Air Pump in Rectum: మలద్వారంలో హై ప్రెషర్ గాలి పంపు పైపు.. బర్త్ డే పార్టీలో వికృత చేష్ట, చివరికి ఏం జరిగిందంటే..
ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. బర్త్ డే జరుపుకుంటున్న వ్యక్తి మల ద్వారంలో గాలి పంపు పెట్టి అతని స్నేహితులు గాలి కొట్టారు. దీంతో అతి ప్రాణాలు పోయేంత వరకూ వెళ్లింది.
పుట్టిన రోజు వేడుకల్లో కొంత మంది మరీ మితిమీరినట్లు ప్రవర్తిస్తారు. సాధారణంగా ముఖానికి కేకు పూయడం, ముఖమంతా ఫోమ్ స్ప్రే చేయడం చూస్తుంటాం. ఇంకొంత మంది మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. గతంలో పుట్టిన రోజు జరుపుకునే వ్యక్తిని కింద పడేసి తన్నడం, ప్యాంటులో ఐస్ ముక్కలు వేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సరదాగా ఆటపట్టిద్దామని చేసే ఈ పనులు ఒక్కోసారి విషాదాంతాలు అవుతుంటాయి. కానీ, తాజాగా ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన జరిగింది. బర్త్ డే జరుపుకుంటున్న వ్యక్తి మల ద్వారంలో గాలి పంపు పెట్టి అతని స్నేహితులు గాలి కొట్టారు. దీంతో అతి ప్రాణాలు పోయేంత వరకూ వెళ్లింది.
ప్రకాశం జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రానైట్ క్వారీలో కార్మికుడిగా పనిచేస్తున్న యువకుడు.. బర్త్ డేను స్పేహితులతో ఘనంగా చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆకతాయి స్నేహితుల అత్యుత్సాహం కారణంగా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వేడుకల్లో స్నేహితులు చేసిన పనికి పొట్టలో పేగులు పగిలిపోయి కోమాలోకి వెళ్లే స్థితికి చేరాడు. అయితే.. యువకుడికి సకాలంలో వైద్యం అందడటంతో చివరకు బతికాడు.
ఓ గ్రానైట్ కంపెనీలో పనిచేసే ఓ యువకుడు తన పుట్టినరోజు వేడుకలను అర్ధరాత్రి జరుపుకుంటున్నాడు. కేక్ కట్ చేసేందుకు స్నేహితులను పిలిచాడు. కేరింతల మధ్య కేక్ కట్ చేసి స్నేహితులందరికీ తినిపించాడు. అయితే పార్టీలో పాల్గొన్న కొంతమంది అకతాయి స్నేహితులు దుర్మార్గంగా ప్రవర్తించి ఆ యువకుడి బర్త్ డేను విషాదంగా మిగిల్చారు. క్వారీల్లో హైప్రెజర్ కోసం వాడే పంప్‌ను తీసుకొచ్చి ఆ యువకుడి మల ద్వారం వద్ద పెట్టారు. అనంతరం లోపలికి తీవ్ర ఒత్తిడితో గాలిని పంప్ చేశారు. దీంతో అతని పొట్ట బెలూన్‌లా ఉబ్బిపోయింది. స్నేహితుల ఆ ఒత్తిడితో కూడిన గాలి పేగుల్లోకి పోయి అవి పగిలిపోయాయి. దీంతో విపరీతమైన నొప్పితో ఆ యువకుడు విలవిలలాడిపోయాడు. కేకలు పెడుతూ ఏడుస్తుండటంతో స్నేహితులు జరిగిన ఘోరాన్ని తెలుసుకొని అప్పుడు యువకుడిని వదిలారు.
ఆ తర్వాత వెంటనే యువకుడిని ఒంగోలులోని సంఘమిత్ర అనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కోమాలోకి వెళ్లిన ఆ యువకుడికి వెంటనే ఆపరేషన్ చేసి పొట్టలోని గాలిని బయటకు పంపేశారు. పేగులు దెబ్బతిన్న చోట ఆపరేషన్ చేశారు. దీంతో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మరో గంట ఆలస్యం చేసి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని, ఇలాంటి శస్త్ర చికిత్సలు ప్రపంచంలోనే అరుదుగా జరుగుతుంటాయని డాక్టర్లు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం యువకుడు కోలుకుంటున్నాడని అన్నారు.
Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!
Also Read: Koo App: 'నచ్చిన, వచ్చిన భాషలో 'కూ'సేయండి.. స్వేచ్ఛగా, మరింత సులభంగా'
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి