అన్వేషించండి

AP News: వైసీపీకి వరుస షాకులు- టీడీపీలోకి శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్

తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.  అమలాపురానికి చెందిన వైసీపీ యువజన నేత, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీ రాజీనామా చేశారు.

Ap Politics : ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ (YSRCP)కి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. నేతలు వరుసబెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy), వైసీపీ గుడ్ బై చెబుతున్నారు. తెలుగుదేశం (Tdp), జనసేన (Janasena) కండువాలు కప్పుకుంటున్నారు.  ఎప్పుడు ఎవరు వైసీపీకి ఝలక్ ఇస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వైసీపీలో ఉన్న నాయకులు...రేపు ఉంటారో లేదో తెలియడం లేదు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందిన కీలక నేతలంతా ఒక్కొక్కొరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రీజినల్ కో-అర్డినేటర్లు నచ్చజెబుతున్నా పట్టించుకోవడం లేదు. కొందరికి సీఎంవో నుంచి పిలుపు వచ్చినా వెళ్లడం లేదు. కొందరు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడిన తర్వాత కూడా పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. మొన్న మాజీ మంత్రి పార్థసారథి, నిన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తాజాగా శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. పార్టీకి రాం రాం చెబుతున్నట్లు సుభాష్ ప్రకటించారు. 

5వేల మందితో ర్యాలీ
తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.  అమలాపురానికి చెందిన వైసీపీ యువజన నేత, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీ రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. శనివారం 5వేల మంది అనుచరులతో ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో మంత్రి విశ్వరూప్, మరికొంత మంది సొంత పార్టీ నేతలు అనేక ఇబ్బందులు పెట్టారని వాసంశెట్టి సుభాష్ వాపోయారు. ఇబ్బందుల పాల్జేసిన వారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని చెప్పినా...వైసీపీ హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్ల కేసులోనూ...తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరినా...హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. 

ఆగ్రహంతో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు రక్షణనిధి, ఎలిజా
తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే ఎలిజా ఇప్పటికే పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  వైసీపీ అధిష్ఠానం మోసం చేసిందని, వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి తిరుగుబావుట ఎగురవేశారు. ఓ ఎంపీ చెప్పిన మాట విని...తనకు సీటు లేకుండా చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. 

మరోవైపు రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రూపొందిస్తున్నారు. నాలుగు జాబితాలను రిలీజ్ చేశారు. సర్వేల్లో రిపోర్టులు అనుకూలంగా లేకపోతే...ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గెలిచే వారికే టికెట్‌ అని చెప్పేస్తున్నారు.  అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రత్యర్థులు ఎత్తులు చిత్తయ్యేలా...కూటమికి ఝలక్‌ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా...మంత్రులయినా...మాజీ మంత్రులైనా...ఎంపీలయినా సరే...దుకాణం సర్దుకోవాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి దించితే గెలుస్తున్నారా లేదా అన్న దానికే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget