AP Politics : కొత్త ఏడాది ఫస్ట్ జీవో టార్గెట్ ఎవరు ? ఇక ఏపీలో లోకేష్, పవన్ రోడ్డెక్కలేరా ?
రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన జీవో నెంబర్ 1పై రాజకీయ దుమారం రేగుతోంది. న్యాయపోరాటం చేసైనా రాజకీయ పోరాటం చేస్తాం కానీ జగన్‌కు భయపడేది లేదంటున్నారు.
AP Politics : సభలు సమావేశాలను నిర్వహణ పై ఆంద్రప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం పై రాజకీయ దుమారం మొదలైంది.టీడీపీ నుండి నారా లోకేష్ బస్సుయాత్రకు, వారాహి వాహనం ద్వార జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్న తరుణంలో సర్కార్ తాజా ఉత్వర్వులు జారీ తో రాజకీయంగా చర్చకు దారితీస్తోంది.
వివాదాస్పదమవుతున్న జీవో నెంబర్ 1
ఏపీలో ఇటీవల జరిగిన ఘటనలను పరిగణంలోకి తీసుకొని హోంవ శాఖ జీవో నెంబర్ 1ను జారీ చేశారు.ఇటీవల కందుకూరు , గుంటూరులో టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవటం,ఆ పైన మరి కొందరు గాయాల పాలవటంతో భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉండే విదంగా ప్రణాళికలను సిద్దం చేస్తూ,రాజకీయ పార్టీల,సభలు, సమావేశాలపై ఆంక్షలను విధించింది. తప్పని సరి పరిస్దితుల్లో అయితేనే స్దానిక ఎస్పీ,లేదా పోలీస్ కమీషనర్ ఇచ్చే అనుమతులు వాటి షరతులకు లోబడి సభలు నిర్వహించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని పై రాజకీయ దుమారం మెదలైంది. ప్రతిపక్షాలు అన్ని జగన్ ప్రభుత్వ వైఖరి పై సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం కోసం పని చేసే రాజకీయ పార్టీలను అడ్డుకోవాలని,ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని చంద్రబాబు సభలకు వచ్చే జనాన్ని చూసిన వైసీపీ ప్రభుత్వానికి భయం వేసి,ఆంక్షలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఫైర్ అయ్యింది.
లోకేష్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్ర కష్టమేనా ?
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల వేడి బాగా పెరిగింది.రాజకీయ పార్టీలన్నీ జగన్ సర్కాన్ టార్గెట్ గా చేసుకొని రాజకీయం నడిపేందుకు రెడీ అవుతున్నారు.ఇందలో భాగంగానే వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందంటూ టీడీపీ యువనేత, పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్రకు రెడీ అయ్యారు. నాలుగు వందల రోజులు, నాలుగు వేల కిలోమీటర్ల మేర పాదయాత్రకు అవసరం అయిన రూట్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో నియోజకవర్గ నేతలతో కలసి సభలు, సమావేశాలు నిర్వహించుకోవటం, ఇందుకు పార్టీ శ్రేణులను భారీగా తరలించేందుకు ప్రణాళికలను సిద్దం చేసుకున్నారు. మరో వైపున జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనం రెడీ చేసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ లో పవన్ బస్సు యాత్రకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జీవో తో ఈ ఇధ్దరు నేతలు తలపెట్టిన ఉద్యమాలు పై ఎలాంటి ప్రభావం ఉంటుదనే చర్చ మెదలైంది. అయితే ప్రభుత్వం ఎకపక్షంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి ఆదేశాలను పట్టించుకునే పరిస్దితి ఉండదని ఆయా పార్టీలకు చెందిన నేతలు కొట్టి పారేస్తున్నారు.
ఇబ్బందులు కలిగిస్తే న్యాయపోరాటం !
ప్రభుత్వం ఇష్టాను సారంగా ఆదేశాలు తీసుకువచ్చి,రాజకీయ పార్టీలు,వాటి కార్యకాలాపాలను ఇష్టాను సారంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తే, న్యాయపోరాటానికి సిద్దం అవుతామని నేతలు అంటున్నారు. నారా లోకేష్ పాదయాత్రకు అన్ని ఏర్పాట్లు చేసుకోని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోవాల్సిందే అనే లక్ష్యంతో ముందుకు వెళుతున్న తరుణంలో, తప్పని సరి అయితే న్యాయం స్దానంను ఆశ్రయించి అయినా పాదయాత్రకు అనుమతులు తీసుకోవాలని అనుకుటున్నారు. సభలు,సమేశాలు నిర్వహించుకోవటానికి అవసరం అయిన అన్ని మార్గాలను ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు సిద్దంచేసుకుంటున్నారని చర్చ జరుగుతుంది. నారా లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు ఏర్పరుచుతుందని భావించామని అన్నింటికీ సిద్ధమయ్యామని టీడీపీ నేతలంటున్నారు.
అదే దారిలో జనసేన....!
జనసేన అదినేత పవన్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని బస్సు యాత్రకు ప్లాన్ చేసుకున్నారు .ఇందు కోసం జనసేనాని ప్రత్యేకంగా వారాహి పేరుత వాహనాన్ని సైతం సిద్దం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు జీవో నెంబర్ 1 ద్వార ప్రభుత్వం ఆంక్షలను పెట్టాలని చూస్తే పవన్,దాన్ని ఎలాగయినా ఎదుర్కోంటారని జనశ్రేణులు అంటున్నారు..