MP Bharat : ఆ వృద్ధురాలు కుక్కకాటు ఇంజెక్షన్ కోసం వచ్చింది - జగన్ సభ కోసం రాలేదన్న ఎంపీ భరత్ !
రాజమండ్రి ఎంపీ భరత్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజమండ్రిలో ప్రమాదానికి గురైన వృద్ధురాలు జగన్ సభ కోసం రాలేదన్నారు.
MP Bharat : రాజమండ్రిలో ఓ వృద్ధురాలు బస్సు నుంచి జారి పడటం.. వెంటనే ఆమె కాలుపై నుంచి కారు వెళ్లిన ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. సీఎం జగన్ సభ కోసం ఆమెను బలవంతంగా తీసుకు వచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణల్ని రాజమండ్రి ఎంపీ భరత్ ఖండించారు. కుక్క కరిస్తే ఇంజక్షన్ చేయించుకోవడానికి రాజమండ్రి హాస్పటల్ కి వచ్చారని.. ఇంటికి వెళ్ళే మార్గంలో లాలా చెరువు వద్ద ప్రమాదం జరిగిందన్నారు. ఈ ప్రమాదానికి సభకి సంబంధాలు లేదన్నారు. టిడిపి సభ లో చనిపోతే ముఖ్యమంత్రి సభలో కూడా చని పోవాలి టిడిపి చూస్తూ దుష్ట ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ సభకు జనాన్ని తరలించలేదని అందరూ స్వచ్చందంగా వచ్చారన్నారు.
పెన్షన్లపై చంద్రబాబు, టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎవరి పెన్షన్లూ తీసేయలేదని ఎంపీ భరత్ అన్నారు. లోకేష్ కు లోక జ్ఞానంలేదని ఆయన చేతుల్లో రాష్ట్రాన్ని పెడతామా అని ప్రశ్నించారు. చంద్రబాబు రోడ్ షోలు చేయడం లేదని శవయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు చెలగాటం ఆడుతున్నారని విమర్శఇంచారు.
మంగళవారం రాజమండ్రిలో ముఖ్యమంత్రి జగన్ వృద్ధులకు ఈ నెల నుంచి రూ. 250 పెన్షన్ పెంచినందున వారితో ముఖా ముఖి కార్యక్రమాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెన్షన్లు పొందుతున్న వృద్ధులను వాలంటీర్లు సభకు తీసుకు వచ్చారు. చాలా మంది 70 ఏళ్లు పైబడిన వాళ్లు కావడం.. బస్సులు ఎక్కి , దిగలేని ఆరోగ్య పరిస్థితుల్లో ఎక్కువ మంది ఉన్నారు జగన్ సభకు రాకపోతే పెన్షన్లు ఆపేస్తామని హెచ్చరించి బలవంతంగా బస్సులు ఎక్కించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా బస్సుల్లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ లో జరుగుతున్న సమయంలో 70 ఏళ్ళకు పైగా వృద్ధురాలు పార్వతి జారిపడిపోయింది. రోడ్డు మీద పడిపోవడంతో.. వెంటనే పక్కన వేరే వాహనం ఆ వృద్ధురాలు మీదకు ఎక్కడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఆమె కాళ్లను వైద్యులు తొలగించారు. అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం ఆమెను సభ కోసం ఎవరూ తీసుకు రాలేదని.. కుక్క కరిచినందున ఇంజక్షన్ కోసం వచ్చినట్లుగా చెబుతోంది. ప్రస్తుతం పార్వతి రెండు కాళ్లు తీసేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరితోనూ మాట్లాడే పరిస్థితి లేదు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహించిన బహిరంగసభల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వం నిన్న రాత్రే.. బహిరంగసభలు, సమావేశాలపై నిషేధం విధించింది. పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా తెలిపింది. అయితే సీఎం జగన్ సభకు మాత్రం.. పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా.. పించన్ అందుకుంటున్న వృద్ధులను వాలంటీర్ల సాయంతో తరలించారన్న ఆరోపణలు వచ్చాయి. రోడ్ షో కూడా నిర్వహించారు. పెద్ద వయసు ఉన్న వారు ఇబ్బంది పడినా.. పట్టించుకోలేదు. తామే తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకు వస్తామని చెప్పి తీసుకెళ్లారు కానీ.. ఆ వృద్ధులు కొన్ని గంటల పాటు సభలో నిల్చుకోవడానికి .. కూర్చోవడానికి ఇబ్బందులు పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.