

East Godavari News: టికెట్‌ మీకు వచ్చినా మీకే రిస్క్‌- టికెట్‌ మాకు ఇచ్చినా మీకే రిస్క్‌- తూర్పులో టీడీపీని టెన్షన్ పెడుతున్న జనసేన!

ఉమ్మ‌డి తూర్పులో టీడీపీకు రెబ‌ల్స్ బెడ‌ద త‌ప్పేట‌ట్టు క‌నిపించ‌డంలేదు. టీడీపీ కేటాయించిన చోట జ‌న‌సేన అభ్యర్థ‌లు అవ‌స‌ర‌మైతే ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

AP Elections 2024: జనసేనకు పట్టున్న ప్రాంతంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా(East Godavari) కీలకంగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ముఖ్యంగా కాకినాడ(Kakinada), అంబేడ్కర్‌ కోనసీమ(Ambedkar Konaseema) జిల్లాలో అయితే జనసేన(Janasena)కు ఉన్న పట్టు మరింత బలీయమైనదనే విశ్లేషకులు చెబుతుంటారు.. ఈనేపథ్యంలోనే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) కాకినాడ జిల్లా పరిధిలోకి వచ్చే అన్నవరం (Annavaram)నుంచే తన వారాహి యాత్ర(Varahi Yatra)ను ప్రారంభించారు.. మొదటి దశలో చేపట్టిన ఈ యాత్ర సూపర్‌ సక్సెస్‌ అయ్యింది కూడా.. వారాహి యాత్రతోపాటు భారీ బహిరంగ సభల ద్వారా పవన్‌ కల్యాణ్‌ కేడర్‌లో ఫుల్‌ జోష్‌ నింపారు.

కాకినాడ సభలో అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌(Dwarampudi Chandra Sekhar) మీద నిప్పులు చెరిగారు పవన్. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చినట్లయ్యింది. అయితే అదే ఊపుతో ఉమ్మడి తూర్పులో జనసైనికులు అంతే ఉత్సాహంగా పార్టీ కోసం పని చేయడమే కాకుండా సోషల్‌ మీడియా వేదికగా అధికార పార్టీపై విస్తృతంగా విమర్శలు గుప్పించారు. ఇది పార్టీని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లిన పరిస్థితి కనిపించింది.

అయితే ఇప్పుడు టీడీపీ(Telugu Desam Party), జనసేన కలిసి ఎన్నికల బరిలో నిలుస్తుండడంతో కొందరు తమ టిక్కెట్టును కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయబోతోందని సమాచారం అందడంతో తీవ్ర నిరాసలో కూరుకుపోవడమే కాకుండా అవసరమైతే రెబల్‌గానైనా రంగంలోకి దిగాలన్న ఆలోచనలో కొందరు ఉన్నారన్న సమాచారం

టీడీపీ అభ్యర్ధుల్లో గుబులు రేపుతోంది.. 
ఇటీవల గణతంత్ర దినోత్సవం రోజు(Republic Day)న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం స్థానికంగా కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం(Rajanagaram) నియోజవకర్గం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు(Rajol) నుంచి జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారని ప్రకటించడం అక్కడి టీడీపీ అభ్యర్ధుల్లో గుబులు రేపగా టీడీపీ అభ్యర్ధులు పోటీ చేసే చోట అవసరమైతే రెబల్‌గా రంగంలోకి దిగుతామని జనసేనకు చెందిన మరికొందరు నాయకులు తమ అనుచరుల వద్ద చెప్పుకోవడం అక్కడ పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధుల్లో గుబులు రేగుతోందట. ఏదిఏమైనా టీడీపీ అభ్యర్థులకు టిక్కెట్టు కేటాయించినా, జనసేన అభ్యర్ధులకు టిక్కెట్టు కేటాయించినా చివరకు టీడీపీ అభ్యర్థులకే గుబులు రేగుతోందట.. 

అమలాపురంలో అయితే బహిరంగంగానే..
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రాజోలు, రామచంద్రపురం(Ramachandrapuram) నియోజకవర్గాలలో జనసేన అభ్యర్ధులు పోటీ చేస్తారన్న సమాచారం బాగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క పి.గన్నవరం(P Gannavaram), అమలాపురం (Amalapuram)నియోజకవర్గాలు కూడా జనసేన ఖాతాల్లోకి వెళ్లబోతున్నాయన్న ప్రచారం రెండు రోజులుగా జరుగుతోంది. అయితే ఒకే జిల్లాలో మూడు ఎస్సీ రిజర్వుడు స్థానాలు జనసేనకు ఎలా ఇస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రాజోలు, పి.గన్నవరం, అమలాపురం మూడు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు స్థానాలు.. రాజోలు, పి.గన్నవరం జనసేనకు కేటాయించినా అమలాపురం మాత్రం టీడీపీకి దక్కనుందని తెలుస్తోంది. ఇక్కడ జనసేన అభ్యర్ధి శెట్టిబత్తుల రాజబాబు(Rajababu) ఇప్పటికే ప్రజాసంకల్పయాత్ర(Praja Sankalpa Ytra) పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఈనేపథ్యంలో తనకు టిక్కెట్టు దక్కకపోతే అవసరమైతే రెబల్‌గా రంగంలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.. ఈవార్త టీడీపీ ఆశావాహుల్లో టెన్షన్‌ పెట్టిస్తుందట. అయితే ఇదే పరిస్థితి రాజోలు, కాకినాడ రూరల్‌(Kakinada Rurle) తదితర నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Advertisement

వీడియోలు

Montha Cyclone Effect | ఖమ్మం జిల్లాలో లారీతో సహా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన డ్రైవర్ | ABP Desam
Mumbai Kidnapper Rohit Arya Incident | ఆడిషన్ కి వచ్చిన పిల్లల్ని కిడ్నాప్ చేస్తే...ముంబై పోలీసులు పైకి పంపించారు | ABP Desam
India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ
India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
Rohit Sharma | ICC ODI Rankings | ప్రపంచ నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jemimah Rodrigues: ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. చిరకాలం గుర్తుండే ఇన్సింగ్స్ ఆడిన చిరుత జెమీమా
ఐదు నిమిషాల ముందు ఆర్డర్ మార్చారు…. అయినా అదరగొట్టేసింది. ఆసీస్‌ను చిరుతలా వేటాడిన జెమీమా
MS Raju Bhagavad Gita Issue: భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన  TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు - హిందూ సంస్థల ఆగ్రహం - క్షమాపణ చెప్పిన TTD బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజు
YS Jagan: చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
చంద్రబాబు వల్లే రైతులకు తీవ్ర నష్టం - పార్టీ నేతలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Montha Cyclone Effect: నీట మునిగిన హన్మకొండ బస్టాండ్
Maoist Surrender Rehabilitation 2025: లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
లొంగిపోయిన మావోయిస్టులు ఎక్కడ ఉంటున్నారు? వారి కోసం ప్రభుత్వాలు ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయా?
Andhra Pradesh Deputy CM Pawan Kalyan : మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
మోకాళ్ల లోతు బురద నీటిలో దిగిన పంట పొలాలను పరిశీలించిన పవన్ కల్యాణ్
India vs Australia second T20I : భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఎప్పుడు, ఎక్కడ ఆడతారు? A to Z వివరాలు తెలుసుకోండి
భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 ఎప్పుడు, ఎక్కడ ఆడతారు? A to Z వివరాలు తెలుసుకోండి
Baahubali The Epic Review : 'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
'బాహుబలి ది ఎపిక్'... మహేష్ బాబు కొడుకు రివ్యూ
Embed widget