News
News
X

Chandrababu : వరుపుల రాజా మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణం, కేసులు పెట్టి వేధించారు- చంద్రబాబు

Chandrababu : టీడీపీ నేత వరుపుల రాజా హఠాన్మరణంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరుపుల రాజాపై కేసులు పెట్టి వేధించారని, అది తట్టుకోలేక ఆయనకు గుండెపోటు వచ్చిందన్నారు.

FOLLOW US: 
Share:

Chandrababu : ప్రత్తిపాడు నియోజకవర్గo ఇన్ ఛార్జ్ వరుపుల రాజా భౌతిక కాయానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... వరుపుల రాజా మరణానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. రాజాపై అనేక కేసులు పెట్టి మానసికంగా వేధించారని, ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు  వచ్చిందన్నారు. రాజా మరణాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

కేసులతో వేధించారు 

"కరోనా తర్వాత గుండెపోటు సమస్యలు ఎక్కువయ్యాయి. ఇంకొకటి ప్రభుత్వం కూడా వరుపుల రాజాను వేధించింది. 12 కేసులు పెట్టి వేధించారు. ఆయన హత్యను రాజకీయం చేయదలుచుకోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా కుటుంబాలు పెద్ద దిక్కులు కోల్పోయాయి.  పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు. 2007లో ఎంపీపీగా ఎన్నికై, ఆ తర్వాత డీసీసీబీ ఛైర్మన్ ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో చాలా తక్కువ తేడాతో ఓడిపోయారు. ఆయనను కేసులతో వేధించినప్పుడు పార్టీ పరంగా నిలిచాం. కేసుల టెన్షన్, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల రాజా చనిపోయారు. రాజా కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుంది." - చంద్రబాబు

పార్టీకి తీరని లోటు 

అంతకు ముందు వరుపుల రాజా హఠాన్మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజా మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. రాజా కుటుంబసభ్యులను ఫోన్‌ లో పరామర్శించి  తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి బయల్దేరి ప్రత్తిపాడు వచ్చారు చంద్రబాబు. ప్రత్తిపాడులో వరుపుల రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు.  టీడీపీ నేత వరుపుల రాజా మృతి షాక్‌కి గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. తెలుగుదేశం కుటుంబం మరో నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వరుపుల రాజా ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన ఆదివారం హైదరాబాద్ నుంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు గ్రామం చేరుకుని రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాను, పార్టీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే గుండె పోటుతో అకస్మాత్తుగా మృతి చెందడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని పార్టీ బలోపేతానికి వరుపుల రాజా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.వరుపుల రాజా కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
      
తెదేపా నాయకులు వరుపుల రాజా గుండె పోటుకు గురై కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం జిల్లాల్లో విస్తరించి ఉన్న అరకు పార్లమెంటు పరిధిలోని సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల పరిశీలకునిగా తెలుగుదేశం పార్టీ తరఫున నియమితులై, సాలూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గుమ్మడి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే బంజు దేవ్ లతో కలిసి మండల కేంద్రం సాలూరులో ఎన్నికల ప్రచారం శనివారం పూర్తి చేసుకుని సాయంత్రం 6గంటలకు స్వగ్రామం చేరుకున్న ఆయన తన సమీప బంధువుతో మాట్లాడుతుండగా ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే శంఖవరంలోని పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పర్వత సురేష్ కు సమాచారం అందించారు. వెంటనే కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా హృదయ స్పందన శాశ్వతంగా ఆగిపోయింది. కడపటి ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో రాజా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైన చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం ప్రత్తిపాడు చేరుకుని రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.రాజా అంతిమ యాత్ర క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం నిర్వహించారు. చంద్రబాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, రాజా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. 
 
వరుపుల రాజా 1976 ఆగస్టు 14న పెదశంకర్లపూడిలో జన్మించారు.అసలు పేరు జోగిరాజు. తాత వరుపుల జోగిరాజు ఒకసారి, చిన్న తాత వరుపుల సుబ్బారావు రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు. భార్య సత్యప్రభ, పిల్లలు మాధురి, తర్షిత్.2066లో పెదశంకర్లపూడి ఎంపీటీసీ సభ్యులుగా,2009వరకు ఎంపీపీ గా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, వైకాపా యువజన అధ్యక్షునిగా పనిచేశారు.2011లో సొసైటీ అధ్యక్షుడు నుండి డీసీసీబీ చైర్మన్ గా,2014లో తెదేపా లో చేరి ఆప్కాబ్ వైస్ ఛైర్మన్ గా పనిచేశారు.2019లో తెదేపా టిక్కెట్ సాధించి ప్రత్తిపాడు నుండి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయారు.

 

Published at : 05 Mar 2023 07:04 PM (IST) Tags: CID Cases Chandrababu Varupula Raja TDP ysrcp govt Prathipadu

సంబంధిత కథనాలు

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!

TDP Vs Janasena: జనసేన - బీజేపీ మధ్య గ్యాప్‌కు కారణం ఎవరు ? పవన్ పట్టించుకోలేదా ? బీజేపీ నిర్లక్ష్యం చేసిందా ?

TDP Vs Janasena:  జనసేన -  బీజేపీ మధ్య గ్యాప్‌కు కారణం ఎవరు ? పవన్ పట్టించుకోలేదా ? బీజేపీ నిర్లక్ష్యం చేసిందా ?

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?

Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన

Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా