News
News
X

Raghurama : సీబీఐ కేసుల విచారణపై స్టే - సుప్రీంకోర్టులో రఘురామకు ఊరట ! ఆ కేసులేమిటంటే ?

సుప్రీంకోర్టులో రఘురామకు ఊరట లభించింది. సీబీఐ కేసులో విచారణపై స్టే విధించింది.

FOLLOW US: 

Raghurama :  ఇందు భారత్‌ ధర్మల్‌ కంపెనీపై దాఖలైన సీబీఐ కేసు విచారణను నిలిపివేయాలని ఆదేశించింది. తన కంపెనీ దివాళా తీసిందంటూ ప్రకటించడాన్ని గతంలో ఎంపీ రఘురామ హైకోర్టు లో సవాలు చేశారు. దివాళా కంపెనీగా ప్రకటించడానికి అనుసరించాల్సిన పద్ధతులను అనుసరించలేదన్నారు. మొదట హైకోర్టులోనూ ఎంపీ రఘురామకు ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న హిమా కోహ్లీ .. రఘురామపై దాఖలైన సీబీఐ కేసు విచారణపై స్టే విధించారు. జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ సీజే అయిన తరువాత స్టే తొలగించారు. హైకోర్టు నిర్ణయాన్ని ఎంపీ రఘురామ సుప్రీంలో సవాలు చేశారు. రఘురామ పిటిషన్‌ను న్యాయమూర్తులు అజరు రస్తొగి, సిటి రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. తుది తీర్పు వెలువడేంతవరకూ కేసు విచారణను నిలిపివేయాలని సీబీఐఐకి ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపధ్యంలో సీబీఐ కేసు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

ఆర్థిక సంస్థలను మోసం చేశారని సీబీఐ కేసు  

ఆర్థిక సంస్థలను మోసం చేశారంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఆయనకు చెందిన కంపెనీలపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది.  రూ.947.71 కోట్ల మేరకు మోసం చేశారని సీబీఐ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు.  ఈ కేసులో 16 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో ఇంద్‌ భారత్‌ పవర్‌ మద్రాస్‌ లిమిటెడ్‌ ఏ1గా ఉండగా.. ఆ సంస్థ చైర్మన్‌, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏ2గా ఉన్నారు. సంస్థ డైరెక్టర్‌ మధుసూదనరెడ్డిని ఏ3గా, రఘురామకే చెందిన మరిన్ని కంపెనీలు ఉన్నాయి.

News Reels

రుణాలు తీసుకున దారి మళ్లించారని ఆరోపణలు

తమిళనాడులోని తూత్తుకూడిలో విత్యుత్‌ప్లాంట్‌ నిర్మాణానికి పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ నుంచి రూ.947.71 కోట్లు రుణాలు తీసుకున్నారని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే కాకుండా రుణ ఒప్పందంలో పేర్కొన్న షరతులను పాటించలేదని వివరించింది. ఈ రుణ మొతాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యుకో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల కోసం మళ్లించడంతో పాటు కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు చెల్లించినట్లు సీబీఐ పేర్కొంది. ఆ తర్వాత రుణాలు చెల్లించకపోవడంతో ఈ డిపాజిట్లను రుణాలకు సర్దుబాటు చేసినా బ్యాంకులకు నష్టం వాటిల్లిందని చార్జిషీట్‌లో సీబీఐ  వివరించింది.

బ్యాంకులు ఫిర్యాదు చేసిన కేసులోనూ గతంలో సోదాలు

గత ఏడాది అక్టోబర్ లో రఘురామ కృష్ణంరాజుకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేసింది.   దేశంలో 11 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది.ఇండ్- భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థ తమ నుంచి అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదంటూ ఎస్బీఎస్, ఐఓబీ, యాక్సిస్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆప్ బరోడా.. ఇండ్–భారత్ కంపెనీ ఎకౌంట్లను మోసపూరిత ఖాతాలుగా ప్రకటించాయి.  
 
Published at : 01 Oct 2022 05:09 PM (IST) Tags: Raghurama CBI Case Supreme Court

సంబంధిత కథనాలు

Temple for Daughter: చనిపోయిన కూతురిపై తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ! గుడి కట్టి పూజలు

Temple for Daughter: చనిపోయిన కూతురిపై తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ! గుడి కట్టి పూజలు

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!

AP Police SI Notification: ఏపీలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!

AP Police SI Notification: ఏపీలో 411 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!

Nellore Collectorate: నెల్లూరు కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం

Nellore Collectorate: నెల్లూరు కలెక్టరేట్ లో మహిళ ఆత్మహత్యాయత్నం కలకలం

Gudivada Amarnath: అమరావతి అతి పెద్ద స్కాం, చంద్రబాబు ప్లాన్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి: మంత్రి అమర్నాథ్

Gudivada Amarnath: అమరావతి అతి పెద్ద స్కాం, చంద్రబాబు ప్లాన్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి: మంత్రి అమర్నాథ్

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు