Verma Reaction: ఎవడో కర్మ అంటే నాకేంటి.. ఎవడో గడ్డిపరక అంటే నాకేంటి? - నారాయణ ఆడియోపై వర్మ ఫస్ట్ రియాక్షన్
Pithapuram: నారాయణ ఆడియోపై పిఠాపురం టీడీపీ నేత వర్మ స్పందించారు. ఎవడో కర్మ అంటే నాకేంటి.. ఎవడో గడ్డిపరక అంటే నాకేంటని ప్రశ్నించారు.

Pithapuram TDP leader Verma responded to Narayana audio: పిఠాపురంలో వర్మను జీరో చేశామంటూ మంత్రి నారాయణ మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియో వైరల్ అయింది. దీనిపై ఇన్ డైరెక్ట్ గా స్పందించిన వర్మ నారాయణపై సెటైర్లు వేశారు. తాను ఎప్పుడూ టీడీపీకి ఫైర్ బ్రాండేనని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో నాది 23 ఏళ్ల ప్రయాణం..ఎన్నికల్లో చంద్రబాబు ఆగు వర్మ అంటే ఆగిపోయానన్నారు. వర్మ ఈ పని చేయ్ అంటే చేశాను అని గుర్తు చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో నేను, నా భార్య, నా కుమారుడు ప్రచారం చేశామన్నారు.
కూటమి బలోపేతం కోసం నేను ఎప్పుడూ మౌనంగానే ఉంటానని.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాధానం చెప్పనన్నారు. చంద్రబాబు, లోకేష్ పై నాకు ఎంత ప్రేమ ఉందో వాళ్లకి తెలుసని.. ఎవరో ఏదో అన్నారని నేను లక్ష్మణ రేఖ దాటనని స్పష్టం చేశారు. ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి.. వర్మ అంటే ఏమిటో పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసన్నారు.
నారాయణ ఆడియోలో ఏముందంటే ?
నెల్లూరు జిల్లా నేతలతో మాట్లాడినప్పుడు కూటమి నేతల మధ్య వివాదాలపై స్పందించారు. సీఎం చాలా క్లియర్‌గా కేబినెట్‌లో ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. చట్టం దాని పైన అది చేసుకుంటుందని అన్నారు. మూడు పార్టీలు కలిసి ఏర్పడిన ప్రభుత్వం. మూడు పార్టీలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను కాకినాడ ఇంచార్జి మంత్రిని పిఠాపురంలో పవన్ ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ నేతతో వాళ్లకు ఘర్షణ జరుగుతుంది. వర్మ చాలా దూకుడు ఉన్న వ్యక్తి. ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచారు. ఆయన స్థానంలో పవన్ పోటీ చేసి విజయం సాధించారు. దీంతో కూటమి నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి అతన్ని జీరో చేశాం. కలిసి ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇవ్వటానికి లేదని చెప్పాం. పార్టీ మాట్లాడంటే మాట్లాడు లేదంటే మాట్లాడొద్దు అని చెప్పామన్నారు. ఇంటర్నల్ గా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవద్దు. ఏదైనా ఉంటే నాకు ఇవ్వండి. నేను చూసుకుంటాను. అంతేగాని మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటే నేను సహించను అని స్పష్టం చేశారు. ఇదే ఆడియో వైరల్ అయింది.
వారానికి ఒక రోజు మనోహర్‌తో కూర్చుంటున్నాం. 15 రోజులకో 20రోజులకో పవన్ కళ్యాణ్, చంద్రబాబు చర్చిస్తున్నారు. చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి. కాకినాడ కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు ఇంకొన్ని వివాదాలు ఉండొచ్చు. అలా కూర్చొని మాట్లాడుతూ పరిష్కరించుకుంటాం. కానీ ఈ రోజు జనసేనలోని నెంబర్ టూ నిన్న ఫోన్ చేశారు. మేం ఎన్డీలో ఉన్నామా అని ప్రశ్నించారు. మీరేం చేయిస్తున్నారు నారాయణ గారు అని అడిగారు. నా డిపార్ట్మెంట్‌ని డీఫేమ్ చేస్తారా అని నిలదీశారు. మీ డిపార్ట్మెంట్‌పై నన్ను మాట్లాడమంటారా అని అడిగారు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. అంత అవసరం ఏం ఉందని నారాయణ ఆడియోలో ప్రశ్నించారు.





















