అన్వేషించండి

మాజీ మంత్రి కొణతాలతో షర్మిల కీలక భేటీ

వైఎస్‌ షర్మిల మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. రాజకీయంగా సైలెంట్‌ అయిన కొణతాల కొద్దిరోజులు కిందటే జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షర్మిల భేటీ కావడం ఆసక్తిని రేపుతోంది. 

Pcc Chief Sharmila Meets Ex Minister Konathala : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన షర్మిల జోరు పెంచారు. రాజకీయంగా పార్టీని గాడిలో పెట్టేందుకు ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే జిల్లాలు వారీగా పర్యటన ప్రారంభించిన ఆమె.. కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలను పెంచేలా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం వైఎస్‌ షర్మిల విశాఖలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో భేటీ అయ్యారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారిలో రామకృష్ణ ఒకరు. వైఎస్‌ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆ తరువాత వైసీపీలోనూ కొన్నాళ్లపాటు పని చేశారు. రాజకీయంగా జగన్‌తో విబేధించిన ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ కోసం, రైల్వే జోన్‌ కోసం తనదైన శైలిలో పోరాటాన్ని సాగించారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తన వంతు ప్రయత్నాలను సాగించారు. గడిచని కొన్నాళ్లుగా రాజకీయంగా సైలెంట్‌ అయిన కొణతాల రామకృష్ణ కొద్దిరోజులు కిందటే జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో షర్మిల ఆయనతో భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. 

20 నిమిషాలకుపైగా సమావేశం.. 

విశాఖ నగరంలోని కొణతాల రామకృష్ణ ఇంటికి మంగళవారం రాత్రి పీసీసీ అధ్యక్షురాలు షర్మితోపాటు మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు ఇతర నాయకులతో కలిసి వెళ్లారు. మొదట లాబీలో అందరితో కలిసి మాట్లాడిన ఆమె.. ఆ తరువాత రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజుతో కలిసి ఏకాంతంగా కొణతాలతో చర్చలు జరిపారు. రాజకీయంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులతోపాటు కాంగ్రెస్‌లో చేరికపై వీరి మధ్య చర్చలు జరిగాయి. కానీ, రాజకీయంగా మాట్లాడామే తప్పా.. పార్టీలో చేరిక గురించి చర్చించలేదని ఇరువురు నేతలు బయటకు వచ్చి ప్రకటించారు. కానీ, వీరి కలయిక ఇటు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతోపాటు జనసేన పార్టీలోనూ కలకలం సృష్టించింది. 

అందుకే వచ్చానని చెప్పిన షర్మిల

కొణతాల రామకృష్ణతో సమావేశం అనంతరం బయటకు వచ్చిన షర్మిల మీడియాతో మాట్లాడారు. నాన్నతో కొణతాల అంకుల్‌ పని చేశారనని, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం కొద్దీ ఇంటికి వచ్చినట్టు తెలిపారు. అందరూ మాట్లాడుకున్నట్టుగానే రాజకీయాలు మాట్లాడామని, అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా మీడియాతో మాట్లాడారు. మేనమామ ఇంటకి వచ్చినట్టుగా షర్మిల వచ్చారని స్పష్టం చేశారు. తాను ఇది వరకే జనసేనలో చేరుతున్నట్టు స్పష్టం చేశానని, ఇందులో మార్పు లేదన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ తనకు ముఖ్యమని, వైసీపీ పాలన అంతమొందించడం జనసేన, టీడీపీ కూటమికే సాధ్యమన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్‌ పూర్తిగా విఫలమయ్యారని, పోలవరం, సుజల స్రవంతి, స్టీల్‌ప్లాంట్‌ వంటి అనేక అంశాల్లో రాష్ట్రానికి ప్రయోజనం కలిగించడంలో జగన్మోహన్‌రెడ్డి విఫలమయ్యాడన్నారు. 

కీలక పరిణామంగానే భావించాలి.. 

షర్మిల, కొణతాల భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది సాధారణ భేటీ అని ఇరువురూ చెబుతున్నప్పటికీ.. షర్మిల వెళ్లి కలవడం వెనుక రాజకీయ ప్రాధాన్యతలు ఉన్నాయని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి కొణతాలను ఆహ్వానించేందుకే షర్మిల ఇంటికి వెళ్లారు. అయితే, కొణతాల నుంచి సానుకూల స్పందన వచ్చిందీ, రానిదీ తెలియాల్సి ఉంది. ఇప్పటికే జనసేనలో చేరుతున్నట్టు కొణతాల ప్రకటించడం వల్ల వెనక్కి తగ్గే అవకాశం లేదు. కానీ, షర్మిల ఒత్తిడి, మాజీ సహచరులు రఘువీరారెడ్డి, రుద్రరాజు వంటి వారి సూచనలు ఎంత వరకు షర్మిల చర్చలకు దోహదం చేస్తాయో చూడాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
WhatsApp New Feature: వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేయకుండానే చూసేయచ్చు - కొత్త ఫీచర్ తెచ్చిన మెటా!
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Embed widget