YS Jagan Key Decisions: గోదావరి వరదలపై సీఎం జగన్ సమీక్ష, ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, మరిన్ని కీలక నిర్ణయాలివే
ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. నేటి ఉదయం గోదావరి వరదలపై సమీక్షించారు.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. శనివారం ఉదయం అధికారులతో సీఎం మాట్లాడారు. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు వివరాలందించిన అధికారులు. ఎక్కడ కూడా ప్రాణనష్టం ఉండకూడదని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు.
మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలి..
గోదావరి వరదలు, ప్రస్తుత పరిస్థితుల్లో మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలని సీఎం జగన్ సూచించారు. సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికిన అన్నికుటుంబాలకు చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, అందించాలన్న సీఎం. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీచేయాలన్న సీఎం.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 16, 2022
ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2వేలు లేదా వ్యక్తికి రూ. వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
630 గ్రామాలకు ముంపు ముప్పు..
గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహం విపరీతంగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇన్ ఫ్లో తగ్గట్టుగా నీటిని దిగువకు వదులుతున్నారు. వరద ప్రవాహ ఉద్ధృతి పెరిగితే.. దాదాపు 630కు పైగా గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. మొత్తం 6 జిల్లాల్లోని 44 మండలాల్లో 628 గ్రామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందస్తు చర్యల్లో బాగంగానే ముంపు ప్రభావిత ప్రాంతాల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. సంబంధిత అధికారుల యంత్రాంగం తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. క్షేత్ర స్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Also Read: Floods to Godavari: గోదారమ్మ ఉగ్రరూపం, 628 గ్రామాలపై ముంపు ప్రభావం!