Purandeswari : రాష్ట్రపతి భవన్‌పై రాజకీయాలా ? సజ్జల కామెంట్లపై పురందేశ్వరి అసహనం !
రాష్ట్రపతి భవన్ పై సజ్జల రాజకీయ ముద్ర వేయడాన్ని పురందేశ్వరి ఖండించారు. ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
![Purandeswari : రాష్ట్రపతి భవన్‌పై రాజకీయాలా ? సజ్జల కామెంట్లపై పురందేశ్వరి అసహనం ! Purandeshwari condemned Sajjala's political stamp on Rashtrapati Bhavan. Purandeswari : రాష్ట్రపతి భవన్‌పై రాజకీయాలా ? సజ్జల కామెంట్లపై పురందేశ్వరి అసహనం !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/31/c017d61a540f0482fac548f7636080e81693481603236228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Purandeswari : రాష్ట్రపతి భవన్‌ను ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయాల్లోకి లాగారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.ఢిల్లీలో రూ.100 ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ కార్యక్రమానికి కుటుంబసభ్యులు హాజరుకావడంపై రాజకీయ రంగు పులమడం శోచనీయమన్నారు. రాష్ట్రపతి భవన్‌కు రాజకీయ రంగు పూయడం రాష్ట్రపతి హోదాను కించపరచడమేనని.. అది సరికాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై పురందేశ్వరి మండిపడ్డారు. రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో కుటుంబమంతా హాజరయ్యాం అని, కుటుంబ సభ్యుల హాజరుపై రాజకీయ రంగు పులమండం కరెక్ట్ కాదన్నారు. ఆ కార్యక్రమానికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని గట్టిగా చెప్పారు.
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు
ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలపై ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారని, వాటికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై తాను స్పందించనని అన్నారు. అన్యమతస్తులను దేవాలయ పాలక మండళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు. దేవాలయాల వద్ద సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టామని చెప్పారు. బీజేపీ చేపట్టిన ‘నా భూమి, నాదేశం’ కార్యక్రమంలో భాగంగా.. వచ్చే నెల 1 నుంచి 15 వరకు గ్రామాల్లో మట్టిసేకరణ కార్యక్రమం చేపడతామని.. సేకరించిన మట్టిని ఢిల్లీకి తీసుకెళ్తామని తెలిపారు. అక్కడ అన్ని రాష్ట్రాల మట్టితో అమృత వనం ఏర్పాటు చేస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు. పార్టీ జాతీయ నాయకత్వం నుంచి నుంచి వచ్చిన పిలుపు మేరకే మట్టి సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్టుగా స్పష్టం చేశారు. పంచాయితీల నిధుల మళ్లింపుపై సర్పంచులు, జనసేనతో కలిసి ఆందోళన చేశామని అన్నారు. పంచాయితీ నిధుల వ్యవహారంపై గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు.
సజ్జల ఏమన్నారంటే ?
న్టీఆర్ నాణెం విడుదల సందర్భంగా లక్ష్మి పార్వతి ని పిలవకుండా ఎన్టీఆర్ ఆత్మ క్షోభకు గురి చేశారని నిప్పులు చెరిగారు. బీజేపీ, చంద్రబాబుని కలపడానికే పురంధరేశ్వరి ని బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టారు….బీజేపీ, టీడీపీ కలపాలని అనుకుంటే ఎవరు అపుతారు.? అంటూ పేర్కొన్నారు. చంద్రబాబు భావజాలం అంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడం అంటూ మండిపడ్డారు. చంద్రబాబు బఫూన్ కి ఎక్కువ.. జోకర్ కి తక్కువ అన్నారు సజ్జల. అసలు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో చంద్రబాబుకి క్లారిటీ లేదన్నారు సజ్జల. బీజేపీతో పొత్తుకోసం చంద్రబాబు తహతహలాడుతున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారు చంద్రబాబు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)