అన్వేషించండి

Andhra News : ఏపీలోనూ జనసేన, బీజేపీ కలిసే వెళ్తాయి - పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు !

Andhra News : ఆంధ్రలోనూ జనసేన, బీజేపీ కలిసే ఎన్నికలకు వెళతాయని పురందేశ్వరి ప్రకటించారు. టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అన్నది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Andhra News purandeswari :   ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో  బీజేపీ, జనసేన ( BJP Janasena )  కలిసే వెళ్తాయి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నామని స్పష్టం చేశారు. అయితే టీడీపీతో ( TDP) పొత్తు ఇతర అంశాలపై బీజేపీ అగ్రనాయకత్వం ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. వైసీపీ అవినీతి, అక్రమాలు, అరాచకాలపై పోరాటం చేస్తామని దగ్గుబాటి పురంధేశ్వరి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం పర్యటించారు. ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసి కక్ష పూరిత రాజకీయాలతో కాలం గడుపుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు విమర్శించారు. 

ఏపీలో స్కాంపై కేంద్రం ప్రత్యేక దృష్టి 

ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తే ఇతర పార్టీలతో సంబంధాలు అంటగట్టడం...కేసులు పెట్టి వేధించడం దారుణం అని పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు కేంద్రమే నిధులిస్తోందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం సొంతంగా చేస్తున్న పని ఒక్కటీ కూడా లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించడం విపక్షాల హక్కు అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో గతుకుల రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని... పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదని విమర్శించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో కుంభకోణాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పురందేశ్వరి వెల్లడించారు.

ఏపీలో కలిసి పని చేసుకుంటున్న టీడీపీ, జనసేన                       

జనసేన పార్టీతో కలిసి వెళ్తామని పురందేశ్వరి చెబుతున్నప్పటికీ.. జనేసన పార్టీ మాత్రం ఇప్పటికే  టీడీపీతో పొత్తును ఖరారు చేసుకుంది. నియోజకవర్గ స్థాయి వరకూ సమన్వయం కోసం  సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు పార్టీల నేతలు కలిసి పని చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఎక్కడా బీజేపీని కలుపుకుని పోవాలని అనుకోవడం లేదు. బీజేపీ గురించి  పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారు.  

తెలంగాణ ఎన్నికల తర్వాత నిర్ణయాలు ఉంటాయా ?             

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. మొదట జనసేన ఒంటరిగా పోటీ చేయాలని  అనుకుంది. కానీ తర్వాత బీజేపీతో పొత్తుల ప్రతిపాదనలు రావడంతో అంగీకరిచింది. మొత్తంగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తున్నారు. పోటీ అయితే చేస్తున్నారు కానీ.. ప్రచారాలు చేయడం లేదు. అక్కడ టీడీపీ మద్దతు ఇస్తుందో లేదో తెలియదు. అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అందుకే ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలోనూ పొత్తుల అంశంపై బీజేపీ వైపు నుంచి కొన్ని చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర్లోనే ఉండే అవకాశం ఉండటంతో  వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.              

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!
Pushpa 2 Stampede: 'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
'అల్లు అర్జున్ కళ్ల ముందే మహిళను చంపేశారు' - సంచలన విషయాలు బయటపెట్టిన ప్రత్యక్ష సాక్షి
Pushpa 2 Leaked: 'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
'పుష్ప 2'కు పైరసీ రాయుళ్ల నుంచి షాక్... విడుదల రోజు ఉదయమే అన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్
Embed widget