అన్వేషించండి

Kakinada Constable Murder: కాకినాడలో గొంతు కోసి కానిస్టేబుల్ దారుణహత్య.. ఒక్కసారిగా దాడిచేసి గొంతు కోయడంతో విషాదం

Kakinada Crime News | కాకినాడ గాంధీనగర్‌లో APSP కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

కాకినాడ: కాకినాడ నగరంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఏపీఎస్పీ (APSP) కానిస్టేబుల్ నాగేశ్వరరావును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఒక్కసారిగా దాడి చేసిన నిందితులు, కత్తితో గొంతు కోయడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జనసంచారం ఉండే ప్రాంతంలోనే ఈ హత్య జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సొంత బామ్మర్దులే హత్య చేశారా..!

నాగేశ్వరరావు ఏపీఎస్పీ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆయన గాంధీ నగర్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారు. కత్తితో గొంతు కోయడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందారు. కుటుంబ గొడవల కారణంగా సొంత బావమర్ధులే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మరో ఇద్దరి అరెస్ట్ 
దళిత యువకుడు, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో పోలీసులు మరో ఇద్దరు నిందితులు కడియాల చిన్నబాబు(A2), కడియాల సతీశ్‌(A3)లను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో తలదాచుకున్న వీరిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు అనంతబాబు ఆదేశాలతో చిన్నబాబే సాక్షులను బంధించి, ప్రలోభాలకు గురిచేసి బెదిరించినట్లు పోలీసులు గుర్తించారు.

ఎమ్మెల్సీ అనంతబాబు జైలు నుంచే చిన్నబాబు ఫోన్‌కు వీడియో కాల్ చేసి సాక్షులను బెదిరించినట్లు సమాచారం. మాజీ మంత్రి కన్నబాబుకు సన్నిహితుడైన చిన్నబాబును విచారిస్తే, సాక్షుల కొనుగోలుకు ఉపయోగించిన నిధుల మూలాలు, ఆర్థిక లావాదేవీల వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ అరెస్టుతో కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది.

చేపల చెరువులో పడి ఇద్దరు మృతి..
పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నరసరావుపేట మండలం కాకాని చేపల చెరువులో మేతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు పడవ బోల్తా పడటంతో మృతి చెందారు. కొమ్మాలపాడు వాసులు చెరువును లీజుకు తీసుకొని చేపల పెంపకం చేపట్టారు. ఆదివారం చేపల మేతకు చెరువులోకి వెళ్లగా పడవ బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. మృతులు అగ్రహారానికి చెందిన హుస్సేన్, పిట్టంబండ్ల హుస్సేన్ బుడేగా పోలీసులు గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
El Nino ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!
మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget