అన్వేషించండి

Akividu issue: చలో ఆకివీడు అంటూ భారీ ప్రచారం - పోలీసుల వార్నింగ్ - ఆదివారం ఏం జరగబోతోంది?

Chalo Aakiveedu: చలో ఆకివీడు పేరుతో కొంత మంది ఇచ్చిన పిలుపు పోలీసులకు టెన్షన్ పుట్టిస్తున్నాయి. ఆలయ వివాదం కావడంతో పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు.

Akividu tension:  పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రామాలయం వివాదం,  రాజకీయ ఉద్రిక్తతల కారణంగా కొంత మంది సోషల్ మీడియాలో చలో ఆకివీడుకు పిలుపునిచ్చారు. అయితే ఎవరు పిలుపునిచ్చారో స్పష్టత లేదు. రఘురామకృష్ణరాజు కూడా ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ  కార్యక్రమానికి అనుమతి లేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు  ప్రకటించారు.  పట్టణంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు జాగ్రత్తగా  144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఆకివీడులో ఈ స్థాయి ఉద్రిక్తతకు ప్రధాన కారణం ఇటీవల అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పర్యటనలో చోటుచేసుకున్న ఘర్షణలే. పెద్దపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణం విషయంలో  వివాదం, రాజకీయ దాడులకు దారితీసింది. రఘురామ అనుచరులపై జరిగిన దాడిని నిరసిస్తూ  కొన్ని హిందూ సంఘాలు చలో ఆకివీడు కు పిలుపునిచ్చినట్లుగాప్రచారం జరిగింది. ఇప్పటికే ఈ దాడికి సంబంధించి 21 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో 50 మందిపై కేసులు నమోదయ్యాయి.   

డీఎస్పీ రఘువీర్ విష్ణు మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.  పట్టణంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. శాంతికి విఘాతం కలిగించాలని చూసే వారిపై, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠినమైన  భారతీయ న్యాయ సంహిత  నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, బయటి వ్యక్తులు పట్టణంలోకి రాకుండా ఆంక్షలు విధించారు.

ప్రస్తుతం ఆకివీడులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని, టెక్నికల్ ఆధారాలతో నిందితులందరినీ బయటకు తీస్తామని చెబుతుండగా.. ప్రభుత్వం మాత్రం ఎక్కడా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తమైంది. ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Ampolu Jail Visit: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్షసాధింపు - ప్రమాదం హత్య కాదన్న జగన్ - అప్పలరాజుతో ములాఖత్ క్యాన్సిల్
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Embed widget