By: ABP Desam | Updated at : 30 Dec 2022 06:57 PM (IST)
Edited By: jyothi
కేఏ పాల్
KA Paul On Chandrababu: కందుకూరు ఘటనలో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. టీడీపీ, చంద్రబాబు చేయబోయే పాదయాత్రలు, సభలకు అనుమతి ఇవ్వకూడదని మంగళగిరి డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. ఆయన కారును లోపలికి అనుమతించకపోవడంతో కాసేపు డీజీపీ కార్యాలయం ఎదుట కే.ఏ పాల్ హడావుడి చేశారు. డీజీపీ కార్యాలయం బయటే చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ప్రజలు చనిపోయినా సభలకు అనుమతి ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని తెలిపారు. డీజీపీ చర్యలు తీసుకోవాలని, తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో నియంత పాలన నడుస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సభలు నిర్వహించకూడదని అన్నారు. చంద్రబాబుకు ఏమైనా మానవత్వం ఉందా అని ప్రశ్నించారు.
నిన్న చంద్రబాబుపై ఫిర్యాదు..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు బుధవారం నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు, నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనపై కందుకూరు పోలీస్ స్టేషన్‌లో కేఏ పాల్ చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. ఇరుకు సందులో చంద్రబాబు సభ పెట్టారని కేఏ పాల్ ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా చంద్రబాబు కందుకూరులో సభలో పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన సభకు వేలాదిగా జనం హాజరయ్యారు. ఈ సభలో తొక్కిసలాట జరిగి ఒకరిమీద మరొకరు పడటంతో కిందనున్న వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో భయాందోళనతో కొందరు పరుగులు తీశారు. ఈ తొక్కిసలాటలో కొందరు కాలువలో పడినపోయారు. వారిపై మరికొందరు పడడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
అసలేం జరిగిందంటే..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ర్యాలీ సందర్భంగా కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిచ్చయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. కందుకూరు పోలీస్ స్టేషన్ లో 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది.
కందుకూరులో చంద్రబాబు రోడ్‌షోలో తొక్కిసలాటపై నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు విచారం వ్యక్తం చేశారు. కందుకూరు ఘటన దురదృష్టకరమన్నారు. ఎన్టీఆర్ సర్కిల్‌లో చంద్రబాబు సభ ఏర్పాటు చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ లో అయితే తొక్కిసలాట జరిగే ఆస్కారంలేదన్నారు. అనుమతి ఇచ్చిన ప్రాంతాన్ని దాటి ఇరుకుగా ఉన్న రోడ్డు వైపు చంద్రబాబు వెళ్లారన్నారు. 46 మీటర్లు ముందుకు చంద్రబాబు వాహనం వెళ్లడంతో ఆసమయంలో జనం ఒక్కసారిగా ఇరుకుగా ఉన్న చోటికి చేరటంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన పిచ్చయ్య ఇచ్చిన ఫిర్మాదుతో కేసు నమోదు చేశామన్నారు. పూర్తి స్థాయిలో విచారించి పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేస్తామని ఎస్పీ విజయరావు తెలిపారు.
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా
Breaking News Telugu Live Updates: ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గించిన ఏపీ సర్కార్
Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన
Kotamreddy Security: కోటంరెడ్డికి ఏపీ సర్కార్ షాక్, సెక్యూరిటీ సగానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!
AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
NTR Death : తెరమీదకు ఎన్టీఆర్ మరణం, టీడీపీకి చెక్ పెట్టేందుకా? డైవర్ట్ పాలిటిక్సా?
TS High Court : న్యాయమూర్తికే నోటీసులిచ్చిన న్యాయవాది, జైలుకు పంపిస్తామని హైకోర్టు సీరియస్