News
News
వీడియోలు ఆటలు
X

Adivasi Mahasabha: గిరిజన యువకులు, విద్యార్థుల డెత్‌ మిస్టరీ- సమగ్ర విచారణకు ఆదివాసీల డిమాండ్

Adivasi Mahasabha: గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అనుమానాస్పద మరణాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు జరిపించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది.  

FOLLOW US: 
Share:

Adivasi Mahasabha: గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అనుమానాస్పద మరణాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు జరిపించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. ఏజెన్సీలో వరుసగా చోటు చేసుకున్న అనుమానాస్పద మరణాలను ఆదివాసీ మహాసభ నాయకులు వివరించారు. జిల్లాలోని పలు చోట్ల చాలా మంది గిరిజన యువకులతోపాటు పవిద్యార్థులు మృతి చెందినట్లు తెలిపారు. 

రిమాండ్ ఖైదీ కన్నోజి రాజబాబు

రాజమండ్రి జిల్లా అడ్డతీగల మండలం బొడ్డంక గ్రామానికి చెందిన సెంట్రల్ జైలులో గత నెల 25వ తేదీన మరణించినప్పుడు మూడో టౌన్ పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ అమీనా బేగం ఎఫ్.ఐ.ఆర్. నెం.56/2023 నమోదు చేశారని తెలిపారు. ఎఫ్.ఐ.ఆర్. కాపీని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కి పంపకుండా రాజమండ్రి అర్బన్ తహశీల్దార్ కు పంపించారని చెప్పారు. దీంతో విలువైన సాక్ష్యాలు కనుమరుగైపోతాయని... పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని తహశీల్దార్ కు పంపడం ఏంటని ప్రశ్నించారు. తహశీల్దార్ స్వీకరించడం సి.ఆర్.పి.సి.175(1ఎ) ప్రకారం చట్ట విరుద్ధం అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం మూడో టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పైన, తహశీల్దార్ పైన, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కన్నోజి రాజబాబును అక్టోబర్ 13వ తేదీన అడ్డతీగల పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. 14వ తేదీన తాను రాజబాబు కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లానని బొడ్లంక గ్రామ పంచాయితీ సర్పంచ్ బోనెం రాఘవ చెబుతున్నారు.

14వ తేదీన అడ్డతీగల పోలీస్ లాకప్ లో ఉన్న రాజబాబుతో తాను మాట్లాడానని అన్నారు. అక్టోబర్ 16న గంజాయితో పట్టుకున్నామని వై.రామవరం పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయడం వాస్తవ విరుద్ధమని అన్నారు. ఈమేరకు అడ్డతీగల, వై.రామవరం పోలీసులపై విచారణ జరిపించి తీసుకోవాలని కోరుతూ రాజబాబు తండ్రి కన్నోజి నూకరాజు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి, ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు ఇటీవల ఫిర్యాదు చేశారని తెలిపారు. 

ఎంబీబీఎస్ వైద్యుడినంటూ చికిత్స - ప్రాణాలు కోల్పోయిన శివరామకృష్ణారెడ్డి 

ఏజెన్సీ గంగవరం మండలం జడేరు గ్రామానికి చెందిన ఏట శివరామకృష్ణారెడ్డి జ్వరంతో బాధపడుతూ... 2020లో అక్టోబర్ 28వ తేదీన అడ్డతీగలలోని సంజీవని ఆస్పత్రిలో చేరారు. గుబ్బల సత్యనారాయణ తాను ఎంబీబీఎస్ వైద్యుడినంటూ చికిత్స చేశారు. ఈ క్రమంలోనే రోగి చనిపోయారు. అడ్డతీగల పోలీసులు అనుమానాస్పద మృతిగా క్రైం.144/2020గా కేసు నమోదు చేశారు. డీఎం, హెచ్ఓ  పోలీసులకు పంపిన నివేదికలో గుబ్బల సత్యనారాయణ రిజిష్టర్ డాక్టర్ కాదని పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐపీసీ 304 పారు -2 గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956 సెక్షన్ 15(3) ప్రకారం, ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. 

టీచర్ తో చనువుగా ఉండటమే కారణమా

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అడ్డతీగల మండలం పైడిపుట్ట గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ (16) గంగవరం మండలం, గంగవరం ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదివేవాడు. 2021 జనవరి 28న అనుమానాస్పద స్థితిలో ప్రధానోపాధ్యాయుడి గదిలో మరణించాడు. గంగవరం పోలీస్ స్టేషన్లో సి.ఆర్.పి.సి.174 గా ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. అప్పటి నుండి ఈ కేసు విషయమై పోలీసులు గానీ, ఇతర అధికారులు గానీ ఏ విధమైన సమాచారం అందించలేదని మృతుని తండ్రి పరదా కామన్నదొర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని ఉరి వలననే విద్యార్థి మరణించినట్లుగా 2021 జూన్ 25న ఈకేసును పోలీసులు క్లోజ్ చేశారు. ఈ కేసులో పలు అనుమానాలు ఉన్నాయని అవివాహితయైన టీచర్ తో తన కుమారుడు చనువుగా ఉండటం ఈ మరణానికి కారణమై ఉండవచ్చని విద్యార్థి తండ్రి కామన్న దొర సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సమగ్ర విచారణ జరిపించాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. 

దేవీపట్నం మండలంలోని ముసినికుంట ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదివే పొడియం యమున శ్రీ, 10వ తరగతి చదువుతున్న కానెం ఈశ్వరీదేవి సకాలంలో వైద్యం అందక మరణించారు. దీంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురయ్యారు.  హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్లిపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గిరిజన ప్రాంతంలోని అన్ని హాస్టల్లలో అధికారులతో సమావేశాలు జరిపించి వారిలో భయాందోళనలు తొలగించాలని ఆదివాసీ మహాసభ విజ్ఞప్తి చేస్తున్నట్లూ తెలిపారు.

Published at : 27 Mar 2023 01:48 PM (IST) Tags: AP News East Godavari News Adivasi Mahasabha Deaths of Tribal Youths Comprehensive Inquiry

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

ఉచితాలతో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ- ఇప్పుడు అదే అసలైన టాస్క్

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

Weather Latest Update: ఆ ప్రాంతాల ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం- మూడు రోజులు వర్షాలే వర్షాలు

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

పాఠశాలల్లో 'ఉచిత' ప్రవేశాలకు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

TDP Manifesto: భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ మినీ మేనిఫెస్టో, చంద్రబాబు 6 ప్రధాన హామీలు

టాప్ స్టోరీస్

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

Harish Rao: ప్రకృతి వైపరీత్యాల కన్నా ప్రతిపక్షాలు ప్రమాదం - హరీశ్ రావు ఎద్దేవా

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం

Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

Bro Movie Update: మామా అల్లుళ్ల  పోజు అదిరింది ‘బ్రో’-  పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12

GSLV F12: ఇస్రో ప్రయోగం విజయం- నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ ఎల్ వీ ఎఫ్ 12