అన్వేషించండి

Prashanth Kishore: జగన్ దిగిపోవడం ఖాయం, తప్పయితే నా ముఖంపై పేడ పడుతుంది - పీకే కీలక వ్యాఖ్యలు

AP Latest News: ప్రముఖ జర్నలిస్టు బర్కాదత్‌కు ఢిల్లీలో ఆదివారం (మే 19) ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చేశారు.

Prashanth Kishore Comments on AP Elections: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ సీపీ అధికారంలో కొనసాగబోదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని అధికార పార్టీకి ఘోరమైన పరాజయం ఎదురు అవుతుందని తేల్చి చెప్పారు. తాము కచ్చితంగా గెలుస్తామని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినా ఫలితం ఉండబోదని అన్నారు. ఆయన నమ్మకం వ్యక్తం చేసినట్లుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ లాంటివారు కూడా చెబుతున్నారని.. వారి పార్టీలు ఎన్నికల్లో గెలవబోవని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు బర్కాదత్‌కు ఢిల్లీలో ఆదివారం (మే 19) ప్రశాంత్ కిషోర్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ తాజా వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఈ ఎన్నికల ఫలితాల్లో నా అంచనాలు తప్పయితే నా ముఖంపై పేడ పడుతుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో నాతో సవాలు చేసిన అమిత్ షా ముఖంపై పేడ పడింది. అలాగే జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి. నేను చెప్పింది నిజమైతే జగన్ మోహన్ రెడ్డి ముఖంపై పేడ పడుతుంది.. లేదంటే నాపై పడుతుంది’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

ఎన్నికల ముందే ఓటమిని ఏ రాజకీయ నాయకుడు కూడా అంగీకరించరని పీకే తెలిపారు. తాను పదేళ్లకు పైగానే ఎన్నికల క్షేత్రంలో పని చేస్తున్నానని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజు నాలుగైదు రౌండ్లు పూర్తయిన తర్వాత వరకు కూడా రాజకీయ నాయకులు ఓటమిని అంగీకరించబోరని చెప్పారు. రాబోయే రౌండ్లలో తమకే మెజారిటీ వస్తుందనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తుంటారని చెప్పారు. అటు  చంద్రబాబు కూడా ఈ ఎన్నికల్లో గెలుస్తామని చెబుతున్నారని.. అయితే, జగన్‌ మాత్రం గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 

మరోవైపు, దేశవ్యాప్త ఎన్నికల పరిణామాలపై ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గతంలో కంటే సీట్లు తగ్గవని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ, మోదీలపై అసంతృప్తి ఉందని.. అంతేకానీ, ఆగ్రహం లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. కాబట్టి, బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ, లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Janasena Rajya Sabha Nominee Lingamaneni Ramesh: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన
జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ - అధికారిక ప్రకటన

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
ఢిల్లీ చేరకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అరెస్టు చేస్తారా?
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
US Iran conflict:హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
హొర్ముజ్‌ జలసంధి వద్ద మరోసారి ఉద్రిక్తత! ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా! ఆయుధాలపై ట్రంప్ కీలక ప్రకటన!
Peddi Collections Day 2: రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
రామ్ చరణ్ ర్యాంపేజ్... రెండో రోజూ 'పెద్ది' జోరు... ఫ్రైడే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
India Predicted Playing XI Vs AFG: ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
ఆఫ్గాన్ తో టీమిండియా పోరు.. బుమ్రా, జడేజా లేకుండానే బరిలోకి.. ముల్లాన్‌పూర్ లో కొత్త ప్లేయర్ టెస్ట్ డెబ్యూ..!
Embed widget