News
News
వీడియోలు ఆటలు
X

Devil Fish: రాజమండ్రి దగ్గర దెయ్యం చేప కలకలం, వామ్మో! చాలా డేంజర్ - దొరికితే చంపేయాల్సిందే

Rajahmundry: ఈ చేప చూడడానికి వింతగాను, భయంగా కనిపించడంతో జిల్లా ఫిషరీస్ జేడీవీ కృష్ణారావు దృష్టికి మత్స్యకారులు తీసుకు వెళ్ళారు. దీనిపై స్పందించిన ఆయన చేప వివరాలు వెల్లడించారు.

FOLLOW US: 
Share:

Devil Fish Rajahmundry: తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి సరిహద్దుల్లో తూర్పు డెల్టా ప్రధాన కాలువలో మత్స్యకారులు సోమవారం చేపల వేటాడుతుండగా వారి వలకు డెవిల్ చేప చిక్కింది. భారతదేశంలో మత్స్య సంపదకు (ఆక్వా రంగానికి) నష్టాన్ని కలిగించే అతి భయంకరమైన, ప్రమాదకరమైన తక్కర్ (దెయ్యం, డెవిల్) చేప మొదట బంగ్లాదేశ్ నుండి అక్వేరియంలో పెంచుకునే ఆర్నమెంట్ ఫిష్ గా భారతదేశానికి వచ్చి్ంది. మత్స్యకార రైతులకు నష్టాన్ని కలిగిస్తూ సవాల్ విసురుతుంది.

అయితే ఈ చేప చూడడానికి వింతగాను, భయంకరంగా కనిపించడంతో జిల్లా ఫిషరీస్ జేడీవీ కృష్ణారావు దృష్టికి తీసుకు వెళ్ళారు. దీనిపై స్పందించిన ఆయన చేప యొక్క వివరాలు వెల్లడించారు. ఈ చేప మన రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులలో ప్రవేశించి ప్రమాదకర స్థాయిలో ఉందని ఆయన తెలిపారు. మిగిలిన చేపలపై దాడిచేసి వాటిని తనకు ఆహారంగా తీసుకుని రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని వెల్లడించారు. ఇది విత్తన చేపల ద్వారా రాష్ట్రం నలుమూలలకు విస్తరించిందని, ఆక్వా రంగానికి పెద్ద సమస్యగా తయారయిందని అన్నారు. ఈ చేపను దొరికినచోటే అంతం చేయాలని అన్నారు. అయితే, వింతగా భయంకరంగా కనిపించే ఈ చేపను చూసేందుకు 16వ నెంబరు జాతీయ రహదారిపై వెళ్లే పలువురు ఆసక్తిగా తిలకించారు.

మత్స్యకారులకు అలర్ట్
బంగాళాఖాతంలో తీవ్ర తుపాను అసని భయం నెలకొని ఉంది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 810 కిలో మీటర్లు, పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 880 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర తుపాను ప్రభావంతో బంగాళాఖాతంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. విజయనగరం జిల్లా, భోగాపురం మండలం, ముక్కాం తీరంలో సముద్రం 20 మీటర్ల మేర ముందుకొచ్చింది. మంగళ, బుధవారాల్లో ఉత్తరకోస్తాలో పలుచోట్ల మొస్తరుగా.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను కేంద్రం హెచ్చరించింది. కోస్తాలోని అన్నీ ఓడరేవుల్లో రెండో నెంబర్ హెచ్చరిక ఎగురవేశారు. విజయనగరం జిల్లా భోగాపురం పూసపాటిరేగ మండలాల్లోని 21 గ్రామాల్లో మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు.

Published at : 09 May 2022 02:56 PM (IST) Tags: east godavari devil fish devil fish in rajahmundry rajahmundry delta main canal aqua in ap best fishes

సంబంధిత కథనాలు

AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!

AP EdCET 2023: జూన్ 14న ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష, వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో!!

AP Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్- ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet Decisions:  ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ స్థానంలో జీపీఎస్-  ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Breaking News Live Telugu Updates: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రోహిత్‌

Breaking News Live Telugu Updates: డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రోహిత్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గదా యుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేటి నుంచి ఆసీస్‌, ఇండియా మధ్య గదా యుద్ధం, ఇది సినిమా కాదు ఎమోషన్ అంటున్న ప్రభాస్‌

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

Top 10 Headlines Today: నేడు ఏపీ మంత్రి మండలి సమావేశం, ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని ఇండియా, ఆసీస్‌ మధ్య ఫైట్

టాప్ స్టోరీస్

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

Bail For Magunta Raghava : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Bail For Magunta Raghava :  ఢిల్లీ లిక్కర్ స్కాంలో మలుపులు - మాగుంట రాఘవకు మధ్యంతర బెయిల్ !

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్

ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?

ఆ పార్టీలో మహేష్ భార్య నమ్రత ధరించిన కుర్తా అంత ఖరీదా?