అన్వేషించండి

Srikakulam Crime News: ప్లాన్ ప్రకారమే దాడి చేసి హతమార్చారు, శ్రీకూర్మంలో మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

గార మండలంలోని శ్రీకూర్మంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. భూ వివాదాలే హత్యకి కారణమని తేల్చారు. పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లుగా గుర్తించారు.

Srikurmam Murder Case | గార: శ్రీకూర్మంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. భూ వివాదాలే హత్యకి కారణమని తేల్చారు. పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లుగా గుర్తించారు. ఈ మేరకు హత్యకి పాల్పడ్డ 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 3 గొడ్డళ్ళు, 3 కత్తులు, 2 కర్రలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

 దారికాచి మరణాయుధాలతో విచక్షణారహితంగా దాడి

ఈ నెల 6వ తేదిన రాత్రి 7 నుంచి 7.30 గంటల ప్రాంతంలో శ్రీకూర్మం గ్రామంలో సుమారు 8 మంది వ్యక్తులు కత్తులు, గొడ్డలితో ముగ్గురు వ్యక్తులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో రాజేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి రాము, సరోజనికి తీవ్రగాయాలయ్యాయి. విశాఖపట్నం కెజిహెచ్ లో చికిత్స పొందుతున్నారన్నారు. ఘటనపై గార పోలీసులకి సమాచారం అందడంతో ఎస్ .ఐ జనార్థన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు తాను, శ్రీకాకుళం సి.ఐ పైడపునాయుడు ఘటనా స్థలానికి వెళ్ళి హత్య జరిగిన తీరుపై విచారణను చేపట్టామన్నారు.

స్థానికుల చెప్పిన వివరాల ఆధారంగా నింధితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. వారు అన్ని కోణాలలో దర్యాప్తు నిర్వహించగా భూ వివాదాల కారణంగానే హత్య చేసినట్లుగా వెలుగుచూసిందన్నారు. పథకం ప్రకారం నింధితులు అంతా కలసి రాజేష్ , రాము, సరోజనిలపై దాడి చేసారన్నారు. గతంలో కూడా వారు రాము అనే వ్యక్తిపై దాడికి పాల్పడి హత్య చేయడానికి ప్రయత్నించారన్నారు. అప్పట్లో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

గార మండలం శ్రీకూర్మంలో ఈ నెల 6న జరిగిన హత్య కేసులో గ్రామానికి చెందిన 8 మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ వివేకా నంద తెలిపారు.  స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి క్రైం వివరాలను వెల్లడించారు. భూ వివాదమే హత్యకు కారణమని ఆయన తెలిపారు.

Also Read: Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత

ఉప్పాడ రాములమ్మకు చెందిన 1.40 ఎకరాల భూమిని మృతుడు రాజేష్ సహకారంతో ఉప్పాడ సూర్యనారాయణ, చుక్కా రాము, అనపాన షన్ముఖరావు కొనుగోలు చేశారనే కక్షతో దాడి చేశారని తెలిపారు. దారికాచి కత్తులు, గొడ్డళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో రాజేష్ మృతి చెందగా, తీవ్రగాయాలపాలైన చుక్కా రాము కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. రామును కాపాడడానికి వచ్చిన ఆయన భార్య సరోజిని గాయాలపాలైందని, దాడి నుంచి ఉప్పాడ సూర్యనారాయణ తృటిలో తప్పించుకున్నారని తెలిపారు. 2018లో భూవివాదం కారణంగానే సూర్యనారాయణపై కొయ్య భాస్కరరావు కుటుంబ సభ్యులు దాడి చేశారని తెలిపారు. ఇప్పటికీ ఈ కేసు న్యాయస్థానంలో ఉందని, ఉప్పాడ రాములమ్మ వద్ద కొనుగోలు అగ్రిమెంట్ చేసుకున్న భూమి కొయ్యభాస్కరరావు ఆధీనంలోనే ఉందని, దీన్ని అగ్రిమెంట్ చేసుకున్నవారు స్వాధీనం చేయకుండా అడ్డుకోవడానికి ఉద్దేశ పూర్వకంగానే మారణాయుధాలతో విచక్షణ రహితంగా దాడి చేశారని తెలిపారు.

ఆయుధాలు స్వాధీనం, నిందితులపై రౌడీ షీట్

సూర్యనారాయణ, చుక్కా రాము, మృతి చెందిన రాజేష్ మంచి స్నేహితులని, దాడికి అదే కారణమని తెలిపారు. రాములమ్మ భూమిని కొనుగోలు చేయిండంలో కీలకంగా వ్యవహరించాడని, ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆ భూమితో రాజేష్కు సంబంధం ఉందని విచారణలో గుర్తించి నట్టు తెలిపారు. దాని పర్యవసానమే ముగ్గురుపై దాడి చేశారని తెలిపారు. దాడిలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్న కొయ్య భాస్కరరావు, కొయ్య రమేష్, కొయ్య లోకేష్, కొయ్య సాయికిరణ్, కొయ్య గురయ్య, గుజ్జు లక్ష్మణ, గుజ్జు రామారావు, గుజ్జు శ్రీనును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్టు తెలిపారు. వీరి నుంచి దాడికి ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, వీరిపై రౌడీషీట్ తెరవనున్నట్టు తెలిపారు.

అదుపులో కాపర్ దొంగలు

గార పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రైమెక్స్ పాటు సరుబుజ్జిలి, బొబ్బిలిలో రూ.27 లక్షలు విలువైన కాపర్ ప్లేట్స్, ట్రాన్స్ఫార్మర్స్లోని కాపర్ కేబుల్స్ను చోరీ చేసిననలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ వివేకానంద తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను తీసుకువచ్చి క్రైం వివరాలను వెల్లడించారు. ట్రైమెక్స్లో ట్రాన్స్ ఫార్మర్లోని కాపర్ ప్లేట్లు, కేబుల్స్ చోరీకి గురయ్యాయని వచ్చిన ఫిర్యాదుపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి దర్యాప్తు చేసినట్టు డీఎస్పీ వెల్లడించారు.

కొమరవానిపేటకు చెందని కొమర తారకేశ్వరరావుతో పాటు గాజువాక (గంట్యాడ)కు చెందిన కదిరి హరీష్, గడ్డపాటి తిలక్, చెన్ను చంటి కలిసి ట్రైమెక్స్లో రూ.26 లక్షలు, సరుబుజ్జిలి, బొబ్బిలి పోలీస్ స్టేషన్లు పరిధిలో రూ.లక్ష విలువైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కేబుల్స్ చోరీ చేసి వాటిని గాజువాకలోని పైలా ప్రకాష్ అనే స్క్రాప్ నిర్వాహకుడికి విక్రయించినట్టు గుర్తించామన్నారు. ట్రైమెక్స్లోని కాపర్ ప్లేట్లు, కేబుల్స్ను కారులో నాలుగు సార్లు తరలించినట్టు గుర్తించామన్నారు. కారులో తరలిస్తుండగా పట్టుబడిన నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించి వారి నుంచి 772 కేజీల కాపర్ ప్లేట్లను, కేబుల్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. చోరీ కాపర్ను కొనుగోలు చేసిన స్క్రాప్ నిర్వాహకుడు పైలా ప్రకాష్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న నలుగురు పాత నేరస్తులేనని, వీరిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతితండ్రి ఆరోపణలపై మంచు మనోజ్ ఫైర్Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manoj: మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
మోహన్‌బాబు ఇంటి గేటు తోసేసుకుని లోపలికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులు - తీవ్ర ఉద్రిక్తత
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Pushpa 2: ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
ఇండియా అంతటా పూనకాలే... కానీ కేరళలో మాత్రం ఎందుకిలా? 'పుష్ప 2' విషయంలో మల్లు అభిమానం ఏమైంది?
Fastest Mobile Internet: ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
ప్రపంచంలో ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ అందించే టాప్-10 దేశాలు ఇవే!
CSIR UGC NET 2024: సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) - 2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం - పరీక్ష ఎప్పుడంటే?
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Vijayawada News: దేవినేని ఉమ, టీడీపీ నేతలకు ఊరట, కేసును కొట్టేసిన విజయవాడ కోర్టు
Embed widget