News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Proddutur MLA daughter's wedding : నిరాడంబరంగా కుమర్తె ప్రేమ పెళ్లి - ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆదర్శం !

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకున్నారు. డబ్బు, కులానికి ప్రాధాన్యం ఇవ్వకుండా పెళ్లి చేసినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.

FOLLOW US: 
Share:

Proddutur MLA daughter's wedding : ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద రెడ్డి పెద్ద కుమార్తె పల్లవి వివాహాన్ని నిరాడంబరంగా ఓ ఆలయంలో నిర్వహించారు. బొల్లవరంలోని వేంకటేశ్వర ఆలయంలో ఈ పెళ్లి జరిగింది. తర్వాత ప్రొద్దుటూరులోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఎమ్మెల్యే పెద్ద కమార్తె పల్లవి చదువుకునే రోజుల్లో పవన్ కుమార్ అనే సహాధ్యాయిని ప్రేమించారు. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పి వారి అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనకున్నారు. కుటుంబంలో తీవ్రంగా చర్చించిన తర్వాత పిల్లల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రసాదరెడ్డి నిర్ణయించుకున్నారు. డబ్బు, కులమతాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా..  పిల్లల అభీష్టానికి అనుగుణంగా పెళ్లి చేయించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.                                                                                  

చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన - ఎంపీ మాధవ్ హౌస్ అరెస్ట్ !

తాను నిరాడంబరంగా తన మొదటి కుమార్తె పల్లవి ప్రేమ, కులాంతర వివాహానికి ఒప్పుకుని ఆశీర్వదించాను అన్నారు. తన కుమార్తె ఇష్ట ప్రకారం దగ్గరుండి వివాహం చేశానని.. పేదవాడైన పవన్‌ను కలిసి చదువుకున్న రోజుల్లో పల్లవి ఇష్టపడటంతో పెళ్లి చేసినట్లు చెప్పారు. డబ్బుకు, హోదాకు, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.                                                          

1, 2, 3, 4, 5, కౌంట్ పెరుగుతుందా? ఇక్కడితో ముగుస్తుందా? తిరుమల భక్తుల్లో తొలగని భయం!                                           

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన రెండో సారి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కడప జిల్లాలో  వైఎస్ఆర్ కంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు అయిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి .. పెద్ద కుమార్తె వివాహాన్ని.. కులాంతర వివాదం..అదీ కూడా నిరాడంబరంగా చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఆయన తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. కులాల పేరుతో అర్థం లేని పట్టింపులకు పోవడం.. ఆస్తులు, అంతస్తుల పేరుతో  ప్రేమించుకున్న పిల్లల్ని విడదీయడం వల్ల వారి జీవితాల్లో ఇబ్బందులు సృష్టంచడమే అవుతుందని అందుకే ఎమ్మెల్యే తన కుమార్తె ను  నిండు మనుసుతో కులాంతర వివాహానికి అంగీకరించారని అంటున్నారు.           

Published at : 07 Sep 2023 03:03 PM (IST) Tags: Proddutur MLA Rachamallu Prasada Reddy daughter of Proddutur MLA got married

ఇవి కూడా చూడండి

Kollu Ravindra: పోలీసుల కనుసన్నల్లోనే వారాహి యాత్రపై కుట్రకు యత్నం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు

Kollu Ravindra: పోలీసుల కనుసన్నల్లోనే వారాహి యాత్రపై కుట్రకు యత్నం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు

CM Jagan : గురువారం ఢిల్లీకి సీఎం జగన్ - అధికారిక షెడ్యూల్ ఇదే!

CM Jagan : గురువారం ఢిల్లీకి సీఎం జగన్ - అధికారిక షెడ్యూల్ ఇదే!

K Narayana: వాళ్లవి ముద్దులాట, గుద్దులాట మాత్రమే - తులసి తీర్థం పోసినట్లు పసుపు బోర్డు: నారాయణ

K Narayana: వాళ్లవి ముద్దులాట, గుద్దులాట మాత్రమే - తులసి తీర్థం పోసినట్లు పసుపు బోర్డు: నారాయణ

Yarapatineni Srinivasa Rao: రాబోయే ఎన్నికల్లో రాముడు, రావణాసురుడికి మధ్య పోటీ, మాజీ మంత్రి యారపతినేని

Yarapatineni Srinivasa Rao: రాబోయే ఎన్నికల్లో రాముడు, రావణాసురుడికి మధ్య పోటీ, మాజీ మంత్రి యారపతినేని

Chandrababu Arrest : చంద్రబాబు పిటిషన్లపై విచారణ గురువారం ఉదయానికి వాయిదా - ఏసీబీ కోర్టులో వాదనల్లో ముఖ్యాంశాలు ఇవే

Chandrababu Arrest :   చంద్రబాబు పిటిషన్లపై విచారణ గురువారం ఉదయానికి వాయిదా -  ఏసీబీ కోర్టులో వాదనల్లో ముఖ్యాంశాలు ఇవే

టాప్ స్టోరీస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Cheapest 5G Phone in India: ఐటెల్ పీ55 సేల్ ప్రారంభం - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ - రూ.తొమ్మిది వేలలోపే!

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు

Malkajgiri News: ఎమ్మెల్యే మైనంపల్లిని చర్లపల్లి జైలుకు పంపుతా - ఆయన ప్రత్యర్థి హెచ్చరికలు