Polavaram Project: ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.... వారం పది రోజుల్లో స్టేట్ అకౌంట్‌లోకి 1920 కోట్లు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన అంచనాలపై కాస్త పట్టు సడలించింది. సవరించిన అంచనాలు ఆమోదిస్తున్నట్టు కేంద్రజలశక్తి మంత్రి శుభవార్త చెప్పారు.
పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్‌డేట్ సాధించింది. నిధుల ఇచ్చేలా కేంద్రాన్ని ఒప్పించడంలో సక్సెస్ అయింది. తనను కలిసిన వైసీపీ ఎంపీలతో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సంతోషకరమైన వార్త అందించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదలలో సవరించిన అంచనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిపారు.
టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సూచించిన 47,725 కోట్ల రూపాయల సవరించిన అంచనాలకు ఆమోద ముద్రపడింది. గురువారం ఆర్థిక శాఖకు జల్‌శక్తిమంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించనుంది. వచ్చే వారం కేంద్ర మంత్రివర్గం ముందుకు పోలవరం సవరించిన అంచనాల ఫైల్ చర్చకు రానుంది.
పోలవరం ప్రాజెక్టు నిధుల అంశంపై చర్చించేందుకు వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రి జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. సవరించిన అంచనాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. 2013 సంవత్సరం భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస ప్యాకేజీ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగానే సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపినట్టు గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.
ఈ నిధుల ఇష్యూతోపాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రి తరలించాలని కూడా వైసీపీ ఎంపీలు కేంద్రమంత్రిని రిక్వస్ట్ చేశారు. ఎలాంటి షరతులు పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన నిధులు రియింబర్స్ చేయాలని విజ్ఞప్తి చేశారు వైసీపీ ఎంపీలు.
ఐదు అంశాలపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో చర్చించారు వైసీపీ ఎంపీలు. సవరించిన 55,656 కోట్ల రూపాయలకు ఆమోద ముద్రవేయాలని అభ్యర్థించారు. టిక్నికల్ అడ్వైజరీ కమిటీ చెప్పినట్టుగా .47,725 కోట్లు అంచనాలకే ఆమోదం తెలుపుతున్నట్టు కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. ఆమోదించిన నిధులను వీలైనంత త్వరగా ఎస్క్రో అకౌంట్స్ తెరిచి బదిలీ చేయాలని ఎంపీలు కోరారు.
ఎస్క్రో అకౌంట్ ద్వారా నిధులు పంపడం వీలైయ్యేది కాదని... ఇప్పటి వరకు రాష్ట్రం ఖర్చు చేసిన 1920 కోట్ల రూపాయలని రీయింబర్స్ చేస్తామన్నారు కేంద్రమంత్రి. వారం పది పదిరోజుల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టిన అమౌంట్‌ను స్టేట్ అకౌంట్‌లో వేసే ఛాన్స్ ఉంది. 47,725 కోట్ల రూపాయలు మాత్రం కేబినెట్ ఆమోదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీని రాజమండ్రికి తరలించే అంశంలో కూడా కేంద్రమంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించినట్టు వైసీపీ ఎంపీలు తెలిపారు.
కేంద్రమంత్రి గజేంద్రషెకావత్ ఇచ్చిన హామీపై వైసీపీ ఎంపీలు ఆనందం వ్యక్తం చేశారు. అనుకున‌్న లక్ష్యానికి పోలవరం పూర్తి చేసేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని... కేంద్రం నిధులు ఇవ్వక ముందే ఖర్చు పెట్టి పోలవరం పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా నిధులు విడుదల చేస్తే మరింత వేగంగా ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు వైసీపీ ఎంపీలు.