పిఠాపురంలో పవన్ విజయభేరి బహిరంగ సభ, భారీగా తరలివస్తున్న కూటమి శ్రేణులు
Pawan Kalyan Election Campaign: ఏపీ ఎన్నికల ప్రచారాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ప్రారంభిస్తున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు తొలి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.
Police Denies Perission to Pawan Kalyans Varahi sabha: పిఠాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల ప్రచారంలో తొలిరోజే చేదు అనుభవం ఎదురైంది. శ్రీపాద క్షేత్రంలో పవన్ కళ్యాణ్ వారాహి వాహనం పూజలకు అనుమతి లభించలేదు. పురూహుతిక అమ్మవారి ఆలయంలో పవన్ ప్రచార వాహనానికి పూజలు రద్దు చేశారు. నిర్ణీత గడువులోగా ప్రచార వాహనం వారాహికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదని పోలీసుల వెర్షన్ ఉంది. మరికాసేపట్లో చేబ్రోలులో పవన్ బహిరంగ సభ ఉండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సభకు తరలివస్తున్నాయి. ఒకవేళ వారాహి వాహనానికి పోలీసులు అనుమతి నిరాకరిస్తే.. వేరే వాహనంలో పవన్ రోడ్ షో నిర్వహించి వారాహి విజయ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారని జనసేన నేతలు చెబుతున్నారు.
పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్..
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజక వర్గంలో ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే, నియోజక వర్గ టిడిపి ఇంచార్జీ వర్మ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గొల్లప్రోలు నుంచి పి. దొంతమూరు వరకూ జనసైనికులు పవన్ కు ఘన స్వాగతం పలికారు. జనసేన, టిడిపి శ్రేణులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. టీడీపీ నేత వర్మ కుటుంబ సభ్యులు పవన్ ను సత్కరించారు. ఆయన మాతృమూర్తి అలివేలు మంగ పద్మావతి నుంచి పవన్ కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకున్నారు. అదే సమయంలో వర్మని, సుజయ్ కృష్ణ రంగారావుని పవన్ కళ్యాణ్ సత్కరించారు.
పిఠాపురం కేంద్రంగానే ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లనున్నారు. జనసేనాని ప్రచారం మూడు విడతలుగా ఉండనుండగా.. ప్రతి విడతలోనూ జనసేన అభ్యర్థులు పోటీ చేయబోయే నియోజకవర్గాలు కవర్ అయ్యేలా షెడ్యూల్ రూపొందించారు.
తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ పిఠాపురంలో 5 రోజులు పర్యటించనున్నారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 3న జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్న తెనాలిలో పవన్ ప్రచారం చేస్తారు. తొలి విడతలోనే అనకాపల్లి, కాకినాడ రూరల్ లో పవన్ క్యాంపెయిన్ చేయనున్నారు. ఏప్రిల్ 9న మరోసారి పిఠాపురంలో పవన్ ప్రచారం చేయడానికి ప్లాన్ చేశారు.
పవన్ తొలి విడత ప్రచార షెడ్యూల్
మార్చి 30 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పిఠాపురం
ఏప్రిల్ 3 - తెనాలి
ఏప్రిల్ 4 - నెల్లిమర్ల
ఏప్రిల్ 5 - అనకాపల్లి
ఏప్రిల్ 6 - యలమంచిలి
ఏప్రిల్ 7 - పెందుర్తి
ఏప్రిల్ 8 - కాకినాడ రూరల్
ఏప్రిల్ 10 - రాజోలు
ఏప్రిల్ 11 - పి.గన్నవరం
ఏప్రిల్ 12 - రాజా నగరం
టికెట్ల అమ్మకం ఆరోపణలు..
జనసేన పార్టీలో టీ టైం ఉదయ్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్నారని జనసేన పార్టీ అమలాపురం ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆరోపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇలా ఏడు నియోజకవర్గాల సీట్లు అమ్ముకున్నాడన్నారు. తనకు టిక్కెట్టు రాకపోవడం వెనుక టీడీపీ నాయకులు, తమ పార్టీలోనే కొన్ని శక్తులు అడ్డుకున్నాయన్నారాయన. వైసీపీ నుంచి తనకు ఎటువంటి ప్యాకేజీలు అందలేదని, పిఠాపురంలో పవన్ కల్యాన్ ను కలిసిన తరువాత తన కార్యచరణ ప్రకటిస్తానని రాజబాబు తెలిపారు.