News
News
X

Bheemavaram News: కొత్త అల్లుడికి గోదారోళ్ల మర్యాదలు - 173 రకాల వంటకాలతో భోజనం, మామూలుగా ఉండదు మరి!

Bheemavaram News: సంక్రాంతి పండగకు వచ్చిన కొత్త అల్లుడికి గోదారోళ్ల 173 రకాల వంటకాలతో భోజనం పెట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

FOLLOW US: 
Share:

Bheemavaram News: సంక్రాంతి పండగకు వచ్చిన కొత్త అల్లుడికి గోదారోళ్లు చేసిన మర్యాదలు ఏంటో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటారా.. 173 రకాల వంటకాలతో భోజనం పెట్టి అల్లుడిని ఆశ్చర్యపరిచారు. అన్ని పదార్థాలను వేస్తూ కొసరి కొసరి భోజనం వడ్డించారు. వ్యాపారవేత్త తటవర్తి బద్రి, సంధ్య దంపతులు ఇటీవల తమ కుమార్తె హారికను.. పృథ్వీ గుప్తాకు ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లైన తర్వాత మొదటి పండుగ కావడం... అందులోనూ సంక్రాంతి కావడంతో ఇంటికి రమ్మని పిలిచారు. ఈ క్రమంలోనే ఇంటికొచ్చిన కొత్త అల్లుడిగి... 173 రకాల వంటకాలతో భోజనం వడ్డించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. చూసిన వాళ్లంతా వాహ్వా.. అదృష్టం అంటే నీది బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయ్.. గోదారోళ్ల మర్యాదలంటే మామూలుగా ఉండవంటూ మరికొంత మంది చెబుతున్నారు. 

గారెలు, బూరెలు, కారప్పూస, లడ్డూలు, అరిసెలు, పూర్ణాలు, పూరీలు, సకినాలు, పల్లీల కారం, చికెన్, మటన్, ప్రాన్స్ బిర్యానీలతో పాటు పలు రకాల కారాలు, గోబీ  65, కాజాలు, గోంగుర పులుసు, పొటాటో ఫ్రై, రేగు పండ్ల తొక్కు, ప్లెయిన్ పూతరేకులు, పల్లీ పూతరేకులు, డ్రై ప్రూట్స్ అన్నీ కలిపి చేసిన పూతరేకులు, బాదాం పూతరేకులు, సేమ్యా, రవ్వ లడ్డూలు, గర్జెలు, పాయసం, రవ్వకేసరి, గులాబ్ జామ్.. ఇలా అనేక రకాల వంటలు తయారు చేసి కొత్త అల్లుడికి తినిపించారు. అంతే కాదండోయ్ ఐదారు రకాల జ్యూస్ లు, మరో పది రకాల మందులు.. అంటే బీర్, వైన్ వంటివి. ఇవే కాకుండా కూల్ డ్రింక్స్ కూడా తాగించారు. 

Published at : 15 Jan 2023 12:04 PM (IST) Tags: AP News Bheemavaram news 173 Items Sankranthi Celebrations 2023 Sankranthi Special Items

సంబంధిత కథనాలు

Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా

Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా

Konaseema District News: లంక అందాలను రెట్టింపు చేస్తున్న పొద్దుతిరుగుడు పంట - ఫొటోల కోసం ఎగబడుతున్న జనాలు

Konaseema District News: లంక అందాలను రెట్టింపు చేస్తున్న పొద్దుతిరుగుడు పంట - ఫొటోల కోసం ఎగబడుతున్న జనాలు

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

విశాఖలో సీఎం జగన్ నివాసం అక్కడేనా ?

విశాఖలో సీఎం జగన్  నివాసం అక్కడేనా ?

ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?

ఉగాది నుంచి విశాఖలో సీఎం బస! ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే మళ్లీ మూడు రాజధానుల బిల్లు?

టాప్ స్టోరీస్

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !

YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం  !

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్